రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు - Newsreel

రామప్ప ఆలయం

ఫొటో సోర్స్, UNESCO

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని (రామప్ప ఆలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

ఈ మేరకు యునెస్కో ట్వీట్ చేసింది.

వారసత్వ కట్టడాల విశిష్టతలను గుర్తించేందుకు వర్చువల్‌గా సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

దీంతో అద్భుత శిల్పకళా సంపదకు కొలువైన ఈ కాకతీయుల నాటి ఆలయానికి వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలను ఈసారి గుర్తింపు ఇవ్వగా మన దేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం దొరికింది.

పాలంపేట(ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది)లో క్రీస్తు శకం 1213లో కాకతీయ వంశ పాలకుడు గణపతి దేవుడి కాలంలో దీన్ని నిర్మించారు.

ఆలయాన్ని నిర్మించిన శిల్పి పేరుతోనే ఇది రామప్ప ఆలయంగా ప్రాచుర్యం పొందింది.

గొప్ప శిల్పకళకు ఈ ఆలయం ఆలవాలం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జయశంకర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు.

యునెస్కో గుర్తింపు దక్కిన నేపథ్యంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాకతీయుల వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు.

స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం అన్నారు.

కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుకోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కృషిచేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సిఎం అభినందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించటం పట్ల చాలా సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

దైనిక్ భాస్కర్

ఫొటో సోర్స్, GAGAN NAYAR/AFP via Getty Images

దైనిక్ భాస్కర్: రూ. 700 కోట్ల ఆదాయాన్ని మీడియా గ్రూప్ దాచిపెట్టిందని ఆర్థిక శాఖ ప్రకటన

భారత్‌లోని మీడియా దిగ్గజాల్లో ఒకటైన దైనిక్ భాస్కర్ గ్రూప్ గత ఆరేళ్లలో రూ.700 కోట్ల ఆదాయాన్ని దాచిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

గురువారం, జులై 22న దైనిక్ భాస్కర్‌కు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపు పన్ను విభాగం సోదాలు చేపట్టింది.

ఆదాయపు పన్ను శాఖ దైనిక్ భాస్కర్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి అధికార ప్రతినిధి సురభి అహ్లువాలియా బీబీసీకి ధ్రువీకరించారు.

అయితే, దైనిక భాస్కర్ కార్యాలయాల్లో తనిఖీలపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తున్నందుకే సంస్థను లక్ష్యంగా చేసుకుంటున్నారని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.

ఈ సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 132 కిందే తాము చర్యలు తీసుకున్నామని తెలిపింది.

దైనిక్ భాస్కర్

భిన్న రంగాల్లో

దైనిక్ భాస్కర్ భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. మీడియాతోపాటు విద్యుత్, జౌలీ, రియల్ ఎస్టేట్‌లోనూ రంగాల్లోనూ సంస్థ పాలుపంచుకుంటోంది.

ఈ గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.6,000 కోట్లకుపైనే ఉందని ఆర్థిక శాఖ తెలిపింది.

మొత్తంగా వందకుపైగా సంస్థలు ఈ గ్రూప్ నియంత్రణలో ఉన్నాయి. అయితే, తమ ఉద్యోగుల్లోని కొందరి పేరుతో కొన్ని కంపెనీలను ఈ గ్రూప్ నడిపిస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది.

ముఖ్యంగా నిధులను దారి మళ్లించేందుకు, ఆదాయాన్ని తక్కువ చేసి చూపించేందుకు ఇలా చేస్తున్నారని పేర్కొంది.

ఇలాంటి సంస్థలు తమ పేరిట ఉన్నట్లు తమకు కూడా తెలియదని కొందరు ఉద్యోగులు వెల్లడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అయితే, వారు షేర్ హోల్డర్లు, డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని పేర్కొంది.

మరోవైపు ఎలాంటి వ్యాపారాలు తమ పేరుతో నిర్వహిస్తున్నారో తమకు తెలియదని మరికొంత మంది ఉద్యోగులు చెప్పినట్లు వివరించింది.

ఇలాంటి సంస్థలు, విధానాలతో గత ఆరేళ్లలో రూ.700 కోట్ల ఆదాయాన్ని దైనిక్ భాస్కర్ గ్రూప్ దాచిపెట్టిందని ప్రకటనలో పేర్కొన్నారు.

బినామీ లావాదేవీల చట్టం కింద కేసులను దర్యాప్తు చేపట్టబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.

రోడ్నీ అల్కలా

ఫొటో సోర్స్, Getty Images

సీరియల్ కిల్లర్ రోడ్నీ అల్కాలా: మరణ శిక్ష ఎదుర్కొంటూ జైలులో సహజ మృతి

12 ఏళ్ల బాలికతోపాటు మరో నలుగురు మహిళలను హత్య చేసినందుకు మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఓ సీరియల్ కిల్లర్‌ జైలులోనే మరణించాడు. అతడిది సహజ మరణమేనని అధికారులు తెలిపారు.

అమెరికా కాలిఫోర్నియాలోని కొర్కోరన్ జైలుకు చెందిన ఆసుపత్రిలో శనివారం ఉదయం రోడ్నీ అల్కాలా (77) మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

‘‘డేటింగ్ గేమ్ కిల్లర్’’గా రోడ్నీకి పేరుంది. ఇతడు ఓ టీవీ షోలో పాల్గొనడంతో ఈ పేరు వచ్చింది.

కాలిఫోర్నియాతోపాటు న్యూయార్క్‌లోని ఇద్దరు మహిళలను రోడ్నీ హత్య చేశాడని రుజువైంది.

లాస్ ఏంజెలిస్‌లో 12ఏళ్ల రాబిన్ శామసోయ్‌ను కిడ్నాప్‌చేసి హత్య చేసినందుకు 1980లో ఆరేగాన్ కౌంటీ.. రోడ్నీకి మరణ శిక్ష విధించింది.

అయితే, ఈ తీర్పును కాలిఫోర్నియా సుప్రీం కోర్టు కొట్టివేసింది. మళ్లీ కేసును విచారణ చేపట్టాలని సూచించింది.

రెండోసారి విచారణలో కూడా అతడికి మరణ శిక్షే పడింది. అయితే, ఈ తీర్పును కూడా 2003లో కోర్టు కొట్టివేసింది.

ఆ తర్వాతి కాలంలో చేపట్టిన విచారణలో, కాలిఫోర్నియాలో మరిన్ని హత్యలతో రోడ్నీకి సంబంధముందని తేలింది.

2010లో రాబిన్‌తోపాటు 18 నుంచి 32 ఏళ్ల వయసున్న మరో నలుగురు మహిళలను 1977 నుంచి 1979 మధ్య కాలంలో రోడ్నీ హత్య చేశాడని రుజువైంది.

1978లో అమెరికా టీవీ షో ‘‘ద డేటింగ్ గేమ్’’లో రోడ్నీ పాల్గొన్నాడు. ఈ షోలో ముగ్గురు ఒంటరి పురుషుల్ని ఓ మహిళ ప్రశ్నలు అడుగుతారు. చివరగా వీరిలో ఒకరిని ఆమె ఎంచుకుంటారు.

ఆ షోలో చివరగా రోడ్నీని సదరు మహిళ ఎంచుకున్నారు. అయితే, ఆయన తనతో చిరాకు తెప్పించేలా మాట్లాడారని, అందుకే ఆయనతో డేటింగ్ వెళ్లలేదని సదరు మహిళ చెప్పారు.

1971 నుంచి 1977 మధ్య న్యూయార్క్‌లో జరిగిన రెండు హత్య కేసుల్లోనూ రోడ్నీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల్లో అతడికి 25ఏళ్ల జైలు శిక్ష విధించారు.

ఇంకా చాలా హత్యలతో రోడ్నీకి సంబంధం ఉండొచ్చని కాలిఫోర్నియా జైలు అధికారులు అనుమానం వ్యక్తంచేశారు.

అయితే, అతడు ఎలా మరణించాడో అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)