రాకెట్ ప్రయోగించాలన్నా, మెదడుకు ఆపరేషన్ చేయాలన్నా పెద్దగా తెలివితేటలు అవసరం లేదా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
మెదడుకు శస్త్ర చికిత్సలు చేసే వైద్య వృత్తి లేదా అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొనే శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? ఆ లక్ష్యం చేరుకోవడం అంత కష్టమేమీ కాదు.ఈ రెండు వృత్తుల్లో పని చేస్తున్న వాళ్లు అందరి లాంటి వాళ్లే. మిగతా వారితో పోలిస్తే వారికి అసాధారణ తెలివితేటలేమీ లేవని పరిశోధనలో తేలింది.
329 మంది అంతరిక్ష ఇంజనీర్లు, 72 మంది న్యూరోసర్జన్లకు పరిశోధకులు కొన్ని క్లిష్టమైన పనులు అప్పగించి వాటిని పూర్తి చేయాలని చెప్పారు. ఈ ప్రయోగాల ఫలితాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. సాధారణ ప్రజలకూ వారికీ మధ్య చిన్న తేడాలే తప్ప మరేమీ కనిపించ లేదు.
ఏ వృత్తిలో ఉన్న వారిలో ఎక్కువ మేథస్సు ఉందో తెలుసుకునేందుకు ఈ చిన్న ప్రయోగం చేసినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ ప్రయోగంలో కొన్ని విభాగాల్లో పని చేస్తున్న వారి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలకు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది.
రాబోయే రోజుల్లో ఈ రెండు రంగాల వారికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. శాస్త్ర విజ్ఞాన రంగంలో భవిష్యత్ లో చేపట్టే నియామకాల్లో ఒకే రకమైన ప్రశ్నావళి వల్ల ఉపయోగం ఉంటుందని పరిశోధకులు సూచించారు.
రెండు గ్రూపులకు చెందిన వృత్తి నిపుణుల మేథస్సుని ఆన్‌లైన్ ద్వారా ఆరు విభాగాల్లో పరిశీలించారు. గ్రేట్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పేరుతో పిలిచే ఈ పరీక్షను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ రూపొందించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరీక్షలో భాగంగా, పనిచేసే చోట జ్ఞాపక శక్తి,, జాగరూకత, భావాల నియంత్రణ లాంటి వాటిపై పరీక్ష నిర్వహించారు. అలాగే పరీక్షలో పాల్గొన్న వారి వయసు, అనుభవం గురించి కూడా తెలుసుకున్నారు.
పరిశోధన ఫలితాలను రెండు గ్రూపుల వృత్తి నిపుణులతో పాటు 18వేల మంది బ్రిటిషర్ల నుంచి సేకరించిన డేటాతో పోల్చి చూశారు. కొన్ని అరుదైన పదాలకు సంబంధించిన అర్ధాలు అంతరిక్ష శాస్త్రవేత్తల కంటే న్యూరో సర్జన్లకే ఎక్కువగా జ్ఞాపకం ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
అటెన్షన్ తో పాటు బొమ్మల్ని రకరకాల కోణాల్లో గుర్తుంచుకోవడంలోనూ న్యూరో సర్జన్ల కంటే అంతరిక్ష శాస్త్రవేత్తల మేథస్సు బావుందని పరిశోధనలో వెల్లడైంది. సాధారణ ప్రజలకున్న నాలెడ్జ్‌తో పోల్చినప్పుడు అంతరిక్ష శాస్త్రవేత్తలు ఏ రంగంలోనూ గొప్ప తెలివితేటల్ని ప్రదర్శించలేదు.
న్యూరో సైంటిస్టులు రెండు విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచారు. సమస్యల్ని పరిష్కరించడంలో వేగంగా ఉన్నా, వారి జ్ఞాపక శక్తి చాలా నెమ్మదిగా ఉన్నట్లు తేలింది.
శస్త్ర చికిత్స చేసే సమయంలో ఒత్తిడితో కూడిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావడం, సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో శిక్షణ లాంటి అంశాల వల్ల న్యూరో సర్జన్లకు ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
న్యూరో సర్జన్లు, అంతరిక్ష శాస్త్రవేత్తలకు అనవసరంగా పరీక్ష నిర్వహించామని అనిపించవచ్చు. అయితే మిగతా విభాగాల వృత్తి నిపుణుల్ని కూడా తప్పక పరిశీలించాల్సిఉంది. భవిష్యత్ లో ఏది అత్యుత్తమమైన వృత్తి అని తెలుసుకునేందుకు ఇలాంటి పరిశోధన తప్పనిసరి కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీలో ప్రముఖులు నివసించే అక్బర్ రోడ్ పేరు మార్చేస్తారా, ఇంతకీ దేశ రాజధానిలో రహదారుల పేర్ల చరిత్ర ఏమిటి
- భారతదేశంలో వేల మంది గృహిణులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు
- ‘గర్ల్స్ డు పోర్న్’ బాధిత మహిళలకే ఆ వీడియోలపై హక్కులు, పరిహారం
- 1300 కాళ్ల ప్రాణి, ప్రపంచంలో ఇంకే జీవికీ ఇన్ని కాళ్లు లేవంటున్న శాస్త్రవేత్తలు
- గండికోట: సీమకు శిల కళ
- ధోనీ ఎవరికీ భయపడడు ఎందుకు?
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










