సుమత్రన్ రైనో: మలేషియాలోని ఏకైక ఖడ్గమృగం 'ఇమాన్' మృతి

ఫొటో సోర్స్, AFP/GETTY/ANDREAS PUTRANTO
అత్యంత అరుదైన సుమత్రన్ ఖడ్గమృగం (రైనో) మలేషియాలో అంతరించిపోయింది.
అక్కడ ఇప్పటి వరకున్న ఏకైక సుమత్రన్ ఖడ్గమృగం 'ఇమాన్' బోర్నియో ద్వీపంలో చనిపోయింది. 25 ఏళ్ల ఈ ఆడ రైనో శనివారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
మలేషియాలోని చివరి మగ సుమత్రన్ రైనో ఈ ఏడాది మేలో చనిపోయింది.
ఒకప్పుడు సుమత్రన్ రైనోలు ఆసియా ఖండం వ్యాప్తంగా ఉండేవి. నేడు అడవుల్లో ఇవి దాదాపు కనిపించడం లేదు.
ప్రపంచంలో సుమత్రన్ ఖడ్గమృగాలు ఇప్పుడు వందలోపు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నారు. ఇవి ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లోని అడవుల్లో ఉంటున్నాయి. ఈ సంఖ్య 30లోపేనని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ఈ జాతి ఖడ్గమృగాలకు అంతరించిపోయే ముప్పు అత్యంత తీవ్రస్థాయిలో ఉంది.
ఇమాన్‌ది సహజ మరణమేనని, అందుబాటులో ఉన్న వివరాలను బట్టి... మరణానికి 'షాక్' కారణమని సబా రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, పర్యావరణ శాఖల మంత్రి క్రిస్టీన్ ల్యూ చెప్పారు.
ఈ ఖడ్గమృగాన్ని 2014 మార్చిలో పట్టుకున్నప్పటి నుంచి చనిపోయేవరకు చాలా బాగా చూసుకున్నామని ఆమె తెలిపారు.
వేటగాళ్ల వల్ల, ఆవాసాలు కోల్పోవడం వల్ల సుమత్రన్ ఖడ్గమృగాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
ఇప్పుడు ఈ రైనోలకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య- ఇవి చెట్టుకొకటి పుట్టకొకటి కావడం.
మలేషియాలో వీటి సంఖ్య పెరిగేలా ప్రత్యుత్పత్తి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఫొటో సోర్స్, Save the Rhino International
రైనో జాతుల్లో అత్యంత చిన్నది ఇదే
ప్రపంచంలో ఖడ్గమృగాల జాతులు ప్రస్తుతం ఐదు ఉన్నాయి. వీటిలో మూడు ఆసియాలో, రెండు ఆఫ్రికాలో ఉన్నాయి.
ఆసియాలోని జాతుల్లో సుమత్రన్ రైనో ఒకటి. ఇప్పుడున్న జాతుల్లో అత్యంత చిన్నది ఇదే.
సుమారు 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఉన్నితో కూడిన ఖడ్గమృగ జాతికి, సుమత్రన్ రైనోకు దగ్గరి పోలికలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి.
- అమ్మకానికి గున్న ఏనుగులు
- గర్భిణిని కరిచి చంపిన కుక్కలు.. 93 శునకాలకు డీఎన్ఏ పరీక్షలు
- ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సంసిద్ధతపై 5 ప్రశ్నలు
- గూగుల్ పిక్సెల్ ఫోన్లలో భద్రతా లోపాన్ని చూపిస్తే భారీ బహుమతి
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








