'పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానిస్తాం' - కేసీఆర్ BBC Newsreel..

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/kcr

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుకు 'పీవీ జ్ఞానమార్గ్' అని పేరు పెడతామని, పీవీ మెమోరియల్ కూడా నెలకొల్పుతామని కేసీఆర్ ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ వసంత కుమార్ మృతి

తమిళనాడు ఎంపీ వసంత కుమార్

ఫొటో సోర్స్, VASANTHAKUMAR / FB

తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ, వసంత్ అండ్ కంపెనీ యజమాని వసంత కుమార్ చెనైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతూ మరణించారు.

కన్యాకుమారి నియోజకవర్గం నుంచి గెలిచిన వసంత కుమార్ వయసు 70 ఏళ్ళు. ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆగస్ట్ 10న అడ్మిట్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు.

వసంత కుమార్ సామాజిక, వ్యాపార రంగాలలో అందించిన సేవలు ప్రశంసనీయమని, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఎఫ్‌బీఐ 'మోస్ట్ వాంటెడ్' యాసర్ అబ్దుల్ సయీద్ 12 ఏళ్లకు పోలీసులకు చిక్కాడు

యాసర్ అబ్దుల్ సయీద్

ఫొటో సోర్స్, FBI

ఫొటో క్యాప్షన్, హత్యారోపణలు ఎదుర్కొంటున్న యాసర్ అబ్దుల్ సయీద్ 12 ఏళ్ల తరువాత పోలీసులకు చిక్కాడు.

కన్న కూతుళ్లను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ టాక్సీ డ్రైవర్ 12 ఏళ్ల తరువాత పోలీసులకు చిక్కాడు.

యాసర్ అబ్దుల్ సయీద్ మీద 2008లోనే అరెస్ట్ వారంట్ జారీ అయింది. యాసర్ తన కుమార్తెలైన సారా యాసర్ సయీద్ (17), అమీనా యాసర్ సయీద్ (18) కాల్చి చంపారనే ఆరోపణలు వచ్చిన వెంటనే పోలీసులు అతడి కోసం గాలించడం మొదలు పెట్టారు.

ఈజిప్ట్‌లో పుట్టిన యాసర్ అబ్దుల్ 2014లో ఎఫ్.బీ.ఐ మోస్ట్‌వాంటెడ్ జాబితాలోకి ఎక్కాడు. దాదాపు ఏడేళ్ల తరువాత అతడిని టెక్సస్‌లోని జస్టిన్‌లో అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ 63 ఏళ్ల నిందితుడిని విచారణ కోసం డల్లాస్‌లోని ఎఫ్‌బీఐ విభాగానికి తరలిస్తారు.

చనిపోయిన ఇద్దరమ్మాయిల తల్లి పాట్రిసియా ఓవెన్స్ ఈ అరెస్ట్ వార్త విని సంతోషం వ్యక్తం చేశారు. "నా కూతుళ్ల ఆత్మకు ఇప్పుడు శాంతి లభిస్తుంది" అని అన్నారు.

యాసర్ సయీద్ మీద ఉన్న అభియోగాలు

ఎప్‌బీఐ చెప్పిన వివరాల ప్రకారం 2008లో యాసర్ తన కూతుళ్ళు అమీనా, సారాలను లంచ్‌కని చెప్పి తన టాక్సీలో ఇర్వింగ్‌ పట్టణానికి తీసుకువెళ్ళాడు. అక్కడే వారిని టాక్సీలోనే షూట్ చేసి చంపాడు. సారా ముస్లిమేతర వ్యక్తితో తిరుగుతుందని గతంలోనే ఒకసారి యాసర్ బెదిరించాడని కుటుంబ సభ్యులు చెప్పారని సీబీసీ న్యూస్ తెలిపింది.

అవి 'పరువు పోతుందనే అహంకారంతో చేసిన హత్యలే' అని ఆ అమ్మాయిల అమ్మమ్మ గెయల్ గాట్రెల్ చెప్పారు.

జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా

జపాన్ ప్రధానమంత్రి షింజో అబే

ఫొటో సోర్స్, Reuters

జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు.

తన పదవీ కాలం పూర్తి చేయలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఆయన తన అనారోగ్యం కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

చాలా రోజులుగా అనారోగ్యం..

పెద్ద పేగులో కణితి ఏర్పడటంతో ఆయన చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం ఈ మధ్య మరింత క్షీణించిందని తెలుస్తోంది.

తన ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా చూసేందుకే అబే పదవిని వదిలిపెడుతున్నారని జాతీయ చానెల్ ఎన్‌హెచ్‌కే ఇంతకుముందు తెలిపింది.

2012 నుంచి ప్రధానిగా ఉన్న అబే.. జపాన్ దేశ ప్రధాన మంత్రి పదవిలో సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా కొనసాగిన నాయకుడయ్యారు.

2007లోనూ అర్ధంతరంగా పదవీ త్యాగం

షింజో అబే యుక్త వయస్సు నుంచే ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన 2007లో ప్రధాన మంత్రి పదవి నుంచి అర్థంతరంగా వైదొలిగారు.

సంప్రదాయవాదిగా, జాతీయవాదిగా అబేకు పేరుంది. దూకుడైన ఆర్థిక విధానంతో జపాన్‌ అభివృద్ధిని ఉత్తేజితం చేసిన ఆయన ఆర్థిక విధానాలు ‘అబేనామిక్స్’గా ప్రాచుర్యం పొందాయి.

జపాన్ సైన్యాన్ని ఆయన బలోపేతం చేశారు. రక్షణ వ్యయాన్ని భారీగా పెంచారు. అయితే, రాజ్యాంగంలోని శాంతికాముక ఆర్టికల్ 9ను మాత్రం ఆయన మార్చలేకపోయారు.

స్వీయ రక్షణ కోసం తప్ప మరే ఉద్దేశంతోనూ సైన్యం ఆయుధాన్ని చేపట్టి, దాడులకు సిద్ధం కాకూడదు అన్నదే ఆర్టికల్ 9.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)