రూ. కోటీ 69 లక్షల విలువైన లాంబోర్గిని కారు.. రోడ్డెక్కిన 20 నిమిషాలకే ముక్కలైంది

ఎం-1హైవేపై ఆగివున్న లాంబోర్గిని కారును వ్యాన్‌ ఢీట్టిందని పోలీసులు చెప్పారు

ఫొటో సోర్స్, West Yorkshire Police

ఫొటో క్యాప్షన్, ఎం-1హైవేపై ఆగివున్న లాంబోర్గిని కారును వ్యాన్‌ ఢీట్టిందని పోలీసులు చెప్పారు

అప్పుడే కొన్న ఖరీదైన లాంబోర్గిని కారు. రోడ్డెక్కి 20 నిమిషాలు కూడా కాలేదు. హైవే పక్కన ఆపడం, ఆ వెనకే వస్తున్న వ్యాన్‌ గట్టిగా ఢీకొట్టడంతో ఆ లగ్జరీ కారు తీవ్రంగా దెబ్బతింది. బ్రిటన్‌లోని వెస్ట్‌ యార్క్‌షైర్‌లోని ఎం-1 హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

ఈ కారు ఖరీదు సుమారు 2 లక్షల డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే రూ. కోటీ 69 లక్షలకు పైమాటే. రోడ్డు మీదకు వచ్చిన కొద్ది నిమిషాలకే ఈకారులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి దాన్ని హైవే పక్కన నిలిపారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ వ్యాను కారును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. డ్రైవర్‌ తలకు దెబ్బ తగిలినా, అవి అంత తీవ్రమైందికాదని వెస్ట్‌ యార్క్‌ షైర్‌ పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను యార్క్‌ షైర్‌ పోలీసు అధికారి ఒకరు ట్వీట్ చేశారు. యాక్సిడెంట్‌ మామూలు విషయమే అయినప్పటికీ కారును తలచుకుని బాధపడాల్సిందేనని కామెంట్ పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రమాదం కారణంగా ఎం-1 హైవేలోని కొంత భాగాన్ని కాసేపు క్లోజ్‌ చేయాల్సి వచ్చింది.

ప్రమాదం కారణంగా హైవేపై కాసేపు రవాణా స్థంభించింది

ఫొటో సోర్స్, West Yorkshire Police

ఫొటో క్యాప్షన్, ప్రమాదం కారణంగా హైవేపై కాసేపు రవాణా స్థంభించింది

అయితే ఈ కారు ఓనర్ ఎవరు, దాన్ని ఎక్కడ కొన్నారు, అది కొత్తదా, సెకండ్‌ హ్యాండ్‌దా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో ఈ మోడల్‌ కార్లను 150,000 యూరోల నుంచి 250,000 వరకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)