‘వాట్సాప్-బీజేపీ చేతులు కలిపాయి’.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ

ఫొటో సోర్స్, CHIP SOMODEVILLA
అమెరికాలోని టైమ్ మ్యాగజీన్‌లో వచ్చిన ఒక కథనం ఆధారంగా మార్క్ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది.
‘ఫేస్‌బుక్ టైస్ టు ఇండియాస్ రూలింగ్ పార్టీ కాంప్లికేట్ ఇట్స్ ఫైట్ ఎగైనెస్ట్ హేట్ స్పీచ్’ (భారత అధికార పార్టీతో ఫేస్‌బుక్ పొత్తు, విద్వేషపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో దాని పోరాటాన్ని జటిలం చేస్తుంది) అనే శీర్షికతో ఒక కథనాన్ని ఆగస్టు 27న టైమ్ మ్యాగజీన్‌లో ప్రచురించారు.
ఇందులో వాట్సాప్‌కు, భారతీయ జనతా పార్టీకి మధ్య పొత్తు గురించి కూడా చర్చించారు.
ఇంతకుముందు అమెరికాకు చెందిన ద వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కూడా ‘ఫేస్‌బుక్ హేట్-స్పీచ్ రూల్స్ కొలైడ్ విత్ ఇండియన్ పాలిటిక్స్’ (విద్వేషపూరిత వ్యాఖ్యలను వ్యతిరేకించాలనే ఫేస్‌బుక్ నిబంధనలకు, భారత రాజకీయాలకు మధ్య సంఘర్షణ) అనే శీర్షికతో ఒక కథనం వెలువడింది.
ఇందులో, భారతదేశంలో పనిచేస్తున్న ఫేస్‌బుక్ సిబ్బంది పక్షపాత ధోరణులను ప్రస్తావించారు. అధికార పార్టీ నాయకుల పోస్టుల విషయంలో ఫేస్‌బుక్ నిబంధనలు సడలిస్తోందని రాసారు.
వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనం గురించి కూడా ఆగస్టు 17 న కాంగ్రెస్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసింది. ఈ విషయంలో దర్యాప్తు జరపాలని కోరుతూ ఇండియాలో ఫేస్‌బుక్ సంస్థ పనితీరును పర్యవేక్షించాలని కోరింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
టైమ్‌లో వచ్చిన కథనంపై రాసిన లేఖలో...
ఇంత తక్కువ సమయంలో మీకు రెండోసారి లేఖ రాయాల్సి వచ్చింది. ఎందుకంటే అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజీన్ మళ్లీ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
టైమ్ కథనంలో ప్రస్తావించిన మూడు ప్రధాన అంశాలు, భారతదేశంలో విదేశీ సంస్థల పనితీరుకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడమే కాక ప్రజల మనోభావాలు దెబ్బతీసేట్టుగా ఉన్నాయని చెప్పారు.
ఒకటి: భారతదేశంలో ఫేస్‌బుక్ చెల్లింపుల వ్యవహారాలకు సంబంధించిన ఒక లైసెన్స్ పొందేందుకు ప్రతిఫలంగా వాట్సాప్ ఇండియా ఆపరేషన్లపై బీజేపీకి నియంత్రణ ఇచ్చింది.
రెండు: భారతదేశంలో మీ కంపెనీ లీడర్‌షిప్‌లో కొందరు బీజేపీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మూడు: 40 కోట్లమంది భారతీయులు వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అందులో మీరు విద్వేషపూరిత వ్యాఖ్యలు అనుమతించడం వల్ల భారతీయుల సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి భంగం కలుగుతోంది.
ఈ అంశాలపై దర్యాప్తు చేయడానికి మీ కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో మాకు వివరించాలని భారత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
భారతదేశంలో మీ సంస్థ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నాం.
"విదేశీ సంస్థలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశంలో సాంఘిక అసమానతలను ప్రేరేపించకుండా చట్టపరమైనచర్యలు తీసుకుంటాం" అని కాంగ్రెస్ తెలిపింది.
కాంగ్రెస్ నేత్ రాహుల్ గాంధీ కూడా ఈ అంశాలపై ట్వీట్ చేసారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫేస్‌బుక్ స్పందన ఏమిటి?
వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కథనం తరువాత...పార్టీలకు అతీతంగా పనిచేస్తూ మా నిబంధనలకు అనుగుణంగా ద్వేషపూరిత వ్యాఖ్యలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.
దీనిపై ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు స్పందించారు.
"మేము ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలను, చర్యలను నిరోధిస్తున్నాం. ఇండియాలోనేకాదు ప్రపంచవ్యాప్తంగా మేము ఈ విధానాలు అమలుచేస్తున్నాం. అయితే ఈ అంశంలో మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. మరిన్ని కట్టుదిట్టమైన విధానాలను రూపొందిస్తూ, వాటి అమలును పర్యవేక్షించేలా మేం కృషి చేస్తున్నాం" అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బీజేపీ ఏమంటోంది?
అయితే, అధికార పార్టీ ఈ ఆరోపణలన్నిటినీ ఖండించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించినప్పుడు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దానిపై తీవ్రంగా స్పందించారు...
"సొంత పార్టీ వ్యక్తులనే ప్రభావితం చేయలేక, ఓటమిపాలైన వారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు మొత్తం ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాయని ఆరోపిస్తున్నారు" అని ట్వీట్ చేసారు.
ఆయన తిరిగి కాంగ్రెస్‌పై కూడా ఆరోపణలు చేసారు.
"ఎన్నికలకు ముందు డేటాను తారుమారు చెయ్యడానికి కేంబ్రిడ్జ్ ఎనలిటికా, ఫేస్‌బుక్‌లతో పొత్తు పెట్టుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన మీరు, ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే చేసే ధైర్యం చేస్తున్నారా?" అంటూ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- ఫేస్ బుక్ వివాదంలో కొత్త మలుపు... ఆంఖీదాస్పై కేసు పెట్టిన ఛత్తీస్‌గఢ్ జర్నలిస్ట్
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు
- రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








