వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
దేశంలో తారాజువ్వలా దూసుకుపోతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వెనెజ్వేలా అధ్యక్షుడు నికోలస్ మడూరో.. చిన్న మొత్తాల్లో ఉన్న కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. వెనెజ్వేలాలో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 10,00,000 శాతం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది.
వెనెజ్వేలాలో తలెత్తిన తీవ్ర ఆర్థిక తిరోగమనం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ.. బొలీవర్‌కు విలువ లేకుండా పోయింది. దేశంలో ద్రవ్యోల్బణ తీవ్రతను తెలియజేసేందుకు రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ కార్లోస్ గార్సియా రవ్లిన్స్ ప్రయత్నించారు. ఇళ్లలో ప్రతిరోజూ వినియోగించే నిత్యావసరాలు.. వాటిని కొనుగోలు చేసేందుకు అవసరమయ్యే డబ్బు కట్టలను పక్కపక్కనే పెట్టి ఫొటోలు తీశారు.
రాజధాని నగరం కరాకస్‌లో 2.4 కేజీల బరువున్న చికెన్ కొనాలంటే 1,46,00,000 బొలీవర్‌లు కావాలి. (సుమారు 4,107 రూపాయలు)

ఫొటో సోర్స్, Reuters
గత గురువారం టాయిలెట్ పేపర్ 26,00,000 బొలీవర్‌లు పలికింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ క్యారెట్లను కొనాలంటే 30 లక్షల బొలీవర్‌లు కావాలి.

ఫొటో సోర్స్, Reuters
అధ్యక్షుడు తీసుకున్న చర్యలు సోమవారం అమల్లోకి రాకముందే తమ ఇళ్లలోకి అవసరమైన, వీలైనన్ని ఆహార పదార్థాలు కొనిపెట్టుకోవాలని ప్రజలంతా భావించారు. ఎందుకంటే కొత్త చర్యల కారణంగా అపోహలు తలెత్తి, బ్యాంకులపై ఒత్తిడి పెరిగి, క్రయవిక్రయాలు సరిగ్గా జరగవేమోనన్నది వారి భయం.
కేజీ బియ్యం ధర 25,00,000 బొలీవర్‌లు.

ఫొటో సోర్స్, Reuters
ఈ ఏడాది జులైలో ద్రవ్యోల్బణం 82,700 శాతానికి చేరింది.
మరకైబో నగరంలోని ఒక సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన అలీసియా రమిరెజ్ (38) అనే ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేటర్.. రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘కూరగాయలు కొందామనుకున్నా. కానీ ఈ క్యూలైనులో నిలబడలేక వెళ్లిపోతున్నా. ప్రజలకు పిచ్చెక్కుతోంది’’ అన్నారు.


శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్ కొనాలంటే 35,00,000 బొలీవర్‌లు అవసరం.

ఫొటో సోర్స్, Reuters
కిలో టొమాటోలు ఎంత? 50,00,000 బొలీవర్లు మాత్రమే!!

ఫొటో సోర్స్, Reuters
సోమవారం దేశవ్యాప్తంగా చిన్న మొత్తాల్లో ఉన్న కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిచిపోతాయి.

ఫొటో సోర్స్, Reuters
కిలో వెన్న, దానిని కొనుగోలు చేయటానికి అవసరమైన 75,00,000 బొలీవర్ల కట్టలను ఈ ఫొటోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఈ చైనా మహిళ గాంధీ ప్రభావంతో శాకాహారిగా మారారు, పాత దుస్తులు ధరిస్తారు, ఇంకా..
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- ‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ 'రహస్యాల'పై నోరు విప్పిన బాడీగార్డ్
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి!
- లబ్ డబ్బు : వర్షాలకు, వడ్డీ రేట్లకు సంబంధం ఏమిటి?
- 'ఆర్థిక వ్యవస్థలో వెలుగు కంటికి కనిపించదా?'
- చరిత్రలో కనిష్ఠ స్థాయికి రూపాయి: ఈ పతనం ఎందుకు?
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- ఈ ఏడాది మోదీ ఏం చేయబోతున్నారు?
- చరిత్రలో కనిష్ఠ స్థాయికి రూపాయి: ఈ పతనం ఎందుకు?
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
- నగదురహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న స్వీడన్
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









