చిన్నారికి పాలు పడుతూ, జో కొడుతూ పార్లమెంటును నడిపించిన స్పీకర్

ఫొటో సోర్స్, New Zealand Parliament
ఆయన పార్లమెంటు స్పీకర్. సభలో చర్చ జరుగుతోంది. సభాపతిగా స్పీకర్ ఆ చర్చను నిర్వహిస్తున్నారు. అయితే.. ఆయన ఒడిలో ఒక చిన్నారి ఉంది. ఆ చిన్నారికి పాలుపడుతూ జోకొడుతూ ఉన్నాడా స్పీకర్.
ఈ అరుదైన దృశ్యం న్యూజిలాండ్ పార్లమెంటులో కనిపించింది.
స్పీకర్ స్థానంలో కూర్చుని ఒక శిశువును ఒడిలో పెట్టుకుని జోకొడుతూ సభను నిర్వహిస్తున్న ఫొటోను స్పీకర్ ట్రెవర్ మలార్డ్ స్వయంగా ట్వీట్ చేశారు.
లేబర్ పార్టీ ఎంపీ తామాతి కోఫీ కుమారుడు. ఆ శిశువు సరొగేట్ తల్లి ద్వారా జన్మించినట్లు కోఫీ జూలైలో ప్రకటించారు. కోఫీ భాగస్వామి టిమ్ స్మిత్ ఆ శిశువుకు బయోలాజికల్ తండ్రి.
పితృత్వ సెలవు ముగిసిన తర్వాత బుధవారం తొలిసారి పార్లమెంటుకు వచ్చిన కోఫీ.. తన వెంట తన కుమారుడిని కూడా తీసుకు వచ్చారు. పార్లమెంటులో జరుగుతున్న చర్చలో పాల్గొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చర్చ జరుగుతున్నపుడు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మలార్డ్.. ఆ శిశువుకు బేబీసిటర్ పాత్ర కూడా పోషించారు. ఆయన స్వయంగా ముగ్గురు పిల్లల తండ్రి.
‘‘ఈ రోజు నాతో పాటు ఒక వీఐపీ కూడా స్పీకర్ స్థానంలో ఆశీనులయ్యారు’’ అని మలార్డ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంపీ కోఫీ, ఆయన భాగస్వామి టిమ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
కోఫీ తన కుమారుడిని పార్లమెంటులో ఎత్తుకుని ఉన్న ఫొటోను గ్రీన్ పార్టీ ఎంపీ గారెత్ హగ్స్ ట్విటర్‌లో షేర్ చేశారు.
''సభకు ఒక చిన్నారి రావటం చాలా బాగుంది. ఈ చిన్నారి ఎంత అద్భుతంగా ఉందో'' అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''సభలో నా సహ ఎంపీలందరూ నిజంగా నాకు మద్దతు ఇచ్చినట్లు అనిపించింది'' అని కోఫీ న్యూస్‌హబ్‌తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తంచేశారు.
పార్లమెంటు సభ్యులు తమ చిన్నారులను సభకు తీసుకురావటం ఇటీవల పలు దేశాల్లో జరుగుతోంది.
లిబరల్ డెమొక్రటిక్ నాయకురాలు జో స్విన్సన్ 2018లో తన శిశువుతో కలిసి పార్లమెంటు చర్చకు హాజరయ్యారు. ఆస్ట్రేలియా సెనెటర్ లారిసా వాటర్స్ 2017లో పార్లమెంటులో చర్చకు హాజరైనపుడు తన శిశువుకు చనుబాలు ఇచ్చారు. ఇటువంటి మరికొన్ని ఉదంతాలు పతాక శీర్షకల్లో వార్తలయ్యాయి.
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్ గత ఏడాది సెప్టెంబర్‌లో.. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి ప్రసంగించేటపుడు తన చిన్నారి శిశువును కూడా తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి
- హైదరాబాద్లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయా... పాలిచ్చే తల్లి మద్యం తాగవచ్చా?
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- కెనడా: ఆ మహిళలు ఇతరుల కోసం తల్లులవుతున్నారు... అదీ ఉచితంగా
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








