బైక్‌లపై బందిపోటు ముఠాలు.. కిడ్నాప్‌లు, హత్యలతో హడలెత్తిస్తున్నారు

నైజీరియాలో హత్యలు, లూటీలు, దారి దోపిడీలు పెరుగుతున్నాయి.
గత దశాబ్దంలో కెబ్బి, సోకొటొ , నైజర్ , జాంఫారా రాష్ట్రాలలో సుమారు 8000 మంది హత్యకు గురైనట్లు ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ తెలిపింది.
గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో నైజీరియా అధ్యక్షుడి సొంత రాష్ట్రమైన కట్సీన లో కనీసం 100 మంది రకరకాల దాడుల్లో మరణించడంతో, అక్కడి ప్రజలు ఆయన పదవి నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు.
కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో ఆహార సరఫరాలు అందుకున్న గ్రామస్థుల పై దుండగులు రెండు సార్లు దాడులు చేశారు. "200 మందికి పైగా మోటార్ బైక్ ల మీద ఏ కే 47 తుపాకీలు పట్టుకుని వచ్చారు. అన్ని బైక్ ల వెనక మరో వ్యక్తి ఉన్నారని”, వారిని ప్రత్యక్షంగా చూసిన బషీర్ కడిసవ్ బీబీసీ కి చెప్పారు.
అంత మంది మోటార్ సైకిళ్ళ పై రావడం చూసి భయపడి చెట్టు ఎక్కిపోయానని చెప్పారు. వాళ్ళు అక్కడ ఉన్న దుకాణాలు దోచుకుని , పాడి, పశువులను దొంగలించుకుని వెళ్లడం మాత్రమే కాకుండా , పారిపోతున్నవారిని కాల్చేశారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్రిక్తలను పెంచుతున్న వాతావరణ మార్పులు
నిధుల పంపిణీలో ఫులానీ తెగ కి చెందిన పశువుల కాపరులు, వ్యవసాయ వర్గాలకు కొన్ని దశాబ్దాలుగా పోటీ, స్పర్థ ఉంది. ఈ దాడులకు అదే ప్రధాన కారణం.
ఇక్కడున్న పశువుల కాపరులు ముఖ్యంగా సంచార జాతికి చెందిన వారు. వీరు దేశమంతా తిరుగుతూ హైవేల మీద, వీధుల్లోనూ పశువులను మేపుతూ సంచరిస్తూ ఉంటారు. కానీ, నైజీరియాలో వాయువ్య, మధ్య ప్రాంతాల్లో నెలకొన్న రాష్ట్రాలలోని రైతులతో వారు తీవ్రమైన ఘర్షణలకు పాల్పడ్డారు.
ఈ ప్రాంతాలలో సహారా ఎడారి ప్రాంతం దక్షిణానికి విస్తరించడంతో పెద్ద ఎత్తున అడవుల నాశనం జరిగింది. దీంతో వ్యవసాయ భూమి తగ్గిపోయి, తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది.
ఈ నిరంతర ఘర్షణల వలన ఇరు వర్గాల నుంచి స్వీయ రక్షణ కోసం సాయుధ దళాలు పుట్టుకొచ్చాయని, భద్రతా విశ్లేషకుడు కబీరు అదాము బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పశువులను పెంచుకోవడం కన్నా కిడ్నాప్ లాభదాయకం
ఫులాని తెగల్లో ఉన్న సాయుధ దళాలు నేరాలకు పాల్పడాతారనే ఆరోపణలు ఉన్నాయి.
"వీరు పశువులను పెంచుకోవడం కన్నా కిడ్నాప్ చేయడం, వస్తువులను దోచుకోవడం లాభదాయకంగా ఉందని భావిస్తున్నారు”.
ఒక పెద్ద ఆవునను పెంచితే 200000 నైరా (నైజీరియాన్ కరెన్సీ) సుమారు 38000 రూపాయలు వస్తాయి. కానీ, ఎవరినైనా కిడ్నాప్ చేస్తే కొన్ని లక్షల రూపాయలు వస్తాయని అదాము చెప్పారు.
అయితే, ఈ ఆరోపణను ఫులాని తెగ వారు ఖండిస్తున్నారు.
దోపిడీదారుల అరాచకాల వలన ఎక్కువగా నష్టపోతున్నది తమ తెగ వారేనని, తమ తెగ వారు కొంత మంది కిడ్నాప్ కి కూడా గురయ్యారని పశువుల పెంపకం అసోసియేషన్ మియె ట్టి అల్లా అంటోంది.
దోపిడీదారుల్లో అన్ని రకాల నేరస్థులు ఉన్నారు. మా ఆవులను దొంగలించారు. నైజీరియాలో రక రకాల విపత్తుల కారణంగా మేమిప్పటికే 30 శాతం పశువులను కోల్పోయాం అని మియెట్టి అల్లా జాతీయ కార్యదర్శి బాబా వొట్మాన్ గెల్జర్మ చెప్పారు.
ఈ దాడులు చేస్తున్న వారు విదేశీయులని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నైజీరియా వాయువ్య ప్రాంతం యు కె విస్తీర్ణమంత ఉంటుంది. ఇది నైజర్ తో సరిహద్దులు కలిగి ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య నేరస్థుల ముఠాలు, భద్రతా దళాల కళ్ళు గప్పి సరిహద్దులు దాటి వస్తూ ఉంటారు.
పశువుల కాపరులు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు
సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతం ఈ దోపిడీదారులకు ఆవాసంగా మారింది.
వాయువ్య ప్రాంతంలో దోపిడీదారులతో పాటు ఫులాని తెగల వారు కూడా దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు .
ఫులాని తెగల వారి దగ్గర తమని తాము రక్షించుకోవడానికి ఆయుధాలున్నట్లు గ్రహించారు. కానీ, వారు తమని తాము రక్షించుకోవడం మాత్రమే కాకుండా గతంలో వారిని కష్ట పెట్టినవారి పై పగ తీర్చుకోవాలని చూస్తున్నారని,
కట్సీన రాష్ట్ర పోలీస్ ప్రతినిధి ఈసా గాంబో బీబీసీ కి చెప్పారు
అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు కిడ్నాప్ లు చేసే ముఠాలు నైజీరియాలో ఉన్నాయి. వీరు బాధితుల నుంచి 20 డాలర్ల నుంచి 200000 డాలర్ల వరకు (1500 రూపాయిల నుంచి 15 కోట్ల రూపాయిల వరకు ) డిమాండ్ చేస్తారు.
2017 - 2018 మధ్య కాలంలో నైజీరియా రాజధాని అబూజా ని సెంట్రల్ నైజీరియాలో కదున తో కలిపే మార్గంలో రోజుకి 10 మంది అపహరణకు గురయ్యారు. ఈ మార్గంలో 20 భిన్న ముఠాలు తిరుగుతున్నట్లు, కిడ్నాపర్లను పట్టుకునే విభాగానికి పోలీస్ అధిపతిగా ఉన్న అబ్బా క్యారీ చెప్పారు.

కట్సీన రాష్ట్ర గవర్నర్ అమీను బెల్లో మసారి గత సంవత్సరం అడవిలోకి వెళ్లి దోపిడీదారులను కలిశారు. దాడులను ఆపితే శిక్ష లేకుండా చూస్తామనే ప్రతిపాదన చేశారు.
ఆయన దోపిడీదారులతో కలిసి తీసుకున్న ఒకఫోటో చూసి నైజీరియా ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
అంతకు ముందే బందిపోట్ల చేతిలో అపహరణకు గురైన నసీఫ్ అహ్మద్ అనే వ్యాపారి గవర్నర్ ప్రతిపాదనను ఖండించారు.
"చదువు లేకుండా, పశువుల్లా ప్రవర్తించే వారితో ప్రభుత్వం ఒప్పందం ఎలా కుదుర్చుకుంటుందని ప్రశ్నించారు.
గత నెలలో కట్సీన రాష్ట్రంలో ప్రజలు దేశాధ్యక్షుని చిత్రాన్ని కాల్చి తమ నిరసన తెలిపారు. ముహమ్మదు బుహారీ 2015 లో దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన పరిపాలన కాలంలో ఈశాన్య ప్రాంతాలలో భయంకరమైన ఇస్లామిక్ తిరుగుబాటు పెరుగుతూ వస్తోంది. రైతులు, పశువుల కాపరుల మధ్య ఘర్షణలు, నేరాలు పెరిగాయి.
కట్ సీనా నుంచి బందిపోట్లని , కిడ్నాపర్లను నిర్మూలించాలని ఆ దేశాధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలతో నైజీరియా సైన్యం ఆ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తోంది.
పశువుల కాపరులకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలను కేటాయించే ప్రయత్నాలను కూడా చేస్తున్నారు.
.కానీ, జాతి భేదాలతో విడిపోయిన దేశంలో, ఆ దేశాధ్యక్షుడు ఆయన తెగ వారికి స్థలాన్ని కేటాయించాలని పక్షపాతాన్ని చూపిస్తున్నారని చాలా రాష్ట్రాల గవర్నర్లు ఈ ప్రతిపాదనకు మద్దతివ్వలేదు.
నైజీరియా వాయువ్య ప్రాంతంలో రైతులు, పశు కాపరుల మధ్య విబేధాలు మరింత అస్పష్టంగా తయారవుతున్నాయని అర్ధమవుతోంది. బందిపోట్లు ఎంత వరకు మాట మీద నిలబడతారనేది కూడా సందేహమే.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ మూలాలున్న హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఇలా స్థాపించారు
- మన దేశానికి సెకండ్ హ్యాండ్ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
- ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..
- బలూచిస్తాన్ స్వతంత్ర దేశ ఉద్యమానికి భారత్ 'రా' సహకారం ఇస్తోందా?.. ఇప్పటికీ ఆ ప్రాంతంతో పాకిస్తాన్‌కు చిక్కులు ఎందుకు?
- కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చిచ్చు పెడుతున్న బెలూన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








