‘ఈ పని చేయడం నాకిష్టం లేదు... కానీ, మరో దారి లేదు’

అది ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీనగర్ ప్రాంతం. అక్కడు ఉన్న ఓ చిన్న బార్బర్ షాపులో.. పురుషుల తలలపై కత్తెర ఆడుతోంది. ప్యాంటు, షర్టులోని ఓ వ్యక్తి కటింగ్‌లు, షేవింగ్‌లు చకచకా చేస్తున్నారు. అయితే, ఆ దుస్తుల్లో ఆ బట్టల్లో ఉన్నది పురుషుడు కాదు.. ఓ యువతి!
ఈమె పేరు నేహా శర్మ. 2013లో నాన్నకు పక్షవాతం వచ్చింది. దాంతో, ఆ కుటుంబ భారం నేహా శర్మ భుజాలపై పడింది. కానీ ఆమె బాధతో, బరువుతో కుంగిపోలేదు.
'ఈ పని చేయడం నాకిష్టం లేదు.. కానీ వేరే గత్యంతరం లేదు'
తన పొడువాటి జుట్టు కత్తిరించుకుంది. ప్యాంటు, షర్టు వేసుకుంది. పూర్తిగా అబ్బాయిలా మారిపోయి, కుటుంబానికి ఆసరాగా మారింది. కానీ ఈ పని చేయటం తనకిష్టం లేదని, అయినా తనకు వేరే మార్గం లేదని నేహా అన్నారు.
‘‘మొదటి రోజు నుంచీ ఇలానే ప్యాంటు, షర్టు వేసుకోవడం మొదలుపెట్టాను. నా జుట్టును కూడా కత్తిరించుకున్నా. నేను ఆడపిల్లనే కానీ, ఇప్పుడు అబ్బాయిలా బతకాలని అనుకుంటున్నాను. సమాజం ఎన్నో మాటలు అంటుంది. కానీ అవన్నీ పట్టింకోకుండా, నా పని నేను చేసుకుపోతాను’’ అని నేహా చెబుతున్నారు.
నేహా చెప్పిన మరిన్ని విషయాలను పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- సిత్రాలు సూడరో: ఐదేళ్లలో నాలుగు కండువాలు మార్చేశారు
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- 'విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం' అన్న మోదీ మాటల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









