బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ: పాకిస్తాన్‌కు కునుకు లేకుండా చేస్తున్న ఈ సాయుధ దళం ఎలా పుట్టింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మొహమ్మద్ కాజిమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి, బలూచిస్తాన్
పాకిస్తాన్ సాయుధ దళం 'బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ'(బీఎల్ఏ)ను గతంలోనే అమెరికా ఉగ్రవాద సంస్థల జాబితాలో ఒకటి.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉనికి మొదటిసారి 1970వ దశకం ప్రారంభంలో కనిపించింది.
పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మొదట అధికారంలోకి వచ్చినపుడు పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా బలూచిస్తాన్‌లో సాయుధ తిరుగుబాటు మొదలైంది.
అయితే సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేజిక్కించుకున్న తర్వాత బలూచ్ రాజకీయ నేతలతో చర్చలు జరిగాయి. ఫలితంగా సాయుధ తిరుగుబాటు ముగిసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయింది.
తర్వాత మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాలనలో బలూచిస్తాన్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ నవాజ్ మిరీ హత్య ఆరోపణలపై స్థానిక నేత నవాబ్ ఖైర్ బక్ష్‌ను అరెస్టు చేసినప్పుడు, 2000 సంవత్సరంలో బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
విస్తృతమైన ప్రభావం
మెల్లమెల్లగా ఈ దాడులు విస్తరించడంతోపాటు అవి బెలూచిస్తాన్‌లోని మిగతా ప్రాంతాలకూ వ్యాపించాయి. వీటిలో ఎక్కువ దాడులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత తీసుకుంది.
2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అప్పుడు నవాబ్ ఖైర్ మిరీ కొడుకు నవాబ్‌జాదా బాలాచ్ మిరీని దీనికి నాయకుడుగా ఉన్నారని పాకిస్తాన్ అధికారులు చెప్పారు.
2007 నవంబర్‌లో బాలాచ్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో భద్రతాదళాలతో జరిగిన ఘర్షణలో అతడు మృతిచెందాడని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అప్పుడు ప్రకటించింది.

చైనా స్థావరాలకు వ్యతిరేకం
బాలాచ్ మిరీ మరణం తర్వాత బ్రిటన్‌లో ఉంటున్న అతడి సోదరుడు నవాబ్‌జాదా హీర్‌బయార్ మిరీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకుడుగా చేశారని పాకిస్తానీ అధికారులు చెప్పారు.
అయితే నవాబ్‌జాదా హీర్‌బయార్ మిరీ వైపు వారు మాత్రం ఆయన సాయుధ దళాలకు నాయకుడుగా ఉన్నారనే వార్తలను కొట్టిపారేశారు.
నవాబ్‌జాదా బాలాచ్ మిరీ మరణించిన తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకత్వం గురించి వచ్చిన పేర్లలో అస్లమ్ బలోచ్ పేరు ఉన్నాడు. అతడు మొదట ఆ సంస్థలో సెంట్రల్ కమాండర్‌గా పనిచేశాడు.
భద్రతా దళాల ఆపరేషన్‌లో గాయపడిన అస్లమ్ బలోచ్, చికిత్స కోసం భారత్ వెళ్లడంపై సంస్థలోని మిగతా నేతల్లో అభిప్రాయబేధాలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి.
ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత అస్లం బలోచ్ బలూచిస్తాన్, అప్గానిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాడు.
అస్లం బలోచ్ నాయకుడుగా ఉన్నప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఆత్మాహుతి దాడులు కూడా మొదలయ్యాయి. వాటిని సంస్థ 'ఫిదాయీ దాడులు'గా చెప్పుకునేది.
ఈ సంస్థ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ ట్రాన్సిట్ ప్రాజెక్టును కూడా వ్యతిరేకిస్తుంది. అది ఇటీవలి దాడుల్లో పాకిస్తాన్‌లో చైనా కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది.
బీఎల్ఏ మొట్టమొదట 2018 ఆగస్టులో జరిగిన ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని అంగీకరించింది. చాంగీ చిల్లా హెడ్‌క్వార్టర్ దాల్‌బందీన్ నగరం దగ్గర జరిగిన ఈ దాడిని స్వయంగా అస్లం బలోచ్ కొడుకు చేశాడు.
ఈ దాడిలో సైనిక ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న వ్యక్తులు వెళ్తున్న బస్సును అతడు టార్గెట్ చేసుకున్నారు. అందులో చైనా ఇంజనీర్లు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
మిగతా సాయుధ సంస్థలతో సంబంధాలు
ఆ తర్వాత 2018 నవంబర్‌లో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై జరిగిన మిలిటెంట్ దాడికి కూడా తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పింది. దీనిని ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు చేశారు.
ఈ దాడి తర్వాత అఫ్గానిస్తాన్ కంధార్ ప్రాంతంలో ఎను మీనాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అస్లమ్ అచ్చో మృతి చెందాడని వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం బీఎల్ఏ బషీర్ జేబ్ నాయకత్వంలో కొనసాగుతోంది. నాయకుడు మారినా సంస్థ నుంచి ఫిదాయీ ఘటనలు మాత్రం ఆగలేదు.
ఈ ఏడాది మేలో గ్వాదర్‌లోని కాంటినెంటల్ హోటల్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలోని మజీద్ బ్రిగేడ్ సభ్యులు ఆత్మాహుతి దాడి చేశారు.
మజీద్ బలూచ్ అనే మిలిటెంట్ పేరుతో మజీద్ బ్రిగేడ్ ఏర్పడింది. అతడు 1970వ దశకంలో అప్పటి ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోపై బాంబు దాడికి ప్రయత్నించాడు.
గ్వాదర్ హోటల్‌పై దాడి జరిగినప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ దాడి చేసిన వారి ఫొటోలు, వీడియో సందేశాలను కూడా విడుదల చేసింది.
2017 నవంబర్‌లో 'బలూచ్ రాజీ అజూయీ సింగర్' లేదా బ్రాస్ పేరుతో ఏర్పడిన బలూచ్ మిలిటెంట్ సంస్థల కూటమిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భాగం అయ్యింది.
ఇందులో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతోపాటు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ రిపబ్లికన్ గార్డ్స్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి.
ఇవి ఎక్కువగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే దాడులకు పాల్పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








