కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారంతో అమెరికా రాజకీయాల్లో భారత్ మరింత కీలకం అవుతుందా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, షాదాబ్ నాజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్‌ను డెమొక్రటిక్ అభ్యర్థిగా ప్రకటించినపుడు భారతీయ అమెరికన్ల సమాజంలో ఒక నూతనోత్సాహం వచ్చింది..
కమలా హ్యారిస్ తండ్రి జమైకా నుంచి అమెరికా వచ్చారు. ఆయన పేరు డోనాల్డ్ హారిస్. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఒక భారతీయ అమెరికన్. ఆమె చెన్నైలో పుట్టారు.
డోనల్డ్ హ్యారిస్ 1964లో అమెరికా వచ్చారు. తర్వాత ఏడాది 1965లో ఇమిగ్రేషన్, జాతీయత చట్టాలు ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం దేశంలో జన్మించకపోయినా, పని ఆధారంగా పౌరసత్వం ఇచ్చే నిబంధనలు రూపొందించారు.

అమెరికా లో భారతీయ అమెరికన్ల సంఖ్య
1957లో దలీప్ సింగ్ సౌంద్ అమెరికా ప్రతినిధుల సభకు ఎంపికైన మొదటి భారతీయ అమెరికన్ అయ్యారు.
ఆ తర్వాత పీయూష్ బాబీ జిందాల్, ప్రమీలా జైపాల్ లాంటి చాలా మంది అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
భారతీయ అమెరికన్ల జనాభా అమెరికా మొత్తం జనాభాలో 1.5 శాతం ఉంది. అమెరికా జనాభా లెక్కల ప్రకారం 2000లో అమెరికాలో 19 లక్షల మంది భారతీయులు ఉంటే, అది 2015 నాటికి 39 లక్షల 82 వేలకు చేరింది. అంటే దాదాపు రెట్టింపు అయ్యింది.

అమెరికాలో భారతీయులకు సమర్థులైన వలస ప్రజలుగానే కాక, మిగతా వలస సమూహాల కంటే మెరుగైన విద్యా నేపథ్యం కూడా ఉంది.
థింక్‌ట్యాంక్ పీవు రీసెర్చ్ సెంటర్ వివరాల ప్రకారం అమెరికాలో ఉంటున్న 40 శాతం భారతీయులకు మాస్టర్స్ డిగ్రీ ఉంది. అమెరికన్లలో 15.7 శాతం జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే, భారతీయుల మొత్తం జనాభాలో 7.5 శాతం మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారు.
కానీ, ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న భారతీయులు అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగలరా అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. దాని గురించి తెలుసుకోవాలంటే భారతీయ అమెరికన్లు నిజంగా ఎలా ఓట్లు వేస్తారనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
భారతీయ అమెరికన్ల ఓటర్ల వివరణ
అమెరికాలో 40 లక్షల భారతీయ అమెరికన్లు ఉంటున్నారు. ఇది అమెరికాలో మెక్సికన్ల తర్వాత అత్యంత వేగంగా పెరిగిన వలస జనాభా. అమెరికా జనాభా గణాంకాల ప్రకారం 2000, 2016 మధ్య భారతీయుల జనాభాలో 137.2 శాతం వృద్ధి వచ్చింది.
వీరిలో చాలామంది న్యూయార్క్, షికాగో, శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి మహా నగరాల్లో ఉంటున్నారు. ఒక్క న్యూయార్కులోనే ఆరు లక్షలమందికి పైగా భారతీయులు ఉంటే, షికాగోలో రెండు లక్షల మందికి ఇండియన్స్ ఉంటున్నారు.

పీవు రీసెర్చ్ వివరాల ప్రకారం అమెరికా బయట పుట్టినా, ఓటు అర్హత ఉన్న వారి విషయానికి వస్తే భారతీయ అమెరికన్లది మెక్సికో, ఫిలిప్పీన్స్ తర్వాత మూడో అతిపెద్ద జనాభా అవుతుంది.
2016లో జరిగిన ఒక సర్వేలో(ఎన్ఎఎఎస్ పోస్ట్-ఎలక్షన్) 48 శాతం భారతీయ అమెరికన్లు డెమాక్రాట్లకు లేదా డెమాక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉంటారని తేలింది. 22 శాతం భారతీయులు మాత్రమే రిపబ్లికన్ పార్టీ వైపు ఉన్నారు.
అధ్యక్ష ఎన్నికలు సమీపించడంతో రిపబ్లికన్, డెమాక్రటిక్ పార్టీలు భారతీయ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి పోటీపడ్డాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
అయినా దానికి కారణం ఏంటి? తీవ్రమైన పోటీ ఉండే ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మిషిగన్‌లో రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల ఉనికి బలంగా ఉంది. వీరికి ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే సత్తా ఉంది.
ఇండో అమెరికన్ యాటిట్యూడ్ సర్వే(ఐఎఎఎస్) ఇటీవలి సర్వే ప్రకారం అమెరికాలోని 70 శాతానికిపైగా భారతీయులు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌కు కాకుండా బైడెన్‌కే ప్రాధాన్యం ఇచ్చినట్లు సంకేతాలు కనిపించాయి.
హెచ్1బీ వీసా-ట్రంప్ వర్సెస్ బైడెన్
భారతీయలు ప్రపంచంలోనే అత్యధిక హెచ్1బీ వీసాలు ఉన్న సమాజంగా నిలిచారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏటా జారీ అవుతున్న 85 వేల హెచ్1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయుల దగ్గరే ఉన్నాయి.

కానీ ఎన్నికలకు సరిగ్గా ముందు ట్రంప్ భారతీయుల అమెరికా కలలకు ఒక పెద్ద కుదుపు ఇచ్చాడు. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం గత ఏడాది మొదట్లో ట్రంప్ ఒక ఆర్డర్ మీద సంతకం చేశారు. దీని ప్రకారం ఫెడరల్ ఏజెన్సీల్లో విదేశీయులకు, ముఖ్యంగా హెచ్1బీ వీసాపై వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ నిర్ణయం ప్రతిఏటా ఆ వీసాతో అమెరికా వెళ్లాలనుకునే ఐటీ నిపుణులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది.
సెప్టెంబర్‌లో జరిగిన ఎఎపీఐ సర్వేలో దీని ప్రభావం కనిపించింది. అందులో 35 శాతం ఆసియావాసులు, భారతీయులు ట్రంప్‌ను అధ్యక్షుడుగా చూడడానికి ఇష్టపడలేదు.
ఇప్పుడు చాలా మంది భారతీయుల ఆశలన్నీ ఎన్నికల్లో గెలిచిన బైడెన్ మీదే ఉన్నాయి. ఎందుకంటే ఆయన గత ఏడాది భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హెచ్1బీ వీసా గురించి మాట్లాడారు. "నా మనసు ద్వేషానికి బలైన మీ అందరితోనే ఉంది" అన్నారు.
వలసదారుల గురించి ఆయన ఎన్నో కష్టాలు భరించారు. వాటిలో, దశాబ్దాల నుంచి జారీ అవుతున్న హెచ్1బీ వీసాలపై హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కూడా ఉంది. ఆ వీసాల వల్ల అమెరికా బలంగా మారుతూ వచ్చింది.

ఇంతకు ముందు ఎన్నికల్లో 84 శాతం మంది భారతీయ అమెరికన్లు ఒబామాకు ఓటు వేశారు.
మైనారిటీలు, వలసదారుల పట్ల రిపబ్లికన్‌తో పోలిస్తే డెమాక్రాట్స్ పార్టీ ఎక్కువ సున్నితంగా వ్యవహరిస్తోంది.
ఇప్పుడు కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలు కావడంతో అమెరికా కొత్త ప్రభుత్వంలో చాలా మంది భారతీయ మూలాలు ఉన్న అమెరికన్లు కీలక బాధ్యతలు నిర్వహించడం మనం చూడవచ్చు.
అమెరికాలో మనం రాబోవు రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు చూడగలమని ఆశించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









