ప్రపంచాన్ని ఫిదా చేసిన ‘స్పైడర్ మ్యాన్’ జంతువు

వీడియో క్యాప్షన్, స్పైడర్ మ్యాన్‌లా ఈ రాకూన్ చేసిన సాహసం చూడండి..

స్పైడర్ మ్యాన్‌‌లాగా ఓ రాకూన్(నక్కలాంటి జంతువు) చేసిన సాహసాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఫిదా అయిపోయారు.

అమెరికాలోని మిన్నెసోటాలో ఓ 23 అంతస్తుల భారీ భవనాన్ని అష్టకష్టాలు పడుతూ ఈ రకూన్ అధిరోహించింది.

దీని గురించి వారం రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. #MPRraccoon అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింటేనే అర్థం చేసుకోవచ్చు.

నిట్టనిలువుగా అంతటి మేడను పాకుతున్న ఆ మూగజీవి పట్టుతప్పి కింద పడిపోతుందేమో అంటూ చాలామంది కంగారుపడ్డారు. కానీ, అది పట్టుతప్పలేదు.

గోడ అంచులపై కాసేపు విరామం తీసుకుంటూ దాదాపు ఓ రోజంతా కష్టపడింది. ఆఖరికి రాత్రి 3 గంటల(స్థానిక కాలమానం) సమయంలో భవనం పైకి చేరింది. దాంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)