కిమ్ జోంగ్ ఉన్‌కు గుండె ఆపరేషన్ జరిగిందా? లేదా?.. దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే..

ఫొటో సోర్స్, Reuters
ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ అనారోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు ఆధారాలులేవని, ఆయన గుండెకు ఆపరేషన్ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని దక్షిణకొరియా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల 20రోజులపాటు ప్రజలకు కనిపించలేదు. తన తాత జన్మదిన వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదు. ఉత్తరకొరియాకు సంబంధించి ఈ వేడుకలకు దేశంలో అత్యంత ప్రాధాన్యముంది. ఆయన తీవ్రంగా ఆనారోగ్యం పాలయ్యారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఇటీవల ఆయన ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి ప్రారంభోత్సవం చేస్తూ కనిపించారు.
దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పాయి?
బుధవారంనాడు పార్లమెంటరీ కమిటీతో మాట్లాడిన దక్షిణకొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధిపతి సు హూన్.. కిమ్ ఆరోగ్యం గురించి పలు విషయాలు వెల్లడించినట్లు ఆ దేశానికి చెందిన న్యూస్ ఏజెన్సీ యోన్‌హాప్ చెప్పింది. కిమ్ జోంగ్ ఉన్‌లో గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సూ హూన్ చెప్పినట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ యేడాది ఇప్పటి వరకు కిమ్ జోంగ్ ఉన్ కేవలం 17 సార్లే ప్రజలకు కనిపించారని, సాధారణంగా ప్రతియేటా ఈ సమయానికి కనీసం 50 సార్లు ప్రజలకు కనిపించేవారని దక్షిణ కొరియా పార్లమెంటరీ కమిటి అన్నట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఉత్తర కొరియాలో ఎలాంటి కేసులు లేనప్పటికీ, కరోనావైరస్ కారణంగా ఆయన ప్రజలకు కనిపించడం తగ్గించి ఉంటారని కమిటీలో ఒక సభ్యుడు అభిప్రాయపడ్డట్లు న్యూస్‌ఏజెన్సీ వెల్లడించింది.
''ఉత్తరకొరియాలో కూడా వ్యాధి ప్రబలిందన్న విషయాన్ని కొట్టిపోరేయలే''మని దక్షిణ కొరియా ప్రజాప్రతినిధి కిమ్ బ్యూంగ్ కీ అన్నారు.
''మిలిటరీ వ్యవహారాలు, పార్టీ మీటింగులు లాంటి అంతర్గత విషయాల కారణంగా కిమ్ జోంగ్ ఉన్ బిజిగా ఉన్నారు. కరోనావైరస్ కూడ తోడవడంతో ఆయన ప్రజలకు కనిపించడం తగ్గించి ఉంటారు'' అని ఆ ప్రజాప్రతినిధి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
ఆయన మీద వచ్చిన వదంతులేంటి?
ఏప్రిల్ 15న తన తాత జయంతి ఉత్సవాలకు హాజరుకాకపోవడంతో కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
దానికి ఆరు రోజుల తర్వాత కిమ్ గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారని డెయిలీ ఎన్‌కె అనే వెబ్‌సైట్ పేర్కొంది. ఈ వెబ్‌సైట్‌ను ఉత్తరకొరియా ప్రభుత్వ వ్యతిరేకులు విదేశాల నుంచి నడుపుతుంటారు.
ఈ వెబ్‌సైట్ చెప్పిన విషయాన్నే ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు చెప్పడం మొదలుపెట్టాయి. కొందరు ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని చెప్పగా, మరికొన్ని మీడియా సంస్థలు ఏకంగా చనిపోయాడని కూడా ఊహాగానాలను ప్రసారం చేశాయి.
అదే సమయంలో దక్షిణకొరియా ప్రభుత్వం, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదంతా అబద్ధమని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో అన్నాయి.
గతంలో కిమ్ ఇలా మాయమయ్యారా?
2014లో కిమ్ 40రోజులపాటు కనిపించలేదు. ఒకపక్క ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తుండగానే, ఫోటోలలో చేతికర్రతో కిమ్ కనిపించారు.
శారీరకంగా ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని ఆదేశ అధికార మీడియా ప్రకటించినప్పటికీ, ఆయన కాళ్లకు సంబంధించిన ఒక సమస్యతో బాధపడుతున్నారన్న ఊహాగానాలకు మాత్రం ఆ మీడియా అప్పట్లో సమాధానం చెప్పలేదు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కిమ్కూ గడాఫీకి పట్టిన గతేనా?
- కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగా ఉన్నారు... సంతోషంగా ఉందన్న డోనల్డ్ ట్రంప్
- కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
- బాయ్స్ లాకర్ రూమ్: ఈ గ్రూప్‌లో ఏం జరిగింది? టీనేజ్ అబ్బాయిలు చేస్తున్న అకృత్యాలపై ఎవరేమన్నారు?
- బ్రిటన్ హోమ్ కేర్‌లో మరణించిన 92 ఏళ్ల భారతీయ సెలబ్రిటీ జర్నలిస్ట్ గుల్షన్ ఎవింగ్
- కరోనావైరస్ పుట్టింది ప్రయోగశాలలోనేనా? అమెరికా 'ల్యాబ్ థియరీ'కి చైనా ప్రభుత్వ మీడియా సమాధానం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








