వచ్చేస్తోంది.. మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకూ మనకు సూపర్ హీరోలు, సూపర్ హీరోయిన్లే తెలుసు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక నటి ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో పాత్ర చేసేందుకు సిద్ధమైంది. సూపర్ గర్ల్ అనే లైవ్ యాక్షన్ టీవీ సిరీస్ మొదటిసారి ట్రాన్స్ జెండర్ సూపర్ హీరోను చూపించబోతోంది.
నటి, ఉద్యమకారిణి నికోల్ మైనెస్ ఒక ట్రాన్స్‌జెండర్. ఆమె ఇప్పుడు సూపర్ గర్ల్ సిరీస్‌లో 'నియా నల్' అనే తన కలల పాత్ర చేయబోతోంది.
"ఈ పాత్రతో ట్రాన్స్‌జెండర్ పిల్లల కోసం కూడా ఒక ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో ఉంటాడు" అని ఆమె కాలిఫోర్నియా శాన్‌డియోగోలో జరిగిన కామిక్ కాన్‌లో ప్రకటించింది.
త్వరలో రాబోతున్న సూపర్ గర్ల్ ఫోర్త్ సీజన్‌లో మైనెస్ చేస్తున్న నియా నల్ పాత్రను పరిచయం చేయబోతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సూపర్ గర్ల్ సిరీస్‌లో ఇతరులను కాపాడే ట్రాన్స్‌జెండర్ యువతిగా ఈమె పాత్రను వర్ణిస్తున్నారు.
వెరైటీతో మాట్లాడిన నికోల్ మైన్స్ "అభిమానులు ట్రాన్స్‌జెండర్ల గురించి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మనం ఎవరైనా కావచ్చు, మనం ఏది కావాలంటే అది చేయచ్చు. మనం సూపర్ హీరోస్ కావచ్చు. ఎందుకంటే మనం చాలా విధాలుగా ఉంటాం" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సూపర్ మెన్ సోదరి, క్రిప్టన్ వాసుల్లో మిగిలిన ఒకరుగా మెలిస్సా బెనోయిస్ట్ సూపర్ గర్ల్ పాత్ర పోషిస్తున్నారు.
ఇందులో నిలా నల్ అనే కొత్త కారెక్టర్ కాక్టో వరల్డ్ వైడ్ మెడియా ఉద్యోగిగా పరిచయం అవుతుంది.
ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్ర కథలో వారి చుట్టూ తిరిగేలా ఉండదని ప్రేక్షకులు తెలుసుకోవాలని నికోల్ మెయిన్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరోగానే కాకుండా నియా ఇంకా చాలా పనులు చేస్తుంది. ఆమె ఒక రిపోర్టర్, తను చాలా బలమైనది, చాలా తెలివైనది, మంచి స్నేహితురాలు కూడా.
2014లో స్కూల్ గర్ల్స్ టాయిలెట్ ఉపయోగించడానికి అనుమతించలేదని నికోల్ మెయిన్స్, ఆమె కుటుంబం కోర్టుకు వెళ్లింది.
దాంతో ఆ స్కూల్ దేశ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆగ్రహించింది.
నటనా కెరీర్ ప్రారంభించిన నికోల్, రాయల్ పెయిన్స్ అనే అమెరికా కార్యక్రమంలో నటనకు 2016 గ్లాడ్ అవార్డు గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి:
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- హిజ్రాల గురించి మీకేం తెలుసు?
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- వందేళ్ల ఫిన్లాండ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు
- వాట్సప్: 'ఇక మెసేజీని ఐదుసార్లకు మించి ఫార్వర్డ్ చేయలేరు'
- ఈ 'అమ్మ'కు ఒక్క బ్రెస్ట్‌ఫీడింగ్ తప్ప అన్ని పనులూ వచ్చు!
- ఆమె అతడై.. అతడు ఆమెయై.. తర్వాత ఒక్కటై
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- #గమ్యం: బార్క్‌లో సైంటిస్టు అయితే మీ భవిత బంగారమే
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- సెరెనా విలియమ్స్: నిరుడు గర్భవతిగా ఒక ఫైనల్లో.. నేడు అమ్మగా మరో ఫైనల్లో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








