బ్రెగ్జిట్ వివాదం: వీగిన అవిశ్వాసం.. నెగ్గిన థెరెసా

బ్రెగ్జిట్‌ను ముందుకు తీసుకు వెళ్ళడానికి ఎంపీలందరూ "వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి అందరూ నిర్మాణాత్మకంగా కలసి పని చేయాలి" అని బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే పిలుపునిచ్చారు.
అంతకు ముందు థెరెసా తన మీద ప్రతిపక్షం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వోటింగులో 325 - 306 వోట్ల తేడాతో విజయం సాధించారు. తిరుగుబాటు చేసిన టోరీ వర్గం ఎంపీలు, డీయూపీ మద్దతు పలకడంతో ఆమెకు ఈ ఈ గెలుపు సాధ్యమైంది.
అయితే, ఈ రెండు వర్గాలు అంతకు ముందు బ్రెగ్జిట్ ఒప్పందం వోటింగును వీగిపోయేలా చేశాయి.
బుధవారం రాత్రి ప్రధాని ఎస్.ఎన్.పి, లిబరల్ డెమాక్రాట్స్, ప్లయిడ్ కమ్రి నేతలను కలుసుకున్నారు. లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్‌ను మాత్రం ఆమె కలవలేదు.
"లేబర్ పార్టీ నాయకుడు ఇప్పటివరకూ మాతో కలసి రానందుకు నేను చాలా అసంతృప్తిని కలిగించింది. కానీ, ఆయన కోసం మా తలుపులు మాత్రం ఆయన కోసం తెరుచుకునే ఉంటాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే, కోర్బిన్ మాత్రం "సానుకూల చర్చలు" ఏమైనా జరగాలని భావిస్తే, ముందుగా "ఒప్పందం లేని బ్రెగ్జిట్" ఉండదని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
తగిన విధి విధానాలతో కూడిన ప్రక్రియ ద్వారా మాత్రమే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగుతుందని థెరెసా మే స్పష్టమైన ప్రకటన చేయకపోతే కోర్బిన్ ఈ విషయంలో చర్చలకు ఆమడ దూరంలో ఉంటారని బీబీసీ పొలిటికల్ ఎడిటర్ లారా కుయెన్స్‌బర్గ్ అన్నారు.
అయితే, అది లేబర్ పార్టీ సమష్టి అభిప్రాయం కాదని కూడా ఆమె వివరించారు. ఆ పార్టీలో అత్యధిక సభ్యులు బ్రెగ్జిట్ జరగాలని కోరుకోవడం లేదు. అంటే, దానికి సంబంధించిన ఎలాంటి చర్చల్లోనైనా కోర్బిన్ పాల్గొంటే ఆయన మీద విమర్శలు వెల్లువెత్తడం ఖాయం.
బ్రెగ్టిట్ మీద థెరెసా చేసిన ప్రతిపాదనను ఎంపీలు మంగళవారం నాడు భారీ మెజారిటీతో తిరస్కరించారు. 230 వోట్ల తేడాతో ఆమెకు పార్లమెంటులో బ్రిటన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ ఓటమి ఎదురైంది.
ఇవి కూడా చదవండి:








