వైరల్ వీడియో: సెల్ఫీలు తీసుకుంటుంటే కొండచిలువ మింగినంత పని చేసింది

దత్తా మెడలో కొండ చిలువ

ఫొటో సోర్స్, AFP

ఒక భారీ కొండచిలువ ఊళ్లోకి వచ్చింది.. దాన్ని చూసి భయపడిన గ్రామస్తులంతా అటవీ అధికారుల్ని పిలిచారు. ఒక అధికారి దాన్ని పట్టుకుని మెడలో వేసుకున్నారు. గ్రామస్థులంతా ఎగబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఉన్నట్లుండి ఆ కొండ చిలువ అధికారి మెడను చుట్టేసింది. ఊపిరాడనివ్వకుండా గట్టిగా ఆయన మెడను బిగించేసింది. తక్షణం అప్రమత్తమైన ప్రజలు కొండచిలువను విడిపించి, ఆ అధికారిని కాపాడారు.

వీడియో క్యాప్షన్, వైరల్ వీడియో: సెల్ఫీలు తీసుకుంటుండగా.. మెడను చుట్టేసిన కొండచిలువ

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లా సహెబ్బరి గ్రామంలోకి ఒక కొండ చిలువ వచ్చింది. 18 అడుగుల ఈ కొండచిలువ ఒక మేకను మింగుతుండగా గ్రామస్థులు చూశారు. భయపడి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంజయ్ దత్తా అనే అధికారి కొండచిలువ బారి నుంచి మేకను కాపాడారు. తర్వాత ఆ భారీ కొండచిలువను తన మెడలో వేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు.

ఉన్నట్టుండి ఆ కొండచిలువ దత్తా మెడను చుట్టేసి, ఊపిరాడనివ్వలేదు. దాన్నుంచి విడిపించుకుందామని ఆయన ప్రయత్నించారు. పక్కనే ఉన్న వాళ్లు కూడా సహకరించారు. దీంతో ఎలాగోలా తప్పించుకోగలిగారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)