పంటకు నష్టం చేసిన కలుపుమందు.. బేయర్, బీఏఎస్ఎఫ్ సంస్థలకు రూ. 1,890 కోట్ల జరిమానా విధించిన అమెరికా కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
265 మిలియన్ డాలర్ల జరిమానాను విధిస్తూ అమెరికాలోని మిస్సోరీ కోర్టు ఇచ్చిన తీర్పును జర్మనీ రసాయన సంస్థ బేయర్ సవాలు చేస్తోంది.
బేయర్ సంస్థకు చెందిన కలుపును నివారించే మందులే తన పంట నష్టానికి కారణం అంటూ బిల్ బాడెర్ అనే పీచ్ పండ్ల రైతు బేయర్, బీఏఎస్ఎఫ్ సంస్థల మీద కేసు వేశాడు.
తన పండ్ల తోటకు దగ్గరగా ఉన్న పొలాల నుంచి కొట్టుకొచ్చిన డైకాంబా కలుపు సంహారకాలు మొత్తం పంటను నాశనం చేశాయని ఆరోపించాడు.
పంటల్లో కలుపు రాకుండా కొట్టే డైకాంబా కలుపు సంహారకం, పంటలకు తీవ్రంగా నష్టాలు తీసుకొస్తోందని ఈ సంస్థలపై 140 కేసులు నమోదయ్యాయి. వీటిలో కోర్టు తీర్పు చెప్పిన తొలి కేసు ఇదే.
బేయర్ మాత్రం, తమ కలుపు సంహారకాలను సరిగ్గా ఉపయోగిస్తే, వాటి వల్ల ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది.


అమెరికా అగ్రి కెమికల్స్ సంస్థ మోన్‌శాంటోను, 2018లో 63 బిలియన్ డాలర్లకు బేయర్ కొనుగోలు చేసింది. ఆ సంస్థ ఉత్పత్తులైన డైకాంబా ఆధారిత కలుపు సంహారకాలు రైతుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
మోన్‌శాంటో కలుపు సంహారకాలకు వ్యతిరేకంగా వేసిన ఈ కేసుల వల్ల బేయర్ వందల కోట్ల డాలర్ల రూపాయల మేర పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
మిస్సోరీలో జరిగిన పంట నష్టాలను బేయర్, బీఏఎస్ఎఫ్ పంచుకుంటాయా అనేదానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు.
శనివారం (ఫిబ్రవరి 15వ తేదీ) మిస్సోరీలోని కేప్ జిరాడో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, "మాకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన వనరులను ఉపయోగిస్తాం" అని బీఏఎస్ఎఫ్ చెప్పింది.
రైతు బాడెర్‌కు 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ.107 కోట్లు) నష్ట పరిహారంతో పాటు, జరిమానాగా మరో 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,783 కోట్లు) చెల్లించాలని కోర్టు ఈ రెండు సంస్థలను ఆదేశించింది.

- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- అధిక దిగుబడే వ్యవసాయ సంక్షోభానికి కారణమా!
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?

తన వెయ్యి ఎకరాల పండ్ల తోట డైకాంబా కలుపు సంహారకాల వల్ల నాశనం అయ్యిందని రైతు వాదించారు.
జ్యూరీ తీర్పుతో తాము స్పష్టంగా విభేదిస్తున్నామని, అది తమకు చాలా నిరుత్సాహపరిచిందని బేయర్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పింది.
"మేం ఈ తీర్పును వెంటనే అప్పీల్ చేస్తాం. ఏ రైతు పంట నష్టపోయినా, మాకు వారి పట్ల చాలా సానుభూతి ఉంటుంది. బాడెర్ విషయానికి వస్తే, తన నష్టానికి కారణం అనేలా మోన్‌శాంటో ఉత్పత్తులు ఏవీ ఆయన పొలంలో ఉన్నట్టు బలమైన ఆధారాలు లభించలేదు" అని తెలిపింది.
అమెరికా మధ్య రాష్ట్రాలలో వేలాది ఎకరాల పంట నాశనం కావడానికి డైకాంబా ఆధారిత కలుపు సంహారకాలే కారణం అని ఆరోపణలు వస్తున్నాయి.
రైతుల్లో దీనిపై ఆందోళనలు వ్యక్తమవడంతో 2018 నవంబర్‌లో అమెరికా ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ) డైకాంబా కలుపు సంహారకాలను ఉపయోగించడంపై నిషేధం విధించింది.
మాన్‌శాంటో కలుపు సంహారకాలు రైతులకు సురక్షితం, చాలా అమూల్యమైనవి అని బేయర్ గట్టిగా వాదిస్తోంది. లేబుల్ మీద ఉన్న సూచనల ప్రకారం దానిని ఉపయోగిస్తే, రైతులకు ఎలాంటి నష్టాలూ రావని అంటోంది.

ఇవి కూడా చదవండి:
- నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష: దిల్లీ కోర్టు
- ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది
- శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న భారత్
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- అయోధ్య రామమందిర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం - పార్లమెంటులో మోదీ ప్రకటన
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









