'స్వేరోస్' ప్రవీణ్ కుమార్: స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న తెలంగాణ ఐపీఎస్ - Newsreel

ఫొటో సోర్స్, Twitter/Dr.RSPraveenKumar
తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రవీణ్‌కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా సేవలు అందించారు.
ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తన రెండు పేజీల లేఖలో వెల్లడించారు.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం మరింత కృషి చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
పార్లమెంటు: లోక్‌సభ, రాజ్యసభ రెండూ రేపటికి వాయిదా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజే నిరసనలతో మొదలయ్యాయి. విపక్షాల ఆందోళన నడుమ సభ మొదలైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది.
తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాల నిరసనలు ఆగకపోవడంతో స్పీకర్ 3.30 గంటల వరకు వాయిదా వేశారు.
తిరిగి 3.30కి సభ ప్రారంభమైన తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటినీ మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3
తొలి రోజు ఇలా..
మొదట లోక్‌సభకు ఇటీవల ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రమాణం చేశారు. వీరిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు.
అనంతరం ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని సభకు పరిచయం చేయడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదలుపెట్టారు.
అయితే, కరోనావైరస్ సెకండ్ వేవ్ సమయంలో చేసిన తప్పిదాలు, చమురు ధరలు, పెగాసస్ నిఘా సహా పలు అంశాలపై విపక్ష సభ్యులు నిరసన తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''దేశంలో రైతు బిడ్డలు, మహిళలు, ఓబీసీ ప్రతినిధులు మంత్రులుగా ప్రమాణం చేయడం విపక్షాలకు ఇష్టంలేనట్లు ఉంది. అందుకే మంత్రులను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారు''అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
''దళితులు, మహిళలు, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వడంపై అందరూ సంతోషంగా ఉంటారని అనుకున్నాను. ఈ సారి బలహీన వర్గాలకు పెద్దపీట వేశాం''అని మోదీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మోదీ మాట్లాడుతుండగా విపక్ష నేతలు పదేపదే అడ్డుపడటంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
విపక్షాల నిరసనల నడుమ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ వేసిన సీనియర్ జర్నలిస్టు మృతి
ముస్లింలలో ఆగ్రహావేశాలకు కారణమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్‌ను గీసిన డెన్మార్ట్ జర్నలిస్టు కర్ట్ వెస్టెర్‌గార్డ్ (86) మృతి చెందారు.
ఏళ్లపాటు అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కర్ట్ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారని బెర్లింగ్స్‌కే పత్రిక వెల్లడించింది.
జిలిండ్స్ పోస్టెన్ పత్రికలో కార్టూనిస్టుగా కర్ట్ పనిచేసేవారు. 2005లో మహమ్మద్ ప్రవక్తపై ఆయన గీసిన కార్టూన్ వివాదాస్పదమైంది.
ఇస్లాంను విమర్శిస్తూ సదరు పత్రిక ప్రచురించిన 12 కార్టూన్లలో కర్ట్ గీసిన కార్టూన్ ఒకటి.
మహమ్మద్ ప్రవక్త ఫోటోలను ప్రచురించడం, కార్టూన్లు గీయడం లాంటి చర్యలను ఇస్లాంలో తప్పుగా పరిగణిస్తారు.
ఈ కార్టూన్ల ప్రచురణ అనంతరం డెన్మార్క్‌లో నిరసనలు జరిగాయి. ముస్లిం దేశాల రాయబారులు డెన్మార్క్ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు.
చాలా దేశాల్లోని డెన్మార్క్ రాయబార కార్యాలయాలపై దాడులు కూడా జరిగాయి. ఈ అల్లర్లలో డజను మందికిపైగా మరణించారు.
2015లో ఈ కార్టూన్లను మళ్లీ ప్రచురించిన ఫ్రెంచ్ మ్యాగజైన్ చార్లీ హెబ్డోపై అయితే సాయుధులు దాడి కూడా చేశారు. ఈ దాడిలో 12 మంది మరణించారు.
ఈ కార్టూన్ల గీసిన తర్వాత చంపేస్తామని కర్ట్‌కు బెదిరింపులు వచ్చేవి. దీంతో కొన్నాళ్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఆరెస్ నగరంలో పటిష్ఠ భద్రత నడుమ జీవించడం మొదలుపెట్టారు.
తాను ఆ కార్టూన్ల విషయంలో ఎలాంటి పశ్చాత్తాపమూ వ్యక్తం చేయడంలేదని 2008లో రాయిటర్స్ వార్తా సంస్థతో కర్ట్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)