కరోనావైరస్: బ్రెజిల్‌లో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 4,000 మరణాలు - News Reel

ఫొటో సోర్స్, Reuters
బ్రెజిల్‌లో కరోనావైరస్ వ్యాప్తి వేగం బాగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే కోవిడ్‌తో ఆ దేశంలో 4,000 మందికి పైగా మరణించారు.
ఆసుపత్రుల్లో సామర్థ్యానికి మించి రోగులు ఉంటున్నారు. చికిత్స కోసం ఎదురుచూస్తూనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా ప్రాంతాల్లో వైద్య వ్యవస్థలు కుప్పకూలే దశకు చేరుకున్నాయి.
బ్రెజిల్‌లో ఇప్పటివరకూ కోవిడ్‌తో 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలు అత్యధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్‌ది ప్రపంచంలోనే రెండో స్థానం. మొదటి స్థానంలో అమెరికా ఉంది.
అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించాలన్న ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వ్యతిరేకిస్తున్నారు.
వైరస్ వల్ల జరిగే నష్టం కన్నా, లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థపై పడే దుష్ప్రభావం తీవ్రతే ఎక్కువగా ఉంటుందని ఆయన వాదిస్తున్నారు.
బ్రెజిల్‌లో 92 రకాల కరోనావైరస్‌లు వ్యాప్తిలో ఉన్నట్లు ఫియోక్రజ్ అనే ఆరోగ్య సంస్థ చెబుతోంది. వీటిలో పీ.1 అనే రకం వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రస్తుతం కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ఈ రకమే కారణమని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ఐపీఎల్: కొత్త రూల్స్ కెప్టెన్ కాళ్లకు బంధాలా... బ్యాట్స్మన్లకు పరుగుల పంటేనా?
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




