డీజిల్ కుంభకోణంలో ఆడీ కార్ల అధినేత అరెస్టు

ఫొటో సోర్స్, Getty Images
డీజిల్ కార్లలో వెలువడే ఉద్గారాల వివాదం కేసులో జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడీ సీఈవో రూపర్ట్ స్టాడ్లర్‌ను దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.
ఆడీ యాజమాన్య సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్ అధికార ప్రతినిధి కూడా రూపర్ట్ అరెస్టును ధ్రువీకరించారు.
కేసులో ఆధారాలను తారుమారు చేసే ప్రమాదముందన్న అనుమానంతో రూపర్ట్‌ను అరెస్టు చేసినట్టు మ్యునిచ్ ప్రాసిక్యూటర్లు తెలిపారు.
డీజిల్ కార్లలో వెలువడే ఉద్గారాల తీవ్రత పరీక్షలకు దొరక్కుండా చేసేలా ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఓ పరికరాన్ని అమర్చిన వ్యవహారం మూడేళ్ల క్రితం బయటపడింది.
అప్పట్లో అది తీవ్ర దుమారం రేపింది.
అయితే, ఆ పరికరాలు ఫోక్స్‌వ్యాగన్ కార్లలోనే బయటపడ్డాయి. కానీ, తర్వాత దాని అనుబంధ సంస్థ అయిన ఆడీ కూడా ఆ వివాదంలో చిక్కుకుంది.
డీజిల్ ఇంజిన్లు కలిగిన ఏ6, ఏ7 మోడళ్లకు చెందిన 60,000 కార్లలో కూడా ఉద్గారాల సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు ఉన్నాయని గత నెలలో ఆడీ తెలిపింది.
ఇదే కారణంతో గతేడాది 8,50,000 కార్లను రీకాల్ చేసింది. వాటిలో కొన్నింటికి మార్పులు చేయాల్సి ఉందని వెల్లడించింది.

ఫొటో సోర్స్, EPA
మూడేళ్ల కిందటి వివాదం
ఫోక్స్ వ్యాగన్ కార్లలో డీజిల్ ఉద్గారల కుంభకోణం వ్యవహారం తొలుత 2015 సెప్టెంబర్‌లో బహిర్గతమైంది.
ఆ విషయాన్ని సంస్థ కూడా తర్వాత ఒప్పుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కోటి 10 లక్షల డీజిల్ కార్లలో ఆ పరికరాలను అమర్చినట్టు వెల్లడించింది. అందులో ఒక్క అమెరికాలోనే దాదాపు 6 లక్షల కార్లను అమ్మినట్టు తెలిపింది.
సాధారణ పరిస్థితుల్లో రోడ్లపై విపరీతంగా ఉద్గారాలను వెదజల్లే ఇంజిన్.. ప్రయోగశాలలో పరీక్షిస్తే మాత్రం దాదాపు 40 శాతం తక్కువగా చూపించేలా ఆ పరికరాలను అమర్చారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌పై నీలి నీడలు
- వైరల్ వీడియో: సెల్ఫీలు తీసుకుంటుండగా.. మెడను చుట్టేసిన కొండచిలువ
- అమెరికా: తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్న ట్రంప్. ఎందుకు?
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








