తొలి 'జేమ్స్ బాండ్ గర్ల్' యూనిస్ గేసన్ ఇక లేరు!

యూనిస్ గేసన్

ఫొటో సోర్స్, EON/MGM

మొట్టమొదటి జేమ్స్ బాండ్ 007 సినిమాలో హీరోయిన్‌గా నటించిన 'బాండ్ గర్ల్' యూనిస్ గేసన్ తన 90వ యేట కనుమూశారు.

1962లో రూపొందిన తొలి బాండ్ సినిమా 'డాక్టర్ నో'లో సీన్ కానరీ సరసన ఆమె సిల్వియా ట్రెంచ్‌‌గా నటించారు.

ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సీన్ కానరీ - "బాండ్, జేమ్స్ బాండ్" - అనే బాగా ప్రాచుర్యం పొందిన డైలాగ్ చెప్పే సందర్భంగా ఆయనకు గేసన్ చాలా సహాయపడ్డారు.

ఆమె అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో 'ఆమె లేని లోటు బాధాకరం' అని పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"యూనిస్ గేసన్ మృతి చెందారని తెలిసి మేం ఎంతో విచారిస్తున్నాం. తొలి బాండ్ గర్ల్ యూనిస్ 'డాక్టర్ నో', 'ఫ్రమ్ రష్యా విత్ లవ్' సినిమాల్లో నటించారు" అని బాండ్ సిరీస్ నిర్మాతలు మైకేల్ జి విల్సన్, బార్బరా బ్రొక్కోలిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

"ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి."

తొలి బాండ్ సినిమాలో సిల్వియా ట్రెంచ్‌గా నటించిన గేసన్ హాలీవుడ్ సినిమా చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు సినీ ప్రేమికుల నాలుకలపై నిలిచిన ఒక డైలాగ్‌ను సృష్టించడంలో తనదైన పాత్ర పోషించారు.

లీ సర్కిల్ క్లబ్ కసీనోలో 007ను కలిసిన సందర్భంగా ఆమె పందెం డబ్బును మరింత పెంచుదామని సూచిస్తారు. అప్పుడు బాండ్ - "నీ ధైర్యానికి నా జోహార్, మిస్, ....?" అని అంటారు.

ఆప్పుడామె "ట్రెంచ్, సిల్వియా ట్రెంచ్. నీ అదృష్టానికి నా జోహార్ మిస్టర్... ?" అని ప్రశ్నిస్తుంది.

"బాండ్, జేమ్స్ బాండ్."

అయితే 2012లో గేసన్ నాటి అనుభవాన్ని పంచుకుంటూ, తొలి బాండ్ సినిమాలో ఆ సన్నివేశాన్ని షూట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పదాలను గంభీరంగా పలికేందుకు సీన్ కానరీ చాలా ఇబ్బంది పడ్డారు.

ఆమె ఇలా అన్నారు: "ఆయన బాండ్, జేమ్స్ బాండ్ అనాలి. కానీ ఆయన వేర్వేరు కాంబినేషన్లు పలకసాగాడు. సీన్ బాండ్, జేమ్స్ కానరీ... 'కట్! కట్! కట్!'"

ఆ తర్వాత డైరెక్టర్ టెరెన్స్ యంగ్ ఒత్తిడి మేరకు కానరీని ఆమె డ్రింక్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఆ డైలాగ్‌ను ఎంతో పర్‌ఫెక్ట్‌గా చెప్పేశారు.

నిజానికి సిల్వియా ట్రెంచ్ పాత్ర కూడా బాండ్ పాత్ర లాగే అవిచ్ఛిన్నంగా కొనసాగాల్సింది. కానీ 'గోల్డ్ ఫింగర్' డైరెక్టర్ గయ్ హామిల్టన్ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పారు. దాంతో 'సిల్వియా ట్రెంచ్' తెరమరుగైంది.

అయితే రెండు సినిమాల్లో బాండ్ గర్ల్‌గా నటించిన ఘనత మాత్రం గేసన్‌కే దక్కింది. 'డాక్టర్ నో' తర్వాత 'ఫ్రమ్ రష్యా విత్ లవ్' సినిమాలోనూ ఆమె సిల్వియా ట్రెంచ్ పాత్రలో నటించారు.

కానీ ఆ రెండు సినిమాల్లోనూ గొంతు మాత్రం ఆమెది కాదు.

ఆమె డైలాగుల్ని వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్ నిక్కీ వాన్ దెర్ జీల్‌తో చెప్పించారు. 1960, 1970 దశకాల్లో నిర్మించిన అనేక బాండ్ సినిమాల్లో బాండ్ గర్ల్ డైలాగుల్ని ఇలాగే ఇతరులతో చెప్పించారు.

1928లో సర్రేలో జన్మించిన గేసన్ బాండ్ గర్ల్‌గా నటించడానికి ముందు కొన్ని సినిమాల్లో నటించారు. వాటిలో 1958లో విడుదలైన 'ద రివెంజ్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టైన్' ఒకటి.

బాండ్ సినిమాల తర్వాత ఆమె 'ద సెయింట్ అండ్ ది యావెంజర్స్' అనేక క్లాసిక్ టీవీ సిరీస్‌ల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)