నీరవ్ మోదీ: లండన్‌లో అరెస్ట్

నీరవ్ మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీని లండన్‌లో అరెస్ట్ చేశారు.

భారత అధికారుల తరఫున నీరవ్ మోదీని అరెస్ట్ చేసినట్లు లండన్ పోలీసులు తెలిపారు.

నీరవ్‌ మోదీని హొల్‌బొర్న్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను రేపు వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుపరుస్తారు.

నీరవ్ మోదీని అప్పగించాలని గతంలో భారత ప్రభుత్వం బ్రిటన్‌ని కోరింది.

మరోవైపు నీరవ్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా దాన్ని కోర్టు తిరస్కరించింది.

ఈ నెల 29 వరకు పోలీసు కస్టడీ విధించింది.

వీడియో క్యాప్షన్, పంజాబ్ నేషనల్ బ్యాంకు: కుంభకోణం అసలెలా జరిగింది!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)