చైనాలో వరదలు: 25 మంది మృతి, లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

హెనన్ ప్రావిన్సులో నీట మునిగిన రహదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెనన్ ప్రావిన్సులో నీట మునిగిన రహదారులు

మధ్య చైనాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో భారీ వరదలు సంభవించాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రైల్వే స్టేషన్లు, రహదారులు నీట మునిగాయి.

ప్రజలు నీళ్లలో నడుస్తూ వరదల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలలో కనిపిస్తోందని రాయిటర్స్ వెల్లడించింది.

వరదలకు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వరదలకు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న ప్రజలు

రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి హెనన్​ ప్రావిన్సులోని లక్ష మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వర్షానికి జెంగ్జౌ నగరంలో వచ్చిన వరదల వల్ల ఇప్పటి వరకూ 25 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ వరదల ప్రభావం 12 ప్రధాన నగరాలపై పడింది. రహదారులను మూసేశారు. విమాన సర్వీసులూ రద్దయ్యాయి.

9.4 కోట్ల జనాభా ఉన్న హెనన్​ ప్రావిన్సులో ప్రభుత్వం అత్యంత ప్రమాదకర వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది.

రోడ్డు మధ్యలో బాధితుడు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వరద ప్రభావం హెనన్ ప్రావిన్సులోని 12 నగరాలపై పడింది

వరదలకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ, భూమి వేడెక్కడం లాంటి వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ.

నీట మునిగిన రోడ్లు, వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతున్న కార్లు, చెత్తకి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో కనిపించాయి.

హెనన్​ ప్రావిన్సులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఓ డ్యామ్ కుప్పకూలుతుందనే భయాందోళనలూ నెలకొన్నాయి.

ల్యూయాంగ్ నగరంలోని డ్యామ్​ దాదాపు 20 మీటర్ల మేర దెబ్బతినింది. ఈ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించారు. ఆ డ్యామ్ ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆర్మీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

జెంగ్జౌ నగరంలోని సబ్ వే రైలు బోగీలో చిక్కుకున్న ప్రయాణికుల భుజాల వరకూ నీరు ప్రవహిస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ వీడియోని బీబీసీ ధ్రువీకరించడం లేదు. రైల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది తాళ్ల సాయంతో రక్షిస్తున్నారు. నీటి నుంచి తమని తాము రక్షించుకునేందుకు కొందరు సీట్లపై నిలుచున్నారు.

ఎంతమంది ఇంకా రైల్లోనే చిక్కుకుని ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకూ వందల మందిని రక్షించినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

వరద నీటిలో చిక్కుకున్న జియోపీ అనే వ్యక్తి సోషల్​ మీడియా యాప్​ వీబియోలో సాయం కోసం అభ్యర్థించాడు.

'రైలు బోగీలో నీరు నా ఛాతీ వరకూ చేరింది. నేను ఇక మాట్లాడలేను' అన్నాడు. జియోపీని రక్షించామని కొద్దిసేపటి తర్వాత ఫైర్ డిపార్టుమెంటు తెలిపింది.

'నా జీవితాంతం జెంగ్జౌలోనే గడిపాను. ఈరోజు కురుస్తున్నంత భారీ వర్షాన్ని ఎప్పుడూ చూడలేదు' అని 56 ఏళ్ల వాంగ్ గిరాంగ్ అనే రెస్టారెంట్ మేనేజర్ అసోసియేటెడ్​ ప్రెస్​తో చెప్పారు.

గత మూడు రోజులుగా జెంగ్జౌలో కురిసిన వర్షం, ఆ ప్రాంతంలో కురిసే సంవత్సర వర్షపాతానికి సమానం. వచ్చే 24 గంటల్లోనూ భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)