మహారాష్ట్ర: రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి- Newsreel

పుణెలో అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిలో 18 మంది మరణించారు.

పుణెకు 16 కి.మీ. దూరంలోని ఫిరంగుట్‌లో ఎస్‌వీఎస్ అక్వా టెక్నాలజీస్‌లో సోమవారం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.

అగ్ని ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది పనిచేస్తున్నారు. వీరిలో 18 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

మిగతావారిని కాపాడేందుకు అగ్నిమాపక దళం కృషిచేస్తోంది. సిబ్బంది లోపలకు వెళ్లేందుకు ఓ గోడను బద్దలు కొట్టాల్సి వచ్చింది.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులకు పరిహారం ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కర్ఫ్యూ

ఫొటో సోర్స్, ugc

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగించారు. అయితే, కర్ఫ్యూ వేళల్లో 2 గంటల సడలింపు ఇచ్చింది.

ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుండగా దాన్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు 6 గంటల వరకు మార్చారు.

అంటే, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.

అదనపు సడలింపు వేళలు ఈ నెల 11 నుంచి అమలులోకి వస్తాయి.

కొత్త వేళల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Pib

మోదీ: సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

ప్రధాని మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్ వేదికగా వెల్లడించింది.

దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్న తరుణంలో ప్రధాని తన ప్రసంగంలో ఏం చెబుతారనే ఆసక్తి అంతటా నెలకొంది.

అదే సమయంలో వ్యాక్సినేషన్ విషయంలోనూ ఆయన మాట్లాడొచ్చని భావిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బొకో హరామ్ నేత అబూబకర్ షెకావు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బోకో హరాం నేత అబూబకర్ షెకావు

బోకో హరాం నాయకుడు అబూబకర్ షెకావు మృతిచెందినట్లు ప్రత్యర్థి గ్రూపు ప్రకటన

నైజీరియా మిలిటెంట్ గ్రూప్ బోకో హరాం నాయకుడు అబూబకర్ షెకావు చనిపోయినట్లు ప్రత్యర్థి ఇస్లాం మిలిటెంట్ గ్రూప్ ఒక ఆడియో రికార్డింగ్‌లో చెప్పింది.

రెండు గ్రూపుల మధ్య జరిగిన ఒక ఘర్షణలో షెకావు తన శరీరానికి ఉన్న పేలుడు పదార్థాలను పేల్చేసుకున్నాడని ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్(ISWAP) చెబుతున్నట్లు ఉన్న ఆడియో ఒక సమాచార సంస్థకు లభించింది.

గత నెలలో కూడా షెకావు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయన హత్యకు గురయ్యారని చాలాసార్లు చెప్పారు.

అయితే, బోకో హరాం నుంచి గానీ, నైజీరియా ప్రభుత్వం తరఫున గానీ, ఆయన చనిపోయినట్లు ఎవరూ ధ్రువీకరించలేదు.

ఈ ఆడియో రికార్డింగ్ ఎప్పటిది అనేది కూడా స్పష్టత లేదు. కానీ, ఇందులో షెకావు పేలుడు పదార్థాలతో తనను తాను పేల్చుకున్నాడని ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ నేత అబూ ముసాబ్ అల్-బర్నాబీ చెప్పినట్లు భావిస్తున్నారు.

బొకో హరామ్ నేత అబూబకర్ షెకావు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బోకో హరాం నేత అబూబకర్ షెకావు

మా ఫైటర్స్ ఆయనను వేటాడి పట్టుకున్నారు, మాతో కలవాలని ఆయనకు ప్రతిపాదన కూడా చేశారు అని అల్-బర్నావీ చెప్పారు.

షెకావు చనిపోయాడనే వార్తలు గత నెలలో కూడా ప్రచారం అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేస్తామని నైజీరియా సైన్యం చెప్పింది.

"ఏం జరిగిందో తెలుసుకోడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. కానీ, పక్కా ఆధారాలు లభించేవరకూ దీనిపై మేం ఎలాంటి ప్రకటనా చేయేలేం" అని ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ యెరిమా చెప్పారు.

ఆగ్నేయ నైజీరియాలోని సంబిసా అడవుల్లో బోకో హరాం స్థావరాలపై Iswap దాడులు చేసినప్పుడు షెకావు చనిపోయినట్లు భద్రతాదళాలు తమకు సన్నిహితంగా ఉండే ఒక జర్నలిస్టుకు చెప్పాయి.

ఇంతకు ముందు ఆయన చనిపోయినట్లు చాలాసార్లు వార్తలు వచ్చినా, ఆయన మళ్లీ కనిపించారు.

మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులకు ఆడబిడ్డ జననం

డ్యూక్, డచెస్ ఆఫ్ ససెక్స్ తమకు రెండో బిడ్డ జన్మించినట్లు ప్రకటించారు.

కాలిఫోర్నియాలోని ఒక హాస్పిటల్‌లో మాకు ''లిలీబెట్ డయానా మౌంట్‌బాటన్ విండ్సర్'' జన్మించింది అంటూ పాప పేరు కూడా వెల్లడించారు.

తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ దంపతులు తెలిపారు.

''రాణి, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, డచెస్ ఆఫ్ కార్న్‌వాల్.. డ్యూక్, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అందరూ ఈ వార్త తెలిసిన వెంటనే సంతోషించారు'' అని బకింగ్‌హామ్ ప్యాలస్ నుంచి ప్రకటన వెలువడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)