మేల్ చాస్టిటీ గాడ్జెట్: మగవాళ్ల ‘శీలం కాపాడే’ పరికరాన్నిసైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లాక్ చేసే ప్రమాదం.. అసలు ఏమిటీ పరికరం

మేల్ చాస్టిటీ

ఫొటో సోర్స్, Pen test patners

    • రచయిత, లియో కెలియోన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పురుషులు ఉపయోగించే ఒక హైటెక్ మేల్ చాస్టిటీ (తమ పురుష భాగస్వామి ఇతర మహిళలతో లైంగికానందం పొందకుండా అడ్డుకోవడానికి ఉపయోగించే పరికరం)లో భద్రతా నిపుణులు ఒక లోపాన్ని గుర్తించారు.

ఈ లోపం కారణంగా హ్యాకర్లు ఆ పరికరాన్ని హ్యాక్ చేసి లాక్ చేసే ప్రమాదం ఉందని.. అలా లాక్ చేస్తే పరికరానికి ఉన్న నట్లు, బోల్టులు కట్ చేస్తే తప్ప పురుషాంగ బయటకు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేసే ఈ మేల్ చాస్టిటీ పరికరం ఒకసారి లాక్ అయితే దాన్నుంచి మేన్యువల్‌గా విడిపించుకోవడం సాధ్యం కాదు. దాంతో, దీన్ని ఉపయోగించేవారు బోల్టు కట్టర్లతో పరికరానికి ఉన్న మెటల్ క్లాంపును కత్తిరించి మరీ బయటపడాల్సివస్తోంది.

బ్రిటన్‌కు చెందిన ఒక భద్రతా నిపుణుల టీమ్ ఈ బగ్‌ను గుర్తించడంతో ఈ సెక్స్ టాయ్స్‌ను నియంత్రించే యాప్‌లో ఉన్న లోపాన్ని చైనాకు చెందిన తయారీ సంస్థ సరిదిద్దింది.

దీని నుంచి బయటపడడానికి ఒక పద్ధతిని కూడా వారు తమ వెబ్‌సైట్‌లో ప్రచురించారు.

ఇప్పటికీ పాత వెర్షన్ యాప్ ఉపయోగిస్తూ, హ్యాకర్ల దాడితో దానిలో లాక్ అయిపోయినట్లు గుర్తించిన ఎవరికైనా ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు.

మేల్ చాస్టిటీ పరికరం

ఫొటో సోర్స్, Pen test patners

ఫొటో క్యాప్షన్, మేల్ చాస్టిటీ పరికరం

ఈ లోపాన్ని కనిపెట్టిందెవరు?

బకింగ్‌హామ్‌లోని పెన్ టెస్ట్ పార్టనర్స్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ లోపాన్ని గుర్తించింది. గతంలో కొన్ని సెక్స్ టాయ్స్ లో ఉన్న సమస్యలతోపాటూ, ఎన్నో ఆవిష్కరణల్లో లోపాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఈ సంస్థకు ఉంది.

‘స్మార్ట్ అడల్ట్ థీమ్’ ఉత్పత్తుల తయారీదారులు ఇంకా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాజాగా గుర్తించిన లోపం చెబుతోంది.

ఇక్కడ సమస్యేంటంటే, మిగతా సెక్స్ టాయ్స్ తయారీదారులు, తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని తొందరపడుతున్నారు.

వీటి ద్వారా చాలావరకూ సున్నితమైన వ్యక్తిగత డేటా బహిర్గతం అయ్యే సమస్య ఉంటుంది.

కానీ ఈ పరికరం విషయానికి వస్తే మనం దానిలో శారీరకంగా లాక్ అయిపోతాం.. అది చాలా ప్రమాదకరం’’ అని పెన్ టెస్ట్ పార్టనర్స్ పరిశోధకుడు అలెక్స్ లోమస్ అన్నారు.

మేల్ చాస్టిటీ పరికరంలో సర్క్యూట్

ఫొటో సోర్స్, PEN TEST PARTNERS

ఫొటో క్యాప్షన్, మేల్ చాస్టిటీ పరికరంలో సర్క్యూట్

లాక్ అండ్ క్లాంప్

ఆన్‌లైన్లో క్వీస్ సెల్‌మేట్ చాస్టిటీ కేజ్‌ ధర దాదాపు 190 డాలర్లు (దాదాపు 14 వేలు) ఉంది.

దీనిని అమర్చుకునేవారి శరీరంపై వారి భాగస్వాములకు యాప్ ద్వారా యాక్సెస్ ఉంటుంది. ఆ పరికరం కంట్రోల్‌ భాగస్వామి చేతిలో ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా నియంత్రిస్తారు.

గ్వాండాంగ్‌లోని ఈ డివైస్ తయారీ సంస్థ ‘క్వీ’ వెల్లడించిన ఐడీలను బట్టి అది ఇప్పటివరకూ దాదాపు 40 వేల పరికరాలను విక్రయించినట్లు పెన్ టెస్ట్ పార్టనర్స్ భావిస్తోంది.

ఈ చాస్టిటీ కేజ్‌ వైర్‌లెస్‌గా పనిచేస్తుంది. దీనిని బ్లూటూత్ సిగ్నల్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేస్తారు. డివైస్‌కు ఉన్న ‘లాక్ అండ్ క్లాంప్’ మెకానిజం ద్వారా దీనిని ఉపయోగిస్తారు.

సాఫ్ట్‌వేర్ దీనిని పనిచేయించడానికి తయారీ సంస్థ కంప్యూటర్ సర్వర్‌కు వినియోగదారుడు పంపించే కమాండ్స్ మీద ఆధారపడుతుంది.

“ఈ యాప్‌ను ఎక్కడ నుంచి ఉపయోగిస్తున్నారో, ఆ లొకేషన్లతోపాటూ వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్న పేరు, మిగతా వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడానికి హ్యాకర్లు సర్వర్‌ను ఏమార్చే ఒక మార్గాన్ని కనిపెట్టినట్లు భద్రతా నిపుణులు గుర్తించారు.

హ్యాకర్లు అలా చేయడం వల్ల ప్రతి పరికరానికీ కేటాయించిన ప్రత్యేక కోడ్‌ కూడా బహిర్గతం అవుతుందని వారు చెబుతున్నారు.

దానిని ఉపయోగించి హ్యాకర్లు యాప్ నుంచి వచ్చే అన్ లాక్ అభ్యర్థనలను సర్వర్ పట్టించుకోకుండా చేస్తారని, దాంతో, పరికరం వేసుకున్న వారు అందులో లాక్ అయిపోతారని వివరించారు.

పరికరాన్ని విప్పే విధానం

ఫొటో సోర్స్, cellmate chastity

ఫొటో క్యాప్షన్, పరికరాన్ని విప్పే విధానం

ఈ యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత ఈ ఏడాది మేలో లోమాస్ బృందం దానిలోని లోపాన్ని గుర్తించింది

కానీ సర్వర్ బేస్డ్ ఏపీఐ ఆన్‌లైన్లో యాప్ అంతకు ముందు వర్షన్‌ అలాగే ఉంది. అంటే ఈ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోని వారు ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నారు.

దీనిని గుర్తించాలని కోరుతూ పెన్ ట్రస్ట్ పార్టనర్స్ ఫాలో-అప్ మెయిల్స్ పంపించింది. దీనిపై టెక్‌క్రంచ్ న్యూస్ సైట్‌ వివరాలను కూడా ప్రస్తావించింది.

“నేను ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాను, దానిని మేం చక్కదిద్దాక, మరిన్ని సమస్యలు ఎదురయ్యాయ”ని తర్వాత క్వీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారని టెక్‌క్రంచ్ పేర్కొంది.

ఐదు నెలలు పరిశోధనల తర్వాత బ్రిటన్ భద్రతా నిపుణుల బృందం ఈ లోపాన్ని బయటపెట్టాలని నిర్ణయించింది.

“క్వీస్ పరికరంలోని సమస్యల్లో కొన్నింటిని కనుగొనడంలో సరిగా వ్యవహరించకుండా, మరో ఇంటర్నల్ డివైస్ మీద పనిచేస్తుండడంతో మేం దీనిని ప్రచురించక తప్పలేదు” అని లోమాస్ చెప్పారు.

పెన్ ట్రస్ట్ పార్టనర్స్ కూడా అదే జరిగినట్లు గుర్తించింది.

బీబీసీ దీనిపై క్వీస్ సంస్థ స్పందన కోరింది.

“ఈ పరికరాన్ని హాక్ చేయడం వల్ల ఎవరికైనా హాని జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని” టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది.

కానీ దీనితో సంబంధం లేని ఒక బగ్ వల్ల, పరికరం లాక్ అయినట్లు తనకు అనిపించిందని ఆన్‌లైన్‌లో రివ్యూ పెట్టిన ఒక వ్యక్తి చెప్పాడు.

దానివల్ల “ఒక ఘోరమైన మచ్చ మిగిలింది, కోలుకోడానికి నాకు నెల పట్టింద”ని అతడు పోస్ట్ చేశాడు.

కాగా ఒకవేళ ఈ పరికరం లాక్ అయి ఎవరైనా ఇబ్బందిపడితే స్క్రూ డ్రైవర్ సాయంతో కూడా విప్పేయొచ్చంటూ సెల్‌మేట్ తాజాగా చెప్పంది.. లేదంటే తమ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయొచ్చని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)