పాకిస్తాన్: ఫ్రీగా బర్గర్లు ఇవ్వలేదని రెస్టారెంట్ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
బర్గర్లు ఉచితంగా ఇవ్వలేదని పాకిస్తాన్ పోలీసులు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లోని మొత్తం 19 మంది సిబ్బందిని అరెస్ట్ చేశారు.
శనివారం రాత్రి ఒంటిగంటకు లాహోర్‌లోని జానీ అండ్ జుగ్నూ చెయిన్ రెస్టారెంట్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
"మా రెస్టారెంట్ దగ్గర ఇలాంటివి జరగడం కొత్తేం కాదు" అని ఆ రెస్టారెంట్ చెయిన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనకు పాల్పడిన 9మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వారిని సస్పెండ్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఇనామ్ ఘనీ ట్విటర్‌లో ప్రకటించారు.
"చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించం. అన్యాయాన్ని సహించేది లేదు. వారు ఎవరైనా శిక్ష తప్పదు" అని అన్నారు.
రెండ్రోజుల క్రితం తమ రెస్టారెంట్‌కు వెళ్లిన కొంతమంది పోలీసులు ఉచితంగా బర్గర్లు ఇవ్వాలని అడిగారని జానీ అండ్ జుగ్నూ రెస్టారెంట్ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన పోస్ట్ చేసింది.
"వాళ్లకు అది మామూలైపోయింది. ఉచితంగా ఇవ్వడం కుదరదని చెప్పాం. మా మేనేజర్లను బెదిరించి పోలీసులు వెళ్లిపోయారు. నిరాధార వాదనలతో మా సిబ్బందిని మరింత వేధించడానికి, వారిపై ఒత్తిడి తేవడానికి తర్వాత రోజు వాళ్లు మళ్లీ వచ్చారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
"జూన్ 11న కొంతమంది పోలీసులు మా అవుట్‌లెట్‌కు వచ్చారు. మా మేనేజర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. మా బ్రాంచ్ మొత్తం ఖాళీ చేయించారు. మిగతా మేనేజర్లతో సహా మా కిచెన్ స్టాఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు" అని తెలిపింది.
కిచెన్ మూసేయడానికి తమ సిబ్బంది ఒప్పుకోలేదని, ఆ సమయంలో స్టవ్‌లు మండుతూనే ఉన్నాయని, కస్టమర్లు తమ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారని వివరించింది.
"మా సిబ్బందిని ఏడు గంటలపాటు నిర్బంధించారు. పోలీసులు తమను వేధించారని, చుట్టూ తోస్తూ మాట్లాడారని... బర్గర్లు ఉచితంగా ఇవ్వలేదనే ఇదంతా చేశారని వారు మాకు చెప్పారు" అని రెస్టారెంట్ చెయిన్ చెప్పింది.
పంజాబ్ ప్రాంత పోలీసు దళాలను సంస్కరించాలని గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అక్కడ పోలీస్ స్టేషన్లలో స్థానిక రాజకీయ నాయకులు తమ వాళ్లను నియమించుకున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా: గాల్వాన్ లోయలో ఘర్షణలు ఎలా మొదలయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెలలో మొదలవుతాయా... ఈ క్రీడా వేడుకకు కోవిడ్ ఎమర్జెన్సీ అడ్డంకి అవుతుందా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- ఫ్రెంచ్ ఓపెన్ 2021: తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్న బార్బోరా క్రెచికోవా
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








