ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా

ఇస్లామిక్ స్టేట్ అంతమైపోయిందా? సిరియా, ఇరాక్‌లలో ఐఎస్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? బీబీసీ అరబిక్ ప్రతినిధి ఫెరాస్ కిలాని తన అనుభవాలతో అందిస్తున్న కథనం.

ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా సిరియా, ఇరాక్‌లలో యుద్ధాలను నాలుగైదేళ్లుగా కవర్ చేస్తున్నా. ఇప్పుడు జరుగుతున్నది చాలా ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే... ఈ ముస్లిం రాజ్య చరిత్రలో ఐసిస్‌కు సంబంధించిన చివరి అధ్యాయమిది. 2014లో అబూ బకర్ అల్-బగ్దాదీ దీన్ని ముస్లిం రాజ్యంగా ప్రకటించారు.
డైర్ అల్-జోర్ దగ్గర జరుగుతున్న ఈ యుద్ధం ముగిసేనాటికి... వాళ్లు తమ అధీనంలోని చివరి ప్రాంతంపై కూడా పట్టుకోల్పోతారు.

కానీ, ఇది ఇస్లామిక్ స్టేట్ సంస్థ అంతం కాదు. ఇప్పటికీ సిరియా, ఇరాక్‌లలో ఆ గ్రూపు చాలా బలంగా ఉంది. వారికి అనేక ప్రాంతాల్లో వేలమంది సాయుధులున్నారు. గతంలో మాదిరి నగరాలు, పట్టణాలు వారి నియంత్రణలో లేకపోవచ్చు... కానీ వారు ఏ క్షణంలోనైనా దాడులకు తెగబడొచ్చు.
నేను చివరిసారిగా రఖా వెళ్లినప్పుడు... నగరం మొత్తం.. ఐఎస్ గ్రూపునకు చెందిన స్లీపర్ సెల్స్‌తో ఉండటం చూశా. నగరం నుంచి ఐసిస్ వెళ్లిపోయి 15 నెలలైనా... ఇప్పటికీ స్లీపర్ సెల్స్ మాత్రం వెళ్లలేదు.
రఖా నుంచి డైర్ అల్-జోర్ లేదా ఇరాక్ సరిహద్దులకు వెళ్లి చూస్తే.. 300 కి.మీ. పైగా ప్రాంతం ఇప్పటికీ అలాగే ఉంది.

ఇరాక్‌పై అమెరికా దాడి తర్వాత 2003లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రారంభమైంది.
తాము అన్నింటినీ కోల్పోయామని, షియాల ఆధిపత్యం పెరిగిపోతోందని అప్పట్లో ఇరాక్‌లోని సున్నీ ముస్లిం వర్గం భావించడమే దీని ఏర్పాటు వెనక కారణం.
ఈ నాలుగైదేళ్ల నా అనుభవంతో చెప్పేదేంటంటే... చరిత్ర మళ్లీ పునరావృతమవుతోంది.
ఐసిస్ నుంచి విముక్తి పొందిన ఏ ప్రాంతాన్ని చూసినా... అక్కడి ప్రజలతో మాట్లాడినా, వారు చెప్పేది ఒక్కటే... ఐఎస్‌తో యుద్ధంలో గెలిచింది ఇరాకీలో, సిరియా ప్రజలో కాదు... ఇరాక్‌లోని షియా మిలీషియా సభ్యులు, సిరియాలోని అసద్ వర్గీయులు. ఐఎస్ఐఎస్ కావచ్చు, అల్ ఖైదా కావచ్చు... ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టడం, పట్టుసాధించడం... భవిష్యత్తులో కూడా వారికి చాలా సులభం.
"ఐఎస్ఐఎస్ తిరిగి రావడం తథ్యం, కాకపోతే కొద్దిగా సమయం పట్టొచ్చేమో. ఐఎస్ సాయుధులు వెళ్లేముందు ఏం చెప్పారో తెలుసా... "ఎక్కువగా పొంగిపోకండి, మేం త్వరలోనే తిరిగొస్తాం" అని".. అని మోసూల్ నగరంలోని ఓ కుటుంబంతో నేను మాట్లాడినప్పుడు వారు చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- ఐఎస్ మద్దతుదారు అంజిమ్ చౌదరి వల్ల ప్రపంచానికి ప్రమాదమా?
- ఐఎస్ కిల్లర్: నేను 100 మందికి పైగా చంపాను!
- ‘ఈ పని చేయడం నాకిష్టం లేదు... కానీ, మరో దారి లేదు’
- ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి
- ఐఎస్‌కు అంతం పలికాం.. సిరియా సేనల ప్రకటన
- ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఏ దేశంలో విస్తరిస్తోంది?
- ఇస్లామిక్ స్టేట్ కనుమరుగైపోయిందా? ట్రంప్ మాట నిజమేనా?
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









