హువావే స్మార్ట్ ఫోన్: జాతీయ భద్రత భయంతో చైనా టెలికం సంస్థపై ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ‘నిషేధం’

ఫొటో సోర్స్, Getty Images
చైనాకు చెందిన హువావే టెలీకం పరికరాలు వాడకంపై నిషేధం విధించాలని ప్రతిపాదించిన దేశాల్లో తాజాగా న్యూజీలాండ్ కూడా చేరింది. వీటిని ఉపయోగించడం వల్ల జాతీయ భద్రతకే ముప్పు ముంచుకొస్తుందని ఆ దేశం ఆందోళన చెందుతోంది.
టెలీ కమ్యూనికేషన్ సంస్థ స్పార్క్ న్యూజీలాండ్ తమ 5జీ మొబైల్ నెట్‌వర్క్ కోసం హువావే పరికరాలు ఉపయోగించాలని భావించింది.
అయితే, ఈ ఒప్పందం వల్ల జాతీయ భద్రతకు అపారమైన నష్టం కలగవచ్చని న్యూజీలాండ్ ప్రభుత్వ భద్రతా ఏజెన్సీ తెలిపింది.
భద్రతకు సంబంధించిన అంశాల్లో చైనా టెక్నాలజీ సంస్థల ప్రమేయానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా న్యూజీలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడే ఎందుకు, ఏమైంది?
ప్రపంచంలోని చాలా దేశాల్లో 5జీ నెట్‌వర్క్ జోరందుకుంటోంది. ఇది తర్వాత తరం మొబైల్ సేవల్లో కీలకమైన మార్పు కాబోతోంది.
టెలికాం పరికరాల ఉత్పత్తిలో హువావే ప్రపంచంలో అతిపెద్ద సంస్థ. దీని సాంకేతికతను చైనా గూఢచర్యానికి ఉపయోగించవచ్చనే భయంతో వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది.
స్పార్క్ న్యూజీలాండ్ టెలికాం సంస్థ తమ 5జీ నెట్‌వర్క్ కోసం హువావే పరికరాలను ఉపయోగించాలని భావించింది.
కానీ "స్పార్క్ ఒప్పందం అమల్లోకి వస్తే దానివల్ల ఎన్నో జాతీయ భద్రతా సమస్యలు తలెత్తుతాయి" అని న్యూజీలాండ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ బ్యూరో (జీసీఎస్‌బి) అధ్యక్షుడు చెప్పినట్టు సంస్థ తెలిపింది.
"అలాంటి సమస్యలను తగ్గించడానికి స్పార్క్ ఏజెన్సీ సంస్థతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని" నిఘా సేవల మంత్రి ఆండ్రూ లిటిల్ స్పార్క్ అన్నారు.
"జీసీఎస్‌బీ చెబుతున్నట్టు, ఏవైనా ఆందోళనకరమైన అంశాలు ఎదురైతే మేం చురుకుగా గుర్తించగలం. దానికి పరిష్కారం గుర్తించడానికి సంస్థతో కలిసి పనిచేస్తాం అని హువావే కూడా తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మిగతా దేశాలు ఏమంటున్నాయి?
న్యూజీలాండ్‌కు ముందు, ఆస్ట్రేలియా కూడా ఇదే పని చేసింది. దేశంలోని వైర్‌లెస్ నెట్‌వర్క్ కోసం 5జీ టెక్నాలజీ అందించడానికి హువావే, జడ్‌టిఈ పరికరాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకించింది.
అమెరికా, బ్రిటన్ కూడా హువావే పరికరాలు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. జర్మనీ, జపాన్, కొరియా ఈ సంస్థ పరికరాలను పరిశీలిస్తున్నాయి.
హువావే పరికరాలు ఉపయోగించకుండా అమెరికా తమ దేశంలోని వైర్‌లెస్ ప్రొవైడర్లను ఒప్పించిందని వారం క్రితం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.
ఇటు బ్రిటన్‌లో "హువావే టెలికాం పరికరాల వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదనడానికి పరిమితమైన హామీని మాత్రమే ఇవ్వగలమని జులైలో వచ్చిన సెక్యూరిటీ కమిటీ నివేదిక హెచ్చరించింది.
పపువా న్యూ గినీ మాత్రం హువావేను వెనకేసుకొస్తోంది. "ఇంటర్నెట్ మౌలికసదుపాయాల నిర్మాణం కోసం హువావేతో చేసుకున్న ఒప్పందంపై ముందుకెళ్తామని" ఆ దేశం ఇటీవలే ప్రకటించింది.
గత దశాబ్దంగా చైనా నుంచి ఈ దేశంలోకి పెట్టుబడులు రావడం చాలా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
టెలీకాం పరికరాలపై భయం ఎందుకు?
ఈ పరికరాలు ఉపయోగించడం వల్ల చైనా నుంచి గూఢచర్యం ముప్పు ఎదురవుతుందని, కంపెనీలు-దేశాలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు బయటపడాతాయని వివిధ దేశాలు ఆందోళన చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
"సమాచారం దొంగిలించాలనే చైనా ప్రభుత్వం ఉద్దేశం ఎన్నో ఏళ్ల నుంచీ స్పష్టమవుతోంది" అని ఆస్ట్రేలియాలోని ఇంటర్నేషనల్ సైబర్ పాలసీ సెంటర్ సభ్యుడు టామ్ ఉరెన్ అన్నారు.
సైబర్ సమాచారం, గూఢచర్యం, మేధోసంపత్తిని దొంగిలించే పనిలో చైనా మునిగిపోయి ఉందని ఆయన అన్నారు.
దేశంలోని కంపెనీల ద్వారా గూఢచర్య ఆపరేషన్లు చేసేందుకు చైనా ప్రయత్నించవచ్చని ఆయా దేశాల్లో సంస్థలు, ప్రభుత్వాల్లోని వారు ఆందోళన చెందుతున్నట్లు ఉరెన్ తెలిపారు.
చైనా సంస్థలు తమ దేశానికి చెందిన నిఘా సంస్థ ప్రయత్నాలకు సహకరిస్తాయనే ఆందోళనలను గత సంవత్సరం ప్రవేశ పెట్టిన కొత్త చట్టాలు తీవ్రతరం చేశాయి.
దేశంలోని ప్రజలు, సంస్థలు అవసరమైతే తమకు సాయం చేసేలా చైనా చట్టాలు వారిని బలవంతం చేయచ్చని యురెన్ తెలిపారు.
అవి పెద్ద ముప్పును తీసుకురాలేవని కచ్చితంగా చెప్పడం కష్టమే అంటారు యురెన్.
ఇవి కూడా చదవండి:
- ఎనిమిదేళ్ల తర్వాత చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢమాల్!
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- ఫోన్ స్కామ్: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు
- అదిగదిగో 5జీ: ఈ 5జీ వస్తే ఎలా ఉంటుంది?
- ట్రంప్ ఫోన్ ట్యాప్ అవుతోందా? ‘మీరు ఐఫోన్‌ను వదిలేసి హువాయి వాడండి’ : చైనా
- మిథాలీరాజ్‌ను ఆడించకపోవడం వల్లే భారత జట్టు ఓడిందా?
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- శ్రీలంకలో శవాల దిబ్బ: మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు... అవి ఎవరివి? హంతకులెవరు?
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- టీచర్లకు ఏ దేశంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










