నా ట్వీట్లపై కాదు, మీ దేశంలో ఉగ్రవాదంపై దృష్టి పెట్టండి: డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద వీడియోలను షేర్ చేసినందుకు సర్వత్రా విమర్శల పాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనను విమర్శించడం మాని బ్రిటన్‌లో 'ఉగ్రవాదం'పై దృష్టి పెట్టాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు సూచించారు.
డొనాల్డ్ ట్రంప్ ముస్లిం వ్యతిరేక వీడియోలను రీట్వీట్ చేయడం పట్ల థెరెసా మే నిరసన తెలిపారు.
దీనిపై స్పందిస్తూ ట్రంప్ ''నా మీద కాదు, యూకేలోని రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజంపై దృష్టి పెట్టండి'' అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అంతకు ముందు, బ్రిటిష్ అతి మితవాద సంస్థ 'బ్రిటన్ ఫస్ట్' బృందం పోస్ట్ చేసిన రెచ్చగొట్టేవిగా ఉన్న వీడియోలను డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేశారు.
ట్రంప్‌కు సుమారు 4 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆయన రీట్వీట్ చేసిన వీడియోలను 'బ్రిటన్ ఫస్ట్' డిప్యూటీ లీడర్ జేదా ఫ్రాంన్సన్ పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter/@realDonaldTrump
ఫ్రాంన్సన్ మొదటి ట్వీట్‌లో ఓ ముస్లిం శరణార్థి ఊతకర్ర సాయంతో నడుస్తున్న మనిషిపై దాడి చేసే దృశ్యం ఉంది. రెండో వీడియోలో ఒక వ్యక్తి వర్జిన్ మేరీ విగ్రహాన్ని బద్దలు కొడుతున్న దృశ్యాలుండగా.. మూడో వీడియోలో ఓ భవనంపై ఓ వ్యక్తి మరో వ్యక్తిని తోసేస్తున్న దృశ్యం ఉంది.
ట్రంప్ చర్యను ఖండిస్తూ బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రతినిధి 'అమెరికా అధ్యక్షుడు అలా రీట్వీట్ చేయకుండా ఉండాల్సింది' అన్నారు.
అయితే అమెరికా మాత్రం దీనిని సమర్థించుకుంది. వైట్ హౌజ్ ప్రతినిధి సారా శాండర్స్.. ‘ఆ వీడియో నిజమైనా కాకున్నా, ఇలాంటి ప్రమాదకరమైన అంశాలపై మే, ఇతర ప్రపంచ నేతలు చర్చించాల్సిందే’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘బ్రిటన్ ఫస్ట్’ చరిత్ర ఏంటి?
అతి మితవాద బ్రిటిష్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన మాజీ సభ్యులు 2011లో 'బ్రిటన్ ఫస్ట్'ను స్థాపించారు. వివాదాస్పద పోస్టులతో ఈ బృందం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
వలస వ్యతిరేక విధానాలతో 'బ్రిటన్ ఫస్ట్' యూరోపియన్ ఎన్నికల్లో పోటీ చేసినా, ఒక్క సీటూ సంపాదించుకోలేకపోయింది. ఇటీవల జరిగిన లండన్ మేయర్ ఎన్నికల్లో పాల్గొని 1.2 శాతం ఓట్లు తెచ్చుకుంది.
అయితే బ్యాలెట్ బాక్స్ కన్నా, ఆన్‌లైన్ ద్వారా ఇది చాలా ప్రాముఖ్యత పొందింది. ఈ పార్టీకి ఫేస్‌బుక్‌లో సుమారు 20 లక్షల లైక్‌లు ఉన్నాయి.
బ్రిటన్ ఫస్ట్ డిప్యూటీ లీడర్ ఫ్రాంన్సన్ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరు మోశారు. తన వ్యాఖ్యలకు సంబంధించి ఆమె ఓ కేసులో డిసెంబర్ 14న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎవరేమన్నారు?
ట్రంప్ రీట్వీట్లపై సోషల్ మీడియాలో అసహనం వ్యక్తమైంది.
మితవాద తీవ్రవాది చేతిలో హత్యకు గురైన బ్రిటిష్ ఎంపీ జో కాక్స్ భర్త బ్రెండన్ కాక్స్.. ట్రంప్ రీట్వీట్లను ఖండించారు.
టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్, 'ఈ పిచ్చితనాన్ని ఆపి, రీట్వీట్లను వెనక్కి తీసుకోండి' అని సూచించారు.
అమెరికా పౌర హక్కుల బృందం 'కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్', అమెరికా అధ్యక్షుడి నుంచి ఇలాంటి చర్యలను ఆశించలేమని పేర్కొంది. ట్రంప్ పోస్ట్‌లు అమెరికా ముస్లింలపై హింసకు పురిగొల్పేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








