ఓం మిథర్వాల్‌కు కాంస్యం.. మరో పతకం ఖాయం చేసిన మేరీకోమ్

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో గురువారం భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ పోటీల్లో ఓం మిథర్వాల్‌కు కాంస్య పతకం లభించింది.
మొత్తం ఎనిమిది రౌండ్లలో మిథర్వాల్ 201.1 పాయింట్లు సాధించాడు.
ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన డానియేల్ రెపకొలి 227.2 పాయింట్లతో స్వర్ణపతకం, బంగ్లాదేశ్‌కు చెందిన షకీల్ అహ్మద్ 220.5 పాయింట్లతో కాంస్య పతకం గెలుపొందారు.
మహిళల బాక్సింగ్ 45-48 కేజీల విభాగంలో భారతీయ క్రీడాకారిణి మేరీకోమ్ ఫైనల్స్‌కు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
పతకం ఖాయం చేసిన మేరీకోమ్
భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7.32 గంటలకు జరిగిన సెమీఫైనల్ పోటీలో శ్రీలంక బాక్సర్ అనూష దిల్రుక్షి కొడ్డిత్తువక్కుపై మేరీకోమ్ 5-0 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మొత్తం ఐదు రౌండ్లు జరిగిన ఈ బాక్సింగ్ పోటీలో వరుసగా మేరీకోమ్.. 30-27, 30-27, 30-27, 30-27, 30-27 స్కోరు సాధించింది.
కాగా, ఈ విభాగంలో మరొక సెమీఫైనల్ నార్తరన్ ఐర్లాండ్‌కు చెందిన క్రిస్టినా ఓ హరా, న్యూజిలాండ్‌కు చెందిన తస్మైన్ బెన్నీల మధ్య జరగ్గా.. అందులో క్రిస్టినా ఓ హరా 5-0 పాయింట్ల తేడాతో గెలుపొందింది.
ఏప్రిల్ 14వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.02 గంటలకు మేరీకోమ్, క్రిస్టినా ఓ హరాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








