'మోదీ' వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. సూరత్ కోర్టు తీర్పు

ఫొటో సోర్స్, Getty Images
2019 నాటి ఒక క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
రాహుల్‌ను దోషిగా గుర్తించి, తీర్పు ప్రకటించిన తర్వాత, కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. పైకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది.
ఈ కేసులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ గత వారం విచారణ ముగించి, తీర్పు వాయిదా వేశారు. గురువారం కోర్టుకు రాహుల్ హాజరయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దొంగలందరి ఇంటి పేర్లలో 'మోదీ' అని ఎలా ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారంటూ ఈ కేసు దాఖలైంది.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్నాటకలోని కోలార్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 499, 500ల కింద రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.
పొరపాటును అంగీకరిస్తున్నారా అని రాహుల్‌ను జడ్జి అడగ్గా, తాను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదని ఆయన బదులిచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది మీడియాతో చెప్పారు. తన వ్యాఖ్యలు పిటిషనర్‌కు ఎలాంటి హానీ చేయలేదని రాహుల్ చెప్పారు.
తన వాంగ్మూలం ఇచ్చేందుకు 2021 అక్టోబరులో రాహుల్ సూరత్ కోర్టులో హాజరయ్యారు.

ఫొటో సోర్స్, ANI
రాహుల్‌పై ఫిర్యాదు దాఖలు చేసినన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, కోర్టు తీర్పును స్వాగతించారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. సమాజానికి, కులానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాహుల్‌కు ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
తన వ్యాఖ్యలతో ఏ కమ్యూనిటీ మనసూ నొప్పించాలనుకోలేదని విచారణ సందర్భంగా రాహుల్ కోర్టుకు నివేదించారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు.
తీర్పు తర్వాత రాహుల్ ఒక ట్వీట్‌లో- సత్యం, అహింసలపై తన మతం ఆధారపడి ఉందని, సత్యమే తన దైవమని, దానిని చేరుకోవడానికి అహింసా విధానమే తనకు మార్గమని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తీర్పు అనంతరం కాంగ్రెస్ స్పందిస్తూ- దేశంలోని నియంతపై రాహుల్ గళం విప్పుతున్నారని, అందుకే ఆయన్ను ఈడీ, పోలీసులు, శిక్షలతో బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించింది. ఈ దేశం సొమ్ముతో పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, ఇతర మోదీలను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో రాహుల్ వ్యాఖ్యలు చేశారని, ఆ సందర్భాన్ని చూడాలని కాంగ్రెస్ చెప్పింది.
సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ అప్పీలుకు వెళ్లనున్నారు.
ఇవి కూడా చూడండి:
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- దాస్ కా ధమ్కీ రివ్యూ: విష్వక్ సేన్ చేసిన ట్విస్టుల దండయాత్ర ఫలించిందా?
- అదానీ గ్రూప్- బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్-గఢ్-లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు-
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి- అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ-
- ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు- పులివెందుల్లో జగన్-కు... కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారా-
- తెలంగాణ- పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది-
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- ఆంధ్రప్రదేశ్- ఆ ఊరి పిల్లలు గుర్రాలపై సవారీ చేస్తూ బడికి వెళ్తున్నారు
- ఆరోగ్యం- ఏం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది- విటమిన్ టాబ్లెట్లు మంచివేనా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








