కెనడా: ఆ మహిళలు ఇతరుల కోసం తల్లులవుతున్నారు... అదీ ఉచితంగా

ఫొటో సోర్స్, JENNIFER JACQUOT
మారిసా మజిల్ ఓ పాపకు జన్మనివ్వడానికి 16 గంటల పాటు ప్రసవ వేదన అనుభవించారు.
గర్భవతిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో రెండుసార్లు ఆస్పత్రి పాలయ్యారు. నెలల తరబడి హార్మోన్ల ఇంజెక్షన్లు చేయించుకున్నారు. అంతకుముందు ఆమెకు నాలుగు సార్లు గర్భ స్రావం జరిగింది. అయినా కూడా ఆమె మరోసారి ప్రయత్నించి ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
కానీ, ఆమె ఇదంతా తన కోసం చేయలేదు. సరోగసీ పద్ధతి ద్వారా వేరెవరి బిడ్డనో తన గర్భంలో మోశారు. నిజానికి ఇలా సరోగసీ ద్వారా పిల్లల్ని కని ఇచ్చేందుకు కొందరు లక్షల రూపాయలు తీసుకుంటారు. కానీ మారిసా ఈ పని కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నిజానికి కెనడాలో డబ్బు తీసుకొని ఇతరుల బిడ్డల్ని కడుపులో మోయడం నేరం.
ఒకవేళ అది నేరం కాకపోయినా తాను డబ్బు తీసుకొని ఉండేదాన్ని కాదని, కేవలం తన సంతృప్తి కోసమే బిడ్డలు కనలేని వాళ్ల కోసం తాను తల్లిగా మారుతున్నానని మారిసా చెబుతారు.
మారిసాలానే ఎలాంటి డబ్బూ తీసుకోకుండా ‘సరోగేట్ మదర్స్’గా మారి ఇతరుల కోసం పిల్లల్ని కనిచ్చే వందలాది తల్లులు కెనడాలో ఉన్నారు
మారిసా కెనడాకు చెందిన ఓ జంట కోసం మలెనా అనే బిడ్డను కన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సరోగసికి డిమాండ్ పెరగడంతో చాలామందికి కెనడా అందుకు సరైన కేంద్రంగా మారింది.
ఆధునిక భావజాలం కలిగిన ఈ దేశంలో గత పదేళ్లలో సరోగసీ 400శాతం మేర పెరిగిందని అంచనా.
కానీ, ఇక్కడ సరోగసీ అనేది కేవలం పరోపకారం కోసం చేసే పని. దీనికి ఎలాంటి డబ్బూ తీసుకోరు. అలా తీసుకోవడం చట్ట వ్యతిరేకం కూడా.

ప్రపంచ వ్యాప్తంగా సరోగసి
- భారత్, థాయిలాండ్, నేపాల్, మెక్సికో దేశాలు వ్యాపారాపేక్షతో జరిగే విదేశీ సరోగసీని నిషేధించాయి.
- ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు అన్ని రకాల సరోగసీని నిషేధించాయి.
- యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, బెల్జియం లాంటి దేశాల్లో కేవలం లాభాపేక్ష కోసం మహిళలు సరొగేట్ తల్లులుగా మారడాన్ని అనుమతించరు.
- జార్జియా, రష్యా, యుక్రెయిన్‌తో పాటు కొన్ని అమెరికా రాష్ట్రాల్లో సరోగసీని వ్యాపారంగా కూడా అనుమతిస్తారు.


'మేం బిడ్డల్ని కనే యంత్రాలం కాదు'
‘నేను కేవలం వారి కోసం ఓ బిడ్డను మాత్రమే కనట్లేదు, ఒక వారసత్వాన్ని సృష్టిస్తున్నా. 'పుట్టగానే బిడ్డను ఎలా ఇచ్చేస్తావు?' అని నన్ను చాలామంది అడుగుతారు. కానీ, నేను ఇచ్చేస్తుంది నా బిడ్డను కాదు. కడుపులో పిండం ఏర్పడిన క్షణం నుంచి ఆ బిడ్డ వారికే చెందుతుంది. నేను కేవలం ఆ బిడ్డకు సంరక్షకురాలిగా ఉన్నా.
తమ గర్భాన్ని అద్దెక్కిచ్చే చాలామంది అమెరికా మహిళల్ని చూశాను. సరోగసి ద్వారా ఇతరుల బిడ్డల్ని కడుపులో మోసినందుకు వాళ్లు రూ. 50 - 80 లక్షలు తీసుకుంటారు. కానీ, కెనడాలో మేము అలా చేయం. మేము బిడ్డల్ని కనే యంత్రాలం కాదు. మా గర్భాన్ని ఇక్కడ అద్దెకివ్వం.
ఈ పని నేనేదో ఉద్యోగంలాగా సంపాదన కోసం చేయట్లేదు. అందుకే, ఇది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. నా ఆత్మ సంతృప్తి కోసమే ఈ పనిచేస్తున్నా’ అంటారు మారిసా.
కెనడాలో మరెందరో సరోగేట్ తల్లులది ఇదే అభిప్రాయం.
‘పిల్లలు లేకుండా జీవించడం చాలా కష్టం’ అంటారు ఐదుగురు పిల్లలకు తల్లయిన జేనట్. కానీ, ఇతరుల కోసం పిల్లల్ని కనడం తనకెంతో సంతోషాన్నిస్తుందని ఆమె చెబుతారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









