హ్యారీ పోటర్ హౌజ్ ఫర్ సేల్

ఫొటో సోర్స్, FTP Edelman
‘హ్యారీ పోటర్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంగ్ల రచయిత్రి జేకే రౌలింగ్ కాల్పనిక నవలలోని ఆ పాత్ర గురించి వినని వారెవరూ ఉండరేమో.
హ్యారీ పోటర్ నవలలు సినిమాలుగా వచ్చి రికార్డులు కూడా సృష్టించాయి.
'హ్యారీ పోటర్ అండ్ డెత్లీ హ్యాలోస్ పార్ట్ - 1' సిరీస్ చూశారా? అందులో హ్యారీ పోటర్ జన్మస్థలం లావెన్‌హంలోని డి వెరె హౌజ్‌గా చూపించారు.
ఆ ఇంటిలోనే హ్యారీపోటర్ అమ్మానాన్నలను విలన్ అయిన లార్డ్ వోల్డెమోర్ట్ చంపేస్తాడు.
14వ శతాబ్దం నాటి ఆ ఇంటిని ఏడాది కిందట అమ్మకానికి పెట్టారు. అయితే, ఇప్పటి వరకు దాన్ని ఎవరూ కొనడం లేదు.
రూ. 9.44 కోట్లకు గత వేసవిలో దీన్ని అమ్మకానికి పెట్టారు.

ఫొటో సోర్స్, FTP Edelman

ఫొటో సోర్స్, FTP Edelman
కొనుగోలుదారుడి కోసం వెతుకుతున్నామని ఈ ఇంటి యజమాని కార్టెర్ జోనస్ చెప్పారు.
హ్యారీ పోటర్ సినిమా నిర్మాణ భాగస్వామి కార్లోన్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. ''ఇలాంటి ప్రత్యేకమైన ఇంటిని అమ్మేటప్పుడు సరైన వ్యక్తిని గుర్తించాలి. ఇంటిలో ఉండటం కాదు ఇంటి సంరక్షకుడిగా ఉండేందుకు సిద్ధమవ్వాలి.'' అని అన్నారు.
సరైన కొనుగోలుదారుడి చేతిలో పడితే ఈ నిర్మాణం ఒక సంపదగా మారుతుందని చెప్పారు.
లావెన్‌హంలో నిర్మితమైన 340 గొప్పకట్టడాల్లో ఈ ఇల్లు ఒకటిగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, FTP Edelman

ఫొటో సోర్స్, FTP Edelman
డి వెరె హౌజ్ వంశం పేరు మీద ఈ ఇంటికి ఆ పేరు వచ్చింది. దీని కంటే ముందు ఈ ఇంటిని ఆక్సన్ ఫోర్డ్, ఆక్స్‌ఫోర్డ్ హౌజ్ అని పిలిచేవారు.
''మధ్యయుగంలో ఇంగ్లండ్ రాజు తర్వాత అత్యంత ధనవంతులు డి వెరె వంశస్థులు. ఆ కాలంలో లావెన్‌హంను వైభవంగా సృష్టించిన ఘనత కూడా వీరికే దక్కుతుంది'' అని ఎస్టేట్ ఏజెంట్ చెప్పారు.
మధ్యయుగ కాలంనాటి వైభవం ఈ ఇంటిలో కనిపిస్తోంది. కలపతో నిర్మితమైన ఈ నిర్మాణంలో వెచ్చదనాన్ని అందించే నిప్పు గూళ్లు, కుడ్య చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
లావెన్‌హంలోని అత్యంత విలువైన వాటిలో ఒకటిగా డి వెరె హౌజ్ నిలిచిపోతుందని కార్టర్ జోనస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








