ట్రంప్ అలర్ట్: అమెరికాలోని మొబైల్ యూజర్లకు ‘హెచ్చరిక సందేశాలు’

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని 20 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు 'ప్రెసిడెన్షియల్ అలర్ట్'లు వచ్చాయి. గతంలో ఉపయోగించని అత్యవసర సమాచార వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా తెలుసుకోడానికి 'ఈ అలర్ట్'ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
సాధారణంగా మొబైల్‌కు 'అలర్ట్' వచ్చినప్పుడు వాటిని నివారించేందుకు మార్గం ఉంటుంది. అయితే, ఈ 'అలర్ట్'ను నివారించే మార్గం లేదు.
ఫోన్‌ను ఆఫ్ చేయడం లేదా నెట్ వర్క్ కనెక్షన్‌ను తొలగిస్తేనే ఈ అలర్ట్‌ను అందుకోలేం.
కొంతమంది ఈ సందేశాన్ని ట్రంప్ అలర్ట్‌గా అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ ప్రమేయం ఇందులో లేదు.
ట్రంప్ ముఖ్యమైన హెచ్చరికను పంపిస్తే వెంటనే దాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(ఫెమా) దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్యలు తీసుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ అలెర్ట్ వ్యవస్థను క్షిపణుల ప్రయోగం, ఉగ్రవాద చర్యలు, ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసేందుకు ఏర్పాటు చేశారు.
''ఇది నేషనల్ వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ప్రయోగత్మక పరీక్ష. ఎలాంటి చర్యలు అవసరం లేదు'' అని ఒక సౌండ్‌తో హెచ్చరిక సందేశం ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయింది.
అంతర్జాతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 30 నిమిషాల వ్యవధిలో వివిధ మొబైల్ నెట్‌వర్క్ సంస్థల నుంచి ఈ అలర్ట్‌లు ఫోన్లకు వచ్చాయి.
ఇలాంటి అలర్ట్‌లను పంపే ప్రక్రియను మూడేళ్లలో కనీసం ఒక్కసారైన పరీక్షించాలని 2015లో అమెరికా చట్టం తీసుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

వాస్తవానికి ఈ 'అలర్ట్' ప్రయోగాత్మక పరీక్షను సెప్టెంబర్‌లోనే నిర్వహించాలి. కానీ, ఉత్తర, దక్షిణ కరోలినాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితులను నివారించేందుకు దీన్ని వాయిదా వేశారు.
అలర్ట్ తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రజలు దీనిపై చర్చించారు. కొందరు ఈ వ్యవస్థపై ఫిర్యాదు చేస్తే మరికొందరు ఇందులోని లోపాల గురించి మాట్లాడారు. కొందరు తమకు ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టపరంగా సవాళ్లు
ప్రజల రక్షణ ప్రమాదంలో పడినప్పుడే అధ్యక్షుడు ఈ వ్యవస్థను ఉపయోగించేలా కాంగ్రెస్ పరిమితులు విధించింది.
అంతేకాదు, చివరి క్షణంలో హెచ్చరిక సందేశాన్ని నిలువరించే అవకాశాన్ని కూడా ఈ వ్యవస్థ కల్పించింది.
అయినా కూడా ఇలాంటి 'అలర్ట్'లు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని కొందరు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవస్థ తమ స్వేచ్ఛా హక్కులను కాలరాస్తోందని జర్నలిస్టు, లాయర్, ఫిట్‌నెస్ శిక్షకుడితో కూడిన ఓ బృందం 'ఫెమా'పై ఫిర్యాదు చేసింది.
ఈ అలర్ట్స్ పిల్లల్లో ఆందోళన కలిగిస్తాయని ఆ వ్యాజ్యంలో ఆరోపించింది.
అయితే, బుధవారం ఉదయం ఈ కేసును విచారించేందుకు న్యూయార్క్ న్యాయమూర్తి నిరాకరించారు.
జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాల కాలంలోనే ఈ వ్యవస్థ అభివృద్ధి చేశారని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌పై నీలి నీడలు
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు: రేణూ దేశాయ్
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- బ్రిటన్‌లో టీనేజర్లలో గర్భధారణ తగ్గడానికి కారణాలివేనా
- మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?
- అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








