ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..

గొర్రె

ఫొటో సోర్స్, Getty Images

ఆకలితో ఉన్న 500 మేకలు కాలిఫోర్నియాలో చెలరేగుతున్న దావానలం బారి నుంచి రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీని కాపాడాయి.

భవనం చుట్టూ పెరిగిన చెత్త, మొక్కలు, గడ్డి వంటి వాటిని తొలగించే ఉద్దేశంతో ఈ లైబ్రరీ.. మే నెలలో 500 మేకలను అద్దెకు తెచ్చుకుంది.

లైబ్రరీ భవనం చుట్టూ పెరిగిన మొక్కలు, ఎండిన గడ్డి వంటి వాటిని ఈ మేకలు కొద్దిరోజుల్లోనే పూర్తిగా తినేశాయి. దీంతో ప్రస్తుతం కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న దావానలం ఈ భవనాన్ని చుట్టుముట్టే ప్రమాదం చాలావరకూ తగ్గిపోయింది. అంతేకాకుండా, ఫైర్‌ఫైటర్లకు తమ ప్రణాళికలను అమలుచేసేందుకు కొంత సమయాన్ని కూడా ఇచ్చినట్లైంది.

లాస్ ఏంజెలిస్ సమీపంలో ఉన్న ఈ లైబ్రరీకి ప్రస్తుతం వ్యాపిస్తున్న మంటలతో ప్రమాదం పొంచి ఉంది. ఈ మంటల కారణంగా రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

విన్సెంట్ వాన్ గోట్, సెలీనా గోట్మెజ్, గోట్జార్ట్‌ అనే కాంట్రాక్టర్ల ద్వారా ఈ మేకల మందను అద్దెకు తెచ్చారు. వీరి సాయంతోనే... ఇక్కడున్న ఎయిర్‌ ఫోర్స్ ఒన్ విమానం, బెర్లిన్ గోడలోని ఓ ముక్కతో పాటు ఎన్నో విలువైన వస్తువులు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడారు.

"అగ్ని వ్యాపించేందుకు అవకాశం లేకపోవడంతో తమ పని కొద్దిగా సులభమైందని ఫైర్ ఫైటర్లు అన్నారు" అని లైబ్రరీ ప్రతినిధి మెలిసా గిల్లర్ వార్తాసంస్థ రాయిటర్స్‌తో తెలిపారు.

ఎండిన మొక్కలను తింటున్న గొర్రెలు

ఫొటో సోర్స్, Getty Images

'805 గోట్స్' అనే ఓ స్థానిక కంపెనీ నుంచి ఈ మేకల మందను అద్దెకు తీసుకుని, భవనం చుట్టూ ఉన్న 13 ఎకరాల భూభాగాన్ని శుభ్రం చేశారు.

స్కాట్ మోరిస్ అనే వ్యక్తి ఈ కంపెనీని గత నవంబరులో స్థాపించారు. ఒక ఎకరం భూమిని మేకలతో శుభ్రం చేయించాలంటే 1000 డాలర్లు (దాదాపు 70000 రూపాయలు) వసూలు చేస్తారు.

కాలిఫోర్నియాలో మరిన్ని అగ్నికీలలు వ్యాపించే అవకాశం ఉండటంతో, తమ మేకల మందలకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే వాటి సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నానని మోరిస్ తెలిపారు.

కాలిఫోర్నియాలోని మరో పెద్ద సంస్థ, లాస్ ఏంజెలిస్‌లో ఉన్న గెట్టీ మ్యూజియం చుట్టూ ఉన్న ఆకులు, మొక్కలను కూడా ఈ వారంలో మా మేకల మంద తినేసి, శుభ్రం చేసిందని ఆయన అన్నారు.

మంటల నుంచి మేకలను కాపాడుతున్న కాపరులు, వలంటీర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంటల నుంచి మేకలను కాపాడుతున్న వలంటీర్లు

దావానలంలో చిక్కుకున్న జంతువుల పరిస్థితి ఏంటి?

పశువుల కాపరులు, కొంతమంది వాలంటీర్లు పశువులను ట్రాలీల్లో, వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీలైనన్ని సార్లు తిరుగుతూ ఎక్కువ జంతువులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంటల కారణంగా హడలిపోయిన గుర్రాన్ని వాహనంలోకి ఎక్కిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంటల కారణంగా హడలిపోయిన గుర్రాన్ని వాహనంలోకి ఎక్కిస్తున్నారు.

ఒక్కోసారి మంటలు చాలా వేగంగా వ్యాపిస్తుంటాయి. అలాంటప్పుడు జంతువులను రక్షించడం వీరికి చాలా ఇబ్బందే. దీంతో, వాటంతట అవే తప్పించుకునేందుకు వీలైనంత సాయం చేస్తుంటారు.

మంటల్లో చిక్కుకున్న గుర్రాన్ని బయటకు తీసుకువస్తున్న వలంటీర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఇళ్ల యజమానులతో పాటు వారి పెంపుడు జంతువులు కూడా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. మరికొన్ని జంతువులు చనిపోయాయి, కొన్ని కనిపించకుండా పోయాయి.

ఇళ్లనుంచి పెంపుడు జంతువులతో సహా తరలివెళ్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇళ్లనుంచి పెంపుడు జంతువులతో సహా తరలివెళ్తున్న ప్రజలు

ఈ మంటల కారణంగా తప్పిపోయిన జంతువుల ఫొటోలను వాటి యజమానులు ఫేస్‌బుక్ గ్రూపు 'ది పెట్ రెస్క్యూ అండ్ రీయూనిఫికేషన్'లో పోస్ట్ చేస్తున్నారు. ఈ గ్రూపు తప్పిపోయిన పెంపుడు జంతువులను తిరిగి వాటి యజమానుల దగ్గరకు చేర్చేందుకు పనిచేస్తుంది.

కింకేడ్ ఫైర్ నుంచి తప్పించుకుని ఓ పార్కింగ్ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటున్న బడ్‌వీజర్ కుక్క, దాని యజమాని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింకేడ్ ఫైర్ నుంచి తప్పించుకుని ఓ పార్కింగ్ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటున్న బడ్‌వీజర్ కుక్క, దాని యజమాని

కాలిఫోర్నియాలో ప్రస్తుతం పదికి పైగా దావానలాలు క్రియాశీలంగా ఉన్నాయి. వాటిలో ఉత్తర దిశగా వ్యాపిస్తున్న కింకేడ్ ఫైర్ అతి పెద్దది. దీని కారణంగా ఇప్పటికే 76000 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి.

కింకేడ్ ఫైర్ నుంచి వస్తున్న పొగ ముందు నిలబడిన జంతువులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింకేడ్ ఫైర్ నుంచి వస్తున్న పొగ ముందు నిలబడిన జంతువులు

రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)