ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..

నసీరుద్దీన్ షా

ఫొటో సోర్స్, Getty Images

తాలిబాన్ల గెలుపుతో 'భారతీయ ముస్లింలలో కొందరు' సంబరాలు చేసుకుంటున్నారని వీడియోలో షా విమర్శించారు.

వారు ఇస్లాంలోని 'పాత అనాగరిక' సంప్రదాయాలకు అండగా నిలుస్తూ, ప్రమాదకర పరిణామానికి వత్తాసుగా నిలుస్తున్నారని షా పేర్కొన్నారు.

"సంస్కరించిన ఆధునిక ఇస్లాం కావాలో లేక తప్పుడు పంథాలో అర్థం చేసుకున్న మధ్యయుగాలనాటి అనాగ‌రికత కావాలో తమను తాము ప్రశ్నించుకోవాలి" అని 71 ఏళ్ల షా సూచించారు.

'హిందూస్తానీ' లేదా భారతీయ ఇస్లాం ప్రపంచంలో అన్నింటికంటే ప్రత్యేకమైనది, విభిన్నమైనది' అని షా అన్నారు.

''నేను భారతీయ ముస్లింని. నాకు రాజకీయ మతం అవసరం లేదు'' అని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

Presentational white space

షా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చ రేపాయి. కొంతమంది ముస్లింలు, ఇతరులు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. కొంతమంది ముస్లింలను స్టీరియోటైప్‌లో చిత్రించొద్దు అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది అవసరమైన మాటలు అని ప్రశంసింస్తున్నారు.

'తాలిబాన్‌ను ఖండించమని ఎందుకు చాలా మంది భారతీయ ముస్లింలను అడుగుతున్నారు? వారేమైనా తాలిబాన్లను ఎంపిక చేశారా, ఎన్నుకున్నారా లేదా ఆహ్వానించారా? ఈ విషయంపై స్పందించాలనే ఉచ్చులో సినీ రంగానికి చెందిన ప్రతిభ కలిగిన వారు కూడా పడుతున్నారు'' అని జర్నలిస్ట్ సబా నఖ్వీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

Presentational white space

'నటుడికి ఆవేశం అనవసరం' ఆయనకు 'తప్పుడు సలహా ఇచ్చారు' అని పాత్రికేయుడు, వ్యాఖ్యాత ఆదిత్య మీనన్ పేర్కొన్నారు.

''భారతీయ ముస్లింలు ఇప్పటికే ఆర్థిక బహిష్కరణ, మూక హింస, పోలీసుల దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు తాలిబాన్ మనస్తత్వం అనే వాదన ఒకటి తెరపైకి వచ్చి చేరింది. నిజంగా అలాంటి ముప్పేమీ లేదు'' అని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

Presentational white space

అయితే మరికొంతమంది నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ముస్లింలలో ఆధునిక భావాలు లిబరల్ భావాలు అవసరమనే భావించే వారి దగ్గర నుంచి రాజకీయకోణంలో మతపరమైన కోణంలో సమర్థించే బిజెపి మద్దతుదారుల వరకూ అనేకులు ఇందులో ఉన్నారు.

'అమానవీయ, అనాగరిక తాలిబాన్'కు వ్యతిరేకంగా షా మాట్లాడారని బీజేపీ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారు అయిన చిత్ర నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ప్రశంసించారు.

''విద్యావంతులు, సృజనాత్మకత ఉన్న ముస్లింలు, ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందినవారు ఎవరైనా మానవత్వానికి శత్రువులైన తాలిబాన్లకి వ్యతిరేకంగా మాట్లాడతారని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆగస్టు 15న తాలిబాన్లు, అఫ్గానిస్తాన్‌ను తిరిగి వారి స్వాధీనం చేసుకున్నారు.

1996 నుంచి 2001 మధ్య అఫ్గానిస్తాన్‌ను నియంత్రించిన సమయంలో తాలిబాన్ కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసింది. వారు బహిరంగ మరణ శిక్షలకు పాల్పడ్డారు. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లకుండా మహిళలపై నిషేధం విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)