బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్సీ జాన్సన్ ‘వెనుక భాగంపై గట్టిగా కొట్టారు.. నీ సీటు లవ్‌లీగా ఉంది’ అన్నారు - ఎంపీ సహా ఇద్దరు మహిళల ఆరోపణ - BBC Newsreel

ఫొటో సోర్స్, UK PARLIAMENT
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ తమను అసభ్యంగా తాకారని.. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఒక ఎంపీ సహా ఇద్దరు మహిళలు ఆరోపించారు.
2003లో టోరీ పార్టీ సదస్సు వద్ద స్టాన్లీ జాన్సన్ తన వెనుకవైపు గట్టిగా కొట్టి, ''ఓ రామ్సీ.. నీ సీటు లవ్‌లీగా ఉంది'' అని వ్యాఖ్యానించారని.. కరోలిన్ నోక్స్ తాజాగా స్కై న్యూస్‌తో చెప్పారు.
కరోలిన్ నోక్స్ 2010 నుంచి రామ్సీ, సౌతాంప్టన్ ఎంపీగా ఉన్నారు. ఆమె ఆరోపించిన సంఘటన జరిగినట్లు చెప్తున్న 2003 కన్జర్వేటివ్ పార్టీ సదస్సు సమయంలో ఆమె పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.
ఇక.. 2019 కన్జర్వేటివ్ సదస్సులో స్టాన్లీ జాన్సన్ తన శరీరాన్ని అసభ్యంగా తడిమారని.. న్యూ స్టేట్స్‌మన్ మేగజీన్ పొలిటికల్ కరెస్పాండెంట్ ఏల్బీ రియా ఆరోపించారు.
కరోలిన్ నోక్స్ గురించి తనకు గుర్తులేదని స్టాన్లీ జాన్సన్ స్కై న్యూస్‌తో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ ఇద్దరు మహిళలు చేసిన ఆరోపణలపై స్పందించాల్సిందిగా స్టాన్లీ జాన్సన్‌ను బీబీసీ కోరింది.
''కరోలిన్ నోక్స్ గురించి నాకు గుర్తులేదు. కానీ.. ఇదిగో. నో రిప్లై (జవాబు లేదు)... హే హో.. గుడ్ లక్ అండ్ థాంక్స్'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల అనంతరం.. రియా ట్వీట్ చేశారు. ''స్టాన్లీ జాన్సన్ 2019లో పార్టీ సదస్సులో నన్ను కూడా అసభ్యంగా తాకారు'' అని అందులో ఆరోపించారు.
''మేమెవరమూ సహించరాని దాని గురించి.. అసలు ప్రధానమంత్రి తండ్రి పనుల గురించి.. కరోలిన్ నోక్స్ గొంతెత్తినందుకు చాలా కృతజ్ఞతలు'' అని ఆమె పేర్కొన్నారు.
కరోలిన్ నోక్స్ హోం వ్యవహారాల మంత్రిగా, కార్మిక, పెన్షన్ల శాఖ మంత్రిగా, కేబినెట్ ఆఫీస్ మంత్రిగా పనిచేశారు.
యూరోపియన్ పార్లమెంటు మాజీ సభ్యుడైన స్టాన్లీ జాన్సన్ ఎన్నడూ ఎంపీగా ఎన్నికవలేదు.

ఫొటో సోర్స్, Getty Images
హార్దిక్ పాండ్య: రూ. 5 కోట్లు కాదు ఆ వాచీల ధర రూ. 1.5 కోట్లే
దుబయి నుంచి భారత్ వస్తున్న క్రికెటర్ హార్దిక్ పాండ్య దగ్గర రెండు వాచీలను ముంబయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5 కోట్లని ప్రచారం జరగడంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు.
క్రికెటర్ దగ్గర ఈ వాచీలకు సంబంధించి సరైన రశీదులు లభించలేదని ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.
హార్దిక్ పాండ్య దగ్గర ఉన్న ఆ వాచీల ఇన్వాయిస్ సీరియల్ నంబర్లలో గందరగోళం ఏర్పడిందని చెబుతున్నారు.
అంటే, అతడు సరైన సీరియల్ నంబర్ ఉన్న ఇన్వాయిస్‌లను కస్టమ్స్ విభాగానికి ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే క్రికెటర్ హార్దిక్ పాండ్య ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన హార్దిక్ పాండ్య ట్విటర్‌లో ఒక ప్రకటన చేశాడు.
"దుబయి నుంచి తీసుకొచ్చిన అన్ని వస్తువులూ చూపించి, వాటిపై వేసిన టాక్సులు చెల్లించడానికి నేను స్వయంగా ముంబయి ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లాను.
ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్‌లో ఏదేదో జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి.
ముంబయి ఎయిర్ పోర్టులో జరిగిన అన్ని విషయాలపై నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా" అన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"నేను స్వచ్ఛందంగా వారికి అన్ని వస్తువుల గురించి చెప్పాను. వాటిని దుబయిలో చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. వాటికి ఎంత పన్ను చెల్లించాలో అది చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
కస్టమ్స్‌లో నేను కొనుగోలు చేసిన దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని అడిగారు.
ఆ వస్తువులపై పన్ను వేయడానికి వాటి ధరలను అంచనా వేస్తోంది. ఆ డ్యూటీ చెల్లించడానికి నేను ముందే అంగీకరించాను".
"ఆ వాచీల ధర రూ.1.5 కోట్లు. సోషల్ మీడియాలో చెబుతున్నట్లు రూ.5 కోట్లు కాదు. నేను చట్టాన్ని గౌరవించే దేశ పౌరుడిని. నేను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను గౌరవిస్తాను"
"నాకు ముంబయి కస్టమ్స్ నుంచి పూర్తి సహకారం లభించింది. నేను కూడా వారికి పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చాను. ఈ విషయంలో ఏయే పత్రాలు కావాలో నేను వారికి అందిస్తాను. చట్టాన్ని ఉల్లంఘించినట్లు నాపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి" అని హార్దిక్ పాండ్యా తన ట్వీట్స్ ద్వారా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
తైవాన్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడడం నిప్పుతో చెలగాటం ఆడటమే: జిన్‌పింగ్
తైవాన్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడడం 'నిప్పుతో చెలగాటం ఆడటమే' అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాను హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన మొదటి వర్చువల్ సమావేశంలో జిన్‌పింగ్ ఈ హెచ్చరిక చేశారు.
రెండు దేశాల మధ్య తైవాన్, హాంకాంగ్, మానవ హక్కులు వంటి అంశాలలో దూరం పెరిగిన ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య ఈ సమావేశం జరిగింది.
తమ మధ్య శత్రుత్వం బహిరంగ వివాదంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెండు దేశాలపైనా ఉందని జో బైడెన్ అన్నారు.
జనవరిలో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళవారం ఇద్దరు నేతల మధ్య జరిగిన చర్చలు అత్యంత కీలకమైనవిగా నిలిచాయి.
ఈ చర్చలను నిర్మాణాత్మకంగా, ఫలవంతమైనవిగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ వర్ణించారు. పరస్పర అవగాహన పెంపొందించడానికి ఇవి సహకరించాయని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
సమావేశంలో ఏం మాట్లాడారు
అమెరికా, చైనా అధ్యక్షుల ఈ సమావేశం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడంతో మొదలైంది.
"పాత స్నేహితుడు బైడెన్‌ను చూడడం సంతోషంగా ఉంది" అని షీ జిన్‌పింగ్ అన్నారు.
"మీరు, నేను ఎప్పుడూ అంత అధికారికంగా మాట్లాడుకోకపోయినా, బహుశా నేను మరింత అధికారికంగా వీటిని ప్రారంభించాలేమో. మనిద్దరం ఎప్పుడూ చాలా నిజాయితీగా, స్పష్టంగా చర్చలు జరిపాం. అవతలి వారు ఏమనుకుంటారో అని ఎప్పుడూ దూరం జరగలేదు" అని బైడెన్ అన్నారని రాయిటర్స్ చెప్పింది.
"రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవాలస్సిన అవసరం ఉంది. సవాళ్లను మనం కలిసి ఎదుర్కోవాలి. వాతావరణ మార్పులు, కోవిడ్-19 లాంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోడానికి వీలుగా చైనా-అమెరికా సంబంధాలు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది" అని షీ జిన్ పింగ్ అన్నట్లు చైనా అధికార మీడియా పేర్కొంది.
వారం క్రితం గ్లాస్గోలో జరిగిన చర్చల్లో వాతావరణ మార్పుల సమస్యపై అమెరికా-చైనా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
"మానవాళి ఒక భౌగోళిక గ్రామంలో నివసిస్తోంది. మనం కలిసి ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్నాం. చైనా, అమెరికా కమ్యూనికేషన్, సహకారం పెపొందించుకోవాల్సిన అవసరం ఉంది" అని అందులో షీ జిన్‌పింగ్ చెప్పారు.
"చైనా-అమెరికా సంబంధాలను సానుకూల దిశగా ముందుకు తీసుకెళ్లేలా మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిస్టర్ ప్రెసిడెంట్" అని ఆయన అప్పుడు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- అలెగ్జాండర్ ‘గ్రేట్’ కాదా? యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు? పర్షియన్ చరిత్ర ఏం చెబుతోంది?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








