#MeToo, #TakeAKnee, #Covfefe - 2017లో వీటిదే హవా!

ఫొటో సోర్స్, CurvaBezier
టెర్రరిస్ట్ దాడుల నుంచి సెలబ్రిటీల మరణాల వరకు సోషల్ మీడియాలో చర్చించే ఏ సామాజిక అంశంలోనైనా హ్యాష్‌ట్యాగ్స్ ముఖద్వారంగా ఉంటాయి. సామాన్యుడికి సైతం ఆ చర్చల్లో పాల్గొనేందుకు హ్యాష్‌ట్యాగ్స్ అవకాశం కలిగిస్తున్నాయి.
2017లో ట్విటర్ కూడా ట్వీట్స్‌లోని అక్షరాల పరిమితిని 140 నుంచి 280కు పెంచింది. దీంతో 3 లక్షల మంది ట్విటర్ వినియోగదారులు తమ అభిప్రాయాలను మరింత వివరంగా రాసేందుకు అవకాశం కలిగింది.
2017లో పుట్టిన #MeToo, #TakeAKnee, #Covfefe లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌ను ఓసారి పలకరిద్దామా.!

ఫొటో సోర్స్, @taraobrienillustration
'మీ టూ' (#MeToo)
2017లో ఉద్భవించిన ఈ హ్యాష్‌ట్యాగ్ ప్రభావం ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది. బాల్యంలో, యవ్వనంలో లైంగిక వేధింపులకు గురైన స్త్రీపురుషుల, ముఖ్యంగా స్త్రీల చేదు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఈ హ్యాష్‌ట్యాగ్ తోడ్పడింది.
2007లో అమెరికా ఉద్యమకారిణి తారానా బర్క్ 'మీ టూ' ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ సోషల్ ఉద్యమ స్ఫూర్తి 2017 నాటికి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ #MeToo గా రూపాంతరం చెందింది.
అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ బాధితులతో ఈ హ్యాష్‌ట్యాగ్ ప్రారంభమైంది.
లైంగిక వేధింపులకు గురైనవారు తమ అనుభవాలను నిర్భయంగా వివరిస్తూ.. ఆ దాడులను ముక్తకంఠంతో వ్యతిరేకించాలని హాలీవుడ్ తార అలిసా మిలానో కోరారు. దీంతో మీటూ హ్యాష్ ట్యాగ్ ఒక్కసారిగా ఊపందుకుంది.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

2017 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ట్విటర్, ఫేస్‌బుక్‌లలో ఈ హ్యాష్ ట్యాగ్‌ను 60 లక్షల మందికి పైగా వాడారు.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వివిధ చర్చల్లో పాల్గొనేందుకు రకరకాల హ్యాష్ ట్యాగ్‌లను వాడారు. ఫ్రాన్స్‌లో #balancetonporc అనే హ్యాష్‌ట్యాగ్‌ను 2017 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 5 లక్షల సార్లు వాడారు. ఇక భారత దేశంలో లైంగిక దాడుల అంశాన్ని చర్చించేందుకు #abusefreeindia అనే హ్యాష్ ట్యాగ్‌ను ఎక్కువగా వాడారు.

ఫొటో సోర్స్, Reuters
'టేక్ ఎ నీ' (#TakeAKnee)
2017 సెప్టెంబర్‌లో కేవలం 3 రోజుల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 12 లక్షల ట్వీట్లు వచ్చాయి.
అమెరికాలోని ఎన్.ఎఫ్.ఎల్. క్రీడాకారులు మ్యాచ్ ప్రారంభంలో వచ్చే జాతీయగీతాలాపన సందర్భంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ 'టేక్ ఎ నీ' హ్యాష్ ట్యాగ్ ఆ క్రీడాకారుల నిరసనకు వేదికగా పని చేసింది.
2016 ఆగస్ట్‌లో జాతి వివక్షకు నిరసనగా అమెరికా క్రీడాకారుడు కోపర్నిక్ ఈ నిరసన చర్యను మొదలు పెట్టారు.
కోపర్నిక్ మాట్లాడుతూ.. ''జాతి వివక్ష అంశంలో పోలీసుల దుర్మార్గం గురించి ప్రస్తావించాల్సి ఉంది. ఇంకా ఎన్నో అంశాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది'' అన్నారు.
కానీ కోపర్నిక్ అమెరికా రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారని చాలా మంది అభిమానులు భావించారు. ఎన్.ఎఫ్.ఎల్. క్రీడాకారులు ఒక్కొక్కరూ ఈ ఉద్యమంలో భాగమవ్వడం మొదలైంది. దీంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వైఖరిని ఖండించారు.
సెప్టెంబర్ మాసాంతానికి ఈ హ్యాష్ ట్యాగ్ ఓ ఉద్యమ నినాదంలా ఉద్భవించింది.

ఫొటో సోర్స్, EPA
#Covfefe
మిగతా హ్యాష్‌ట్యాగ్స్ అన్నీ ఒక ఎత్తు కాగా, ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. 2017 మే నెలలో ఓ వింత పదం గురించి సోషల్ మీడియా యూజర్స్ చర్చించుకున్నారు. అదే #Covfefe అనే హ్యాష్‌ట్యాగ్ పుట్టుకకు దారితీసింది.
ఈ పదం మొదటిసారిగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌లో ప్రత్యక్షమైంది. మే 31 రోజున అర్ధరాత్రి గడిచాక ఈ ట్వీట్ చేశారు. ట్వీట్‌ను అర్ధాంతరంగా ముగించి నిద్రలోకి జారుకున్నట్టున్నారు.
రెండు గంటల అనంతరం.. ట్రంప్ రాసిన ఈ ట్వీట్‌ను సోషల్ మీడియా యూజర్లు 70,000 సార్లు రీట్వీట్ చేశారు. ఈ పదానికి అర్థమేమిటా.. అంటూ నవ్వుకున్నారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఆరు గంటల తర్వాత ఈ ట్వీట్‌ను డిలీట్ చేసి, దాని స్థానంలో మరో ట్వీట్‌ను ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే.. ఆ పదానికి అర్థమేమిటని వైట్‌హౌస్ మీడియా వ్యవహారాల కార్యదర్శిని ప్రశ్నించింది.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

అయితే.. ''డొనాల్డ్ ట్రంప్‌కూ, మరికొంతమందికి మాత్రమే దాని అర్థం తెలుసంటూ.. ఆ అధికారి బుకాయించారు. కేవలం 24 గంటల్లోపే #covfefe హ్యాష్ ట్యాగ్‌ను 14 లక్షల సార్లు వినియోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
థర్డ్ డిబేట్ (#Third_debate)
మేలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు హుస్సేన్ రుహానీ సహా ఆరుగురు అధ్యక్ష అభ్యర్థుల మధ్య మూడుసార్లు టెలివిజన్ చర్చలు జరిగాయి.
మే 12న చివరి టెలివిజన్ చర్చ సందర్భంగా Third_debate హ్యాష్‌ట్యాగ్ బాగా ప్రచారంలోకి వచ్చింది.
ట్విటర్‌ను ఇరాన్ నిషేధించినా ఆ రోజు 1,50,000 సార్లు #Third_debate ఉపయోగించారు.
టెహ్రాన్ మేయర్, కన్సర్వేటీవ్ అభ్యర్థి మొహమ్మద్ బకీర్.. ఉద్యోగులకు ఇచ్చిన అత్యధిక జీతాలను ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఎక్కువ మంది ప్రశ్నించారు.
సీనియర్ ఉద్యోగులకు టెహ్రాన్ మున్సిపాలిటీ చౌకగా లగ్జరీ ఇళ్లను కేటాయించడంపై అధ్యక్షుడు రుహానీ ప్రచార అకౌంట్ నుంచి ఒక డాక్యుమెంట్‌ను ట్వీట్ చేశారు.
మే 19న 57శాతం ఓట్లతో రుహానీ ఇరాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యారు.

#యెమన్‌ఎంక్వైరీనౌవ్ (#YemenInquiryNow)
గత సెప్టెంబర్‌లో యెమన్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్‌ను విరివిగా ఉపయోగించారు.
యెమన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై 'యెమన్‌ఎంక్వైరీనౌవ్' హ్యాష్‌ట్యాగ్‌తో స్పందించాలంటూ అక్కడి 'అల్ మసిరా' టీవీ చానల్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
2015 నుంచి సౌదీ సారథ్యంలోని బహుళజాతి సంకీర్ణం యెమన్‌పై ఆంక్షలు విధించింది. ఆహారం, మందులు, చమురు లాంటి నిత్యావసర సరుకులను తగ్గించింది. దీంతో లక్షలాది మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు ఆకలితో మరణించారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న YemenInquiryNow హ్యాష్‌ట్యాగ్‌ను విస్తృతంగా ఉపయోగించారు. యెమన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ సంస్థతో విచారణ జరిపించాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు. 24 గంటల్లో 'యెమన్‌ఎంక్వైరీనౌవ్' హ్యాష్‌ట్యాగ్‌ను 1,20,000 సార్లు ఉపయోగించారు.
సౌదీ అరేబియా, ఐక్యరాజ్యసమితిని విమర్శిస్తూ ప్రజలు ట్విటర్‌లో పోస్టులు పెట్టారు.

ఫొటో సోర్స్, Nikada
#ఐలవ్‌యూచైనా (#ILoveYouChina)
అక్టోబర్‌లో చైనాలో అత్యంత కీలకమైన పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించింది. దేశంలోని అగ్రశ్రేణి సంగీతకారులతో పాత దేశభక్తి గీతాన్ని పాడించింది.
1979లో వచ్చిన 'హార్ట్స్ ఫర్ మథర్‌లాండ్' చిత్రంలో 'ఐ లవ్ యు చైనా' అనేది థీమ్ ట్యూన్.
ఎక్కడున్నా మాతృదేశంపై మమకారం చెదరకూడదని ఈ చిత్రం చెబుతుంది.
కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడికి మద్ధతుగా ప్రజలు 'ఐ లవ్ యు చైనా' హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించారు.
అక్టోబర్ 1న తొలిసారి ఈ వీడియోను చైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి 3,22,000 పైగా షేర్లు, 35,000 కామెంట్లు వచ్చాయి.
ఆ తర్వాత రెండు వారాల్లో 'ఐ లవ్ యు చైనా' హ్యాష్‌ట్యాగ్‌ను 20 లక్షల సార్లు వాడారు.
చైనాలో జిన్‌పింగ్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఈ ప్రచారం ఎంతో దోహదపడింది.

ఫొటో సోర్స్, Osama Hajjaj
#308Removed
అత్యాచార బాధితులను పెళ్లి చేసుకునే రేపిస్టులకు శిక్ష విధించకూడదన్న నిబంధనను ఈ ఏడాది జోర్డాన్ తొలగించింది. దీంతో '308రిమూవ్డ్' హ్యాష్‌ట్యాగ్‌తో ప్రభుత్వ నిర్ణయాన్నిజోర్డాన్ ప్రజలు ప్రశంసించారు.
నిజానికి 308 నిబంధనను తొలగించాలంటూ మానవ హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మహిళలకు మరింత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ట్విటర్‌లో '308రిమూవ్డ్' హ్యాష్‌ట్యాగ్‌తో 24గంటల్లో 3500 ట్వీట్లు చేశారు. ట్వీట్ల సంఖ్య తక్కువగా ఉన్నా.. ఈ అంశంపై జోర్డాన్ సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది.
ఇలాంటి ఓ నిబంధనను ట్యూనిషియా, లెబనాన్‌లో కూడా ఇటీవలే రద్దు చేశాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








