చైనాలో గోల్డెన్ వీక్: కరోనావైరస్ భయం లేదు.. సోషల్ డిస్టెన్సింగ్ కూడా లేదు.. కోట్ల మంది కలసిమెలసి ఎంజాయ్ చేస్తున్నారు

హాంగ్‌జో రైల్వే స్టేషన్లో రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాంగ్‌జో రైల్వే స్టేషన్లో రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రజలు

చైనాలో జాతీయ దినోత్సవ సెలవుల సందర్భంగా కోట్లాది మంది ప్రజలు సరదాగా గడుపుతున్నారు. ఒకరినొకరు కలుసుకుంటున్నారు.. విహారానికి వెళ్తున్నారు.

'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' ఏర్పడిన రోజును అక్కడ జాతీయ దినోత్సవంగా జరుపుకొంటారు. ఈ ఏడాది సంప్రదాయ 'మిడ్ ఆటమ్ ఫెస్టివల్' కూడా ఇదే తేదీల్లో రావడంతో ప్రజలు సంబరాల్లో ఉన్నారు.

'గోల్డెన్ వీక్'గా పిలిచే ఈ 8 రోజుల సెలవు సమయంలో సుమారు 5.5 కోట్ల మంది దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తారని అంచనా.

ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత గురువారం అత్యధికంగా 1.3 కోట్ల రైలు ట్రిప్‌లు వేసినట్లు చైనా మీడియా చెబుతోంది. ఈ ఎనిమిది రోజుల సెలవుల్లో రైళ్లు 10.8 కోట్ల ట్రిప్‌లు తిరుగుతాయని చైనా రైలు సేవల సంస్థ అంచనా వేస్తోంది.

గత ఏడాది చివర్లో చైనాలోని వుహాన్‌లో కరోనావైరస్ ప్రబలిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. అయితే, చైనా ఆ తరువాత కఠిన నిబంధనలతో వైరస్ వ్యాప్తిని అరికట్టింది. ఇప్పుడు చాలావరకు నియంత్రణలను ఎత్తివేశారు.

ఈ ఏడాది ప్రారంభమంతా లాక్‌డౌన్‌లో ఉన్న చైనాలో తాజా చిత్రాలివీ..

బీజింగ్ రైల్వే స్టేషన్ బయట జనం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బీజింగ్ రైల్వే స్టేషన్ బయట జనం

గురువారం పెద్దసంఖ్యలో ప్రజలు ప్రయాణించినప్పటికీ గత ఏడాది ఇదే రోజున అక్కడి రైల్వేలు తిప్పిన 1.7 కోట్ల ట్రిప్‌ల కంటే ఈసారి తక్కువ రైళ్లే తిరిగాయి.

బీజింగ్‌లో పతాకావిష్కరణను చూస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బీజింగ్‌లో పతాకావిష్కరణను చూస్తున్న మహిళ

పీపుల్స్ రిపబ్లిక్ చైనా 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణను చాలామంది తిలకించారు.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై జనం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై జనం

చాలామంది ఈ సెలవు రోజులను విహారానికి వినియోగించుకుంటున్నారు.

లిజియాంగ్ వంటి నైరుతి చైనా నగరాలకు విమానాల టికెట్లన్నీ అమ్ముడుపోయాయని ట్రావెల్ సర్వీసెస్ ‘కునార్’ రాయిటర్స్ వార్తాసంస్థతో చెప్పింది.

షాంఘైలోని నాన్జియాంగ్ రోడ్లో జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాంఘైలోని నాన్జియాంగ్ రోడ్లో పెద్దసంఖ్యలో ప్రజలు

గత ఏడాదితో పోల్చితే ఈసారి 10.5 శాతం అదనంగా బుకింగ్‌లు నమోదయ్యాయని చైనా విమానయాన సంస్థ తెలిపింది.

గత ఏడాది ఈ సమయంలో 70 లక్షల మంది విదేశాలకు ప్రయాణించారని.. ఈసారి ప్రపంచంలోని పలుదేశాలు, నగరాల్లో నియంత్రణలున్నా బుకింగ్స్ పెరిగాయని చెబుతోంది.

సిచువాన్ రాష్ట్రంలోని లేషాన్ బుద్ధ విగ్రహం వద్ద టూరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిచువాన్ రాష్ట్రంలోని లేషాన్ బుద్ధ విగ్రహం వద్ద టూరిస్టులు

అన్ని పర్యటక ప్రాంతాలకూ జనం పోటెత్తుతారన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రాంతాల గరిష్ఠ సామర్థ్యంలో 75 శాతం వరకే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.

బీజింగ్ రైల్వే స్టేషన్ బయట జనం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బీజింగ్ రైల్వే స్టేషన్ బయట జనం

చైనాలో కరోనా ప్రబలడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 91,545 పాజిటివ్ కేసులు, 4,739 మరణాలు రికార్డయినట్లు ఆ దేశం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)