అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు వచ్చిన పేరు ఆయన భార్యకు ఎందుకు రాలేదు?

ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చాలామందికి తెలుసు. కానీ, ఆయన భార్య మిలెవా ఐన్‌స్టీన్ గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలీదు. వాళ్లిద్దరూ కలిసి అనేక పరిశోధనలు చేశారు. కానీ, ఆమెకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదు.
ఐన్‌స్టీన్, మిలెవా... ఇద్దరూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఆమెకు ఓసారి ఐన్‌స్టీన్ కంటే ఎక్కువమార్కులొచ్చాయి. ఐన్‌స్టీన్‌కు ఒక్క మార్కు వస్తే ఆమెకు ఐదు మార్కులొచ్చాయి.
చదువుకునే రోజుల నుంచే వాళ్లిద్దరూ కలిసి పరిశోధనలు చేయడం ప్రారంభించారు. కానీ, ఆయన పరిశోధనల్లో మిలెవా ప్రస్తావన ఎక్కువగా రాలేదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం వల్లే అలా జరిగిందని చాలామంది భావిస్తారు. 'మనం కలిసుండుంటే రిలేటివ్ మోషన్‌పైన మన పరిశోధనలు విజయవంతమై ఉండేవి’ అని మిలెవాకు రాసిన ఓ లేఖలో ఐన్‌స్టీన్ పేర్కొన్నారు.
ఎప్పటికైనా ఐన్‌స్టీన్ నోబెల్ పురస్కారం గెలిస్తే, కొంత డబ్బు ఆమెకూ దక్కాలని విడాకుల సమయంలో వాళ్లు ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఐన్‌స్టీన్ తన డబ్బంతా కొడుకులకే చెందాలని వీలునామా రాశారు.
అప్పుడే ఆయన పరిశోధనల్లో తన భాగస్వామ్యం గురించి బయటపెడతానని మిలెవా హెచ్చరించినట్లు చెబుతారు.
కానీ, ఏ వ్యక్తికైనా ప్రాధాన్యం లేనప్పుడు, వాళ్లు హుందాగా, మౌనంగా ఉండడమే మేలని ఐన్‌స్టీన్ సలహా ఇవ్వడంతో ఆమె నోరు విప్పలేదు. అలా చేసిన పనికి తగిన గుర్తింపు దక్కకుండానే మిలెవా ఐన్‌స్టీన్ చరిత్రలో కలిసిపోయారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








