'ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్-బగ్దాదీ లక్ష్యంగా అమెరికా సీక్రెట్ ఆపరేషన్' - యూఎస్ మీడియా

ఫొటో సోర్స్, AFP
ఇస్లామిక్ స్టేట్ - ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్-బగ్దాదీ లక్ష్యంగా అమెరికా సైన్యం ఆపరేషన్ చేపట్టిందని ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే, అమెరికా ఇప్పటివరకు దీన్ని ధ్రువీకరించలేదు.
ఐఎస్ చీఫ్ లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టారని, అయితే, బగ్దాదీ మరణించిన విషయాన్ని ఇప్పుడే ధ్రువీకరించలేమని అమెరికాకు చెందిన అధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అధ్యక్షుడు ట్రంప్ "చాలా పెద్ద సంఘటన ఒకటి ఇప్పుడే జరిగింది" అని తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10.30కు ట్రంప్ ఈ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సిరియా ప్రాంతంలోని ఇడ్లిబ్‌లో అబూ బకర్ అల్-బగ్దాదీ టార్గెట్‌గా ఒక ఆపరేషన్ చేపట్టడానికి ట్రంప్ అమెరికా సైన్యానికి అనుమతి ఇచ్చారని, అమెరికా సైనిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం "ఐఎస్ చీఫ్ బగ్దాదీ మరణించారు" అని న్యూస్ వీక్ మ్యాగజైన్ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
'ద అసోసియేటెడ్ ప్రెస్' కూడా ఇలాంటి వార్తే ప్రచురించింది. అమెరికా చేపట్టిన సైనిక దాడిలో ఐఎస్ చీఫ్ చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు ఆ దేశ అధికారి తమకు చెప్పినట్లు కథనం ప్రచురించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయితే, అబూ బకర్ అల్-బగ్దాదీపై ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. గతంలో కూడా బగ్దాదీ చనిపోయాడని చాలాసార్లు వార్తలు వచ్చాయి.
'అమెరికా సైన్యం బగ్దాదీకి వ్యతిరేకంగా ఒక విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించింది' అని సీఎన్ఎన్ చెప్పింది. అమెరికా నిఘా ఏజెన్సీ సీఐఏ బగ్దాదీ ఎక్కడ ఉన్నడో ఆ లొకేషన్‌ను కూడా గుర్తించిందని చెబుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

ఫొటో సోర్స్, Getty Images
ఆదివారం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు అధ్యక్షుడు ట్రంప్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయనున్నారు.
వైట్ హౌస్ డిప్యూటీ మీడియా సెక్రటరీ హోగన్ గైడ్లీ సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ "ఈ ప్రకటన విదేశాంగ విధానానికి సంబంధించినది" అని చెప్పారు. కానీ, దీనిపై అమెరికా సైన్యం వైపు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
అబూ బకర్ అల్-బగ్దాదీ ఎవరు?
ఐసిస్ నాయకుడు అబూ బకర్ అల్-బగ్దాదీని ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్‌గా వర్ణిస్తారు.
2011 అక్టోబర్‌లో అమెరికా ఆయన్ను అధికారికంగా ఉగ్రవాదిగా గుర్తించింది. ఆయన్ను పట్టుకోడానికి లేదా చంపడానికి తగిన సమాచారం ఇచ్చేవారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది.
బగ్దాదీని యుద్ధభూమిలో అత్యంత వ్యవస్థీకృతంగా క్రూరంగా వ్యవహరించే వ్యూహకర్తగా భావిస్తారు.
బగ్దాదీ 1971లో ఉత్తర బగ్దాద్‌లోని సమర్రాలో జన్మించారు. ఆయన అసలు పేరు ఇబ్రహీం అవద్ అల్-బద్రి
అమెరికా నేతృత్వంలో ఇరాక్‌పై దాడి జరిగినపుడు ఆయన ఒక మసీదులో మత పెద్దగా ఉండేవారని కొన్ని నివేదికలు చెప్పాయి.
కొంతమంది మాత్రం సద్దాం హుస్సేన్ పాలనా కాలంలోనే బగ్దాదీ ఒక మిలిటెంట్ జీహాదీగా ఉన్నారని భావిస్తున్నారు. దక్షిణ ఇరాక్‌లో అల్ ఖైదా కమాండర్లను బంధించిన బుక్కా క్యాంపులో బగ్దాదీని కూడా నాలుగేళ్లు నిర్బంధించినపుడు మిలిటెన్సీ వైపు మళ్లారని చెబుతారు.
2010లో బగ్దాదీ ఇరాక్‌లో ఐఎస్‌లో కలిసిపోయిన గ్రూపుల్లో ఒకటైన అల్ ఖైదాకు నాయకుడుగా ఆవిర్భవించారు. సిరియాలో అల్-నుస్రా ఫ్రంట్‌తో విలీనం కావడానికి ప్రయత్నించినపుడు ఆయన కీలకంగా మారారు.
అబూ బకర్ అల్ బగ్దాదీని ఇస్లామిక్ స్టేట్ చీఫ్‌గా చెబుతారు. గత ఐదేళ్లుగా ఆయన అండర్ గ్రౌండ్‌లో ఉన్నారు.
ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ మీడియా వింగ్ అల్-ఫుర్క్వాన్ తరఫున ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బగ్దాదీ బతికే ఉన్నట్టు చెప్పారు.
2014 జులైలో మోసూల్‌లోని పవిత్ర మసీదు నుంచి ప్రసంగించినపుడు బగ్దాదీ మొదటిసారి బయట కనిపించారు.
2017 మేలో జరిగిన వైమానిక దాడుల్లో బగ్దాదీ గాయపడ్డారని 2018 ఫిబ్రవరిలో అమెరికా అధికారులు చెప్పారు.
బగ్దాదీ 2010లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐఎస్ఐ) నాయకుడు అయ్యారు.
ఇవి కూడా చదవండి
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- ఏరియా 51: 'గ్రహాంతరవాసులను' చూడ్డానికి ఎంతమంది వచ్చారు? వచ్చినవారికి ఏమైంది?
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)