వైరల్: మాజీ అధ్యక్షులతో కలసి 'తాగుతున్న' డోనల్డ్ ట్రంప్

ట్రంప్ చిత్రపటం

ఫొటో సోర్స్, ANDY THOMAS ARTIST

ఫొటో క్యాప్షన్, ది రిపబ్లికన్ క్లబ్ పేరుతో ఆండీ థామస్ అనే చిత్రకారుడు దీన్ని గీశారు.
    • రచయిత, క్రిష్ బెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో గోడకు వేలాడుతున్న ఓ చిత్రపటం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఆ చిత్రంలో అబ్రహాం లింకన్, రోనల్డ్ రీగన్, రిచర్డ్ నిక్సన్ సహా రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షులతో కలిసి ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 'మద్యం సేవిస్తున్నట్లుగా' ఉంది.

'ది రిపబ్లికన్ క్లబ్' పేరుతో అమెరికాలోని మిస్సోరీకి చెందిన ఆండీ థామస్ అనే కళాకారుడు ఈ చిత్రాన్ని గీశారు. తాను వేసిన చిత్రం వైట్ హౌజ్‌లో ప్రదర్శించడం పట్ల తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

"బహుమతులు ఇలా గోడలకు వేలాడటం చాలా అరుదు. వాటిని ఎక్కడో ఓ మూలన పడేస్తారు. కానీ, నేను గీసిన చిత్రాన్ని ఇలా చూసుకోవడం గొప్ప అనుభూతి" అని థామస్ అన్నారు.

ఈ చిత్రపటాన్ని రిపబ్లికన్ నేత డారెల్ ఇస్సా డోనల్డ్ ట్రంప్‌కి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

చిత్ర లేఖనంలో మంచి ప్రావీణ్యం కలిగిన థామస్ గతంలో అనేక అరుదైన చిత్రాలు గీశారు. ప్రముఖ వ్యక్తులవి, అమెరికా చరిత్ర, అంతర్యుద్ధం, మాజీ అధ్యక్షులంతా కలిసి ఉండటం... లాంటి అనేక చిత్రాలు వేశారాయన.

రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుల చిత్రం లాంటిదే, బరాక్ ఒబామాతో పాటు డెమోక్రటిక్ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షులు కలిసి ఉన్న చిత్రం కూడా వైట్‌హౌజ్‌ గోడలకు వేలాడుతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేమీ పెద్దగా ఆకట్టుకునేలా లేవని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తే, మరికొందరు ఆ చిత్రకారుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

కొంతమంది ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో ట్రంప్ స్థానంలో కార్టూన్ బొమ్మను పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆ టేబుల్ చుట్టూ ఎవరెవరు ఉన్నారు?

  • అబ్రహాం లింకన్: అమెరికా చరిత్రలో అత్యంత ప్రముఖ నేతల్లో ఒకరు. అమెరికా 16వ అధ్యక్షుడిగా 1861లో ఎన్నికయ్యారు.
  • థియోడర్ టెడ్డీ రూస్వెల్ట్: 1901లో అమెరికా 29వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1904లో రెండోసారి ఎన్నికయ్యారు. రష్యా- జపాన్ యుద్ధానికి ముగింపు పలకడంలో కీలక పాత్ర పోషించినందుకు 1906లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
  • డ్వైట్ ఐసన్‌హోవర్: 1953లో అమెరికాకు 34వ అధ్యక్షుడు అయ్యారు.
  • రిచర్డ్ నిక్సన్: 1968లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి.
  • జనరల్ ఫోర్డ్: రిచర్డ్ రాజీనామా తర్వాత 38వ అధ్యక్షుడిగా పనిచేశారు.
  • రోనల్డ్ రీగన్: అమెరికా 40వ అధ్యక్షుడిగా 1980లో ఎన్నికయ్యారు.
  • జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్: 1989 నుంచి 1993 వరకు అధ్యక్షుడిగా చేశారు. అంతకుమందు రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
  • జార్జ్ డబ్ల్యూ బుష్: అమెరికా 43వ అధ్యక్షుడిగా 2001 నుంచి 2009 వరకు పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడి జరిగింది.
  • డోనల్డ్ ట్రంప్: బరాక్ ఒబామా తర్వాత 45వ అధ్యక్షుడిగా 2016లో ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)