శిరీష బండ్ల: భూమికి ఎంత దూరం నుంచి రోదసి మొదలవుతుంది? ఏది స్పేస్, ఏది కాదు? కర్మన్ రేఖ అంటే ఏమిటి?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటిష్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి శిరీష బండ్ల, మిగతా బృందం ఆదివారం విజయవంతంగా రోదసి అంచులకు వెళ్లి వచ్చారు.
న్యూమెక్సికో నుంచి బయలుదేరి భూఉపరితలం నుంచి 53.5 మైళ్ల (86 కిలోమీటర్లు) ఎత్తు వరకు వెళ్లారు.
అక్కడ భార రహిత స్థితిలో రిచర్డ్ బ్రాన్సన్, మిగతా సిబ్బంది తేలుతున్న దృశ్యాలూ ఆ యాత్ర లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపించాయి.
'Mach 3' వేగం (గంటకు 3,700 కిలోమీటర్లు) సాధించినట్లు కూడా బ్రాన్సన్ తన ట్వీట్‌లో వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, ఈ నెలలోనే ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా రోదసి యాత్ర చేయనుండడం.. బ్రాన్సన్ బృందం కర్మన్ లైన్ దాటలేదు కాబట్టి రోదసిలోకి వెళ్లినట్లు కాదని బెజోస్ సంస్థ 'బ్లూ ఆరిజన్' అంటుండడంతో అనేక అంశాలు ఇప్పుడు చర్చకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు భూఉపరితలానికి ఎంత దూరం నుంచి రోదసి మొదలవుతుంది? కర్మన్ లైన్ అంటే ఏమిటి? సబ్ఆర్బిట్ అంటే ఏమిటి వంటి అంతరిక్ష సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'వర్జిన్ గెలాక్టిక్' యాత్రకు రెండు రోజుల ముందే జులై 9న 'బ్లూ ఆరిజన్ వరుసగా రెండు ట్వీట్‌లు చేసింది. అందులో వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజన్‌ల యాత్రలను పోల్చి చూపించింది.
దాని ప్రకారం.. వర్జిన్ గెలాక్టిక్ మిషన్‌లో భాగంగా వెళ్తున్నవారు రోదసిలోకి వెళ్లినట్లు కాదని పేర్కొంది.
భూమి నుంచి 100 కిలోమీటర్ల వద్ద అంతర్జాతీయంగా గుర్తించిన 'కర్మన్ లైన్' నుంచి రోదసి మొదలవుతుందని.. 96 శాతం ప్రపంచం ఈ లెక్కనే గుర్తించిందని, కేవలం ప్రపంచంలో 4 శాతం మంది 80 కిలోమీటర్లు దాటితే రోదసి మొదలైనట్లేనని చెబుతారని ఆ ట్వీట్‌లో పేర్కొంది.
'బ్లూ ఆరిజన్'కు చెందిన స్పేస్ షిప్ 'న్యూ షెపర్డ్' కర్మన్ లైన్ దాటి వెళ్లనుందని ప్రకటించారు.
న్యూషెపర్డ్ ఒక రాకెట్ అని, వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన యూనిటీ-22 ఎక్కువ ఎత్తులో ఎగరగలిగే విమానం (హైఆల్టిట్యూడ్ ఎయిర్‌ప్లేన్) మాత్రమేనని అందులో చెప్పారు.
అయితే, వర్జిన్ గెలాక్టిక్ రోదసి యాత్ర తరువాత 'నాసా' వారిని అభినందిస్తూ ట్వీట్ చేసింది. అందులో వారు స్పేస్‌లోకి వెళ్లి వచ్చారనే పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, NASA/gettyimages
ఇంతకీ రోదసి ఎక్కడి నుంచి మొదలవుతుంది?
సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్ల (62 మైళ్లు లేదా 3,28,000 అడుగులు) ఎత్తుకి వెళ్లిన తరువాత 'కర్మన్ లైన్'కి ఆవల రోదసి మొదలవుతుందని అంతర్జాతీయంగా ఎక్కువ దేశాలు ఆమోదిస్తున్నాయి. అయితే, ఆ ఎత్తులో కూడా కొన్ని చోట్ల భూవాతావరణం కొంతమేర ఉంటుంది.
ఈ ఎత్తుకు వెళ్లిన తరువాత ఆర్బిటల్ వెలాసిటీ (కక్ష్యా వేగం) సాధించకపోతే ఏ వస్తువైనా తిరిగి భూమ్మీదకు పడిపోతుంది.
అయితే, భూమి నుంచి 80 కిలోమీటర్ల దూరం దాటి వెళ్తే రోదసిలోకి వెళ్లినట్లేనని అమెరికా గుర్తిస్తోంది. అమెరికా సైన్యం, నాసా కూడా కర్మన్ లైన్ కంటే 12 మైళ్లు దిగువ నుంచే అంటే, 50 మైళ్ల (80 కి.మీ.) నుంచే రోదసి మొదలవుతుందని చెబుతున్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఈ 80 కిలోమీటర్ల దూరాన్ని 'ఆస్ట్రోనాట్ లైన్'గా పిలుస్తున్నారు. 1960 నుంచి అమెరికా దీన్నే రోదసి సరిహద్దుగా గుర్తిస్తోంది. ఈ ఎత్తు దాటి వెళ్లినవారు పరిశోధకులైనా, ప్రయాణికులైనా ఎవరైనా సరే అక్కడి 'ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్' వారిని 'ఆస్ట్రోనాట్స్'గానే గుర్తిస్తోంది.
అయితే, రోదసి సరిహద్దు ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయంలో ఎక్కడా అంతర్జాతీయంగా ఒప్పందమేమీ లేదు.
అయితే, హై ఆల్టిట్యూడ్ ఫ్లయిట్స్ రికార్డులను ధ్రువీకరించే 'వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్', 'ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్' మాత్రం కర్మన్ లైన్‌ను 100 కిలోమీటర్లుగా గుర్తిస్తూ ఆ దూరం దాటితేనే రోదసి అంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త లెక్క.. 118 కి.మీ. సరిహద్దు
రోదసి సరిహద్దు కచ్చితంగా తేల్చాలనే ఉద్దేశంతో 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 'సుప్రా థర్మల్ అయాన్ ఇమేజర్' అనే పరికరాన్ని ప్రయోగించారు.
భూవాతావరణంలోని సాధారణ గాలులు, అంతరిక్షంలోని ప్రమాదకర ప్రవాహాల మధ్య మార్పును కొలవడానికి దీన్ని ఉపయోగించారు.
ఆ పరికరం అందించిన డాటా ప్రకారం రోదసి సరిహద్దు సముద్ర మట్టం నుంచి 73 మైళ్ల (118 కిలోమీటర్ల) వద్ద మొదలవుతుందని వారు తేల్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'కర్మన్ లైన్' అంటే?
భూమికి, రోదసికి మధ్య సరిహద్దును 'కర్మన్ లైన్'గా పిలుస్తారు. ఇదో ఊహా రేఖ మాత్రమే.
హంగరీకి చెందిన శాస్త్రవేత్త థియోడర్ వాన్ కర్మన్ ఈ రేఖను ప్రతిపాదించడంతో ఆయన పేరు మీదే దీన్ని కర్మన్ లైన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆస్ట్రోఫిజిసిస్ట్ జొనాథన్ మెక్‌డోవల్ 'కార్నెల్ యూనివర్సిటీ'కి 'ది ఎడ్జ్ ఆఫ్ స్పేస్: రీ విజిటింగ్ ద కర్మన్ లైన్' అనే డాక్యుమెంట్ సమర్పించారు. అందులో ఆయన భూమికి, రోదసికి సరిహద్దుగా చెప్పే కర్మన్ లైన్ 100 కి.మీ.గా పేర్కొంటున్నప్పటికీ అంతరిక్ష వాహక నౌకల భూకక్ష్య, ఉప కక్ష్యా మార్గాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆ లైన్ 80కిలోమీటర్లుగా నిర్ధరించాలని ప్రతిపాదించారు.
చారిత్రక, భౌతిక, సాంకేతిక దృక్కోణాల నుంచి రోదసి సరిహద్దుగా దీన్నే తాను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ అంటే?
వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజన్ యాత్రలను 'సబ్ ఆర్బిటల్ ఫ్లైట్'గా పిలుస్తున్నారు.
ఏదైనా వస్తువు గంటకు 28వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే భూమి నుంచి 200 కిలోమీటర్ల దూరం ఆవల భూకక్ష్యలోకి వెళ్లగలుగుతుంది.
అయితే, సబ్ ఆర్బిటల్ రాకెట్‌లు 28 వేల కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి భూ కక్ష్యలోకి చేరలేవు.
(ఆధారం: నాసా, ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్, నేషనల్ ఎన్విరానమెంటల్ శాటిలైట్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్-యూఎస్, ది ఎడ్జ్ ఆఫ్ స్పేస్: రీవిజిటింగ్ ది కర్మన్ లైన్)
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)