INDvsPAK: 'ఆ చివరి మూడు ఓవర్లు చూస్తూ దీపావళి పండుగ చేసుకున్నా' - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సోషల్ మీడియాలో చర్చ

ఫొటో సోర్స్, AFP
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం నాడు భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా చేరారు. ట్విటర్‌లో ఒక యూజర్‌కు ఆయన ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియంలో చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌కు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ వుతున్నాయి. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో ఉత్కంఠ గురంచి చాలా మంది సీనియర్ ప్లేయర్లు కూడా మాట్లాడుతున్నారు.
భారత జట్టు గెలవాలంటే చివరి మూడు ఓవర్లలో.. అంటే 18 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. ఆ లక్ష్యాన్ని సాధించటం సులభం కాదు. గెలవటం దాదాపుగా అసాధ్యమనుకున్న తరుణంలో.. విరాట్ కోహ్లీ అద్భుత ప్రతిభతో భారత జట్టును గెలిపించాడు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం ఉదయం దీపావళి శుభాకాంక్షలు చెబుతూ, తాను ఆదివారం నాటి మ్యాచ్‌ను మళ్లీ చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ అయింది.

ఫొటో సోర్స్, Reuters
ఆ ట్వీట్‌లో ''హ్యాపీ దివాలి. అందరూ తమ స్నేహితులు, కుటుబాలతో ఆనందంగా పండుగ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను'' అంటూ పిచాయ్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
''చివరి మూడు ఓవర్లు ఈ రోజు మళ్లీ చూస్తూ నేను పండుగ చేసుకున్నాను. అద్భుతమైన ఆట, అద్భుత ప్రదర్శన!'' అంటూ భారత జట్టు ఆటతీరును ప్రశంసించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సుందర్ పిచాయ్ ట్వీట్‌ను మధ్యాహ్నానికి 25,000 రీట్వీట్లు, 21 లక్షల లైకులు వచ్చాయి.
అయితే సుందర్ పిచాయ్‌ని ట్రోల్ చేయటానికి మొహమ్మద్ షాజాయిబ్ అనే ఒక యూజర్ ప్రయత్నించారు. ''మీరు మొదటి మూడు ఓవర్లు కూడా చూడాలి'' అంటూ పిచాయ్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆ యూజర్‌కు సుందర్ పిచాయ్.. ''అది కూడా చేశాను :) భువి, ఆర్ష్‌దీప్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారు!'' అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై ట్వీట్ దాదాపు 20 వేల సార్లు రీట్వీట్ అయింది.
ట్విటర్ ట్రోల్‌కు పిచాయ్ ఇచ్చిన జవాబు పట్ల నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు.
'సుందరమైన దెబ్బ' అంటూ ఒక యూజర్ అభివర్ణించారు.
మరొక యూజర్ ‘చాలా సుందరంగా ఉంది’ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇంకొందరు యూజర్లు మీమ్‌లు పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇంకొక యూజర్.. మొహమ్మద్ షాజాయిబ్‌కు రిప్లై ఇస్తూ.. ''చింతించవద్దు. నువ్వు ఓడిపోయింది గూగుల్ ఇండియన్ సీఈఓ చేతిలో'' అంటూ ఊరడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6
అయితే.. మొహమ్మద్ షాజాయిబ్ మరోసారి సుందర్ పిచాయ్‌ను ట్యాగ్ చేస్తూ.. ''నేను మాట్లాడుతున్నది భారత జట్టు ఇన్నింగ్స్ గురించి'' అని ట్వీట్ చేశారు.
దీనికి బదులుగా చాలా మంది ట్విటర్ యూజర్లు అనేక రకాల మీమ్‌లు షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
కొందరు పాకిస్తాన్, భారతదేశాల ప్రధానమంత్రుల ఫొటోలతో కూడిన మీమ్‌లు ఉపయోగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
‘‘శుభాకాంక్షలు. ఇంత పెద్ద మనిషి మిమ్మల్ని ట్రోల్ చేశారు’’ అంటూ ఒక యూజర్ ముహమ్మద్ షాజాయిబ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేస్తే.. ఆయన దానికి ‘థాంక్యూ’ అంటూ బదులిచ్చారు.
ఇంకొందరు సుందర్ పిచాయ్ జవాబు ఇచ్చిన ట్వీట్లను ఫ్రేమ్ కట్టించుకుని హాల్‌లో పెట్టుకోవాలని షాజాయిబ్‌కు సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
ఇదంతా అయ్యాక మొహమ్మద్ షాజాయిబ్ మరో పోస్ట్ చేశారు. సుందర్ పిచాయ్ ట్వీట్ల త్రెడ్‌తో స్క్రీన్ షాట్‌ను అందులో పెట్టారు. ''పొరుగువాళ్లు చాలా మంది కోరటంతో ఈ ఫొటోను ఫ్రేమ్ చేయించాలని నేను నిర్ణయించుకున్నా'' అని అందులో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
అయితే.. చాలా మంది యూజర్లు షాజాయిబ్ పోస్ట్‌కు స్పందనగా అభ్యంతరకరమైన, అసభ్య వ్యాఖ్యలు కూడా చేశారు.
కామన్ మ్యాన్ అనే పేరుతో ఉన్న ఒక ట్విటర్ హ్యాండిల్.. ''నవ్వుకో సోదరా. చాలా మంది నిన్ను ట్రోల్ చేస్తారు. బాధపడకు. సుందర్ పిచాయ్ అద్భుతమైన జవాబు ఇచ్చారు. మిగతా వాళ్లు ఏం అంటున్నారనే దానికి బాధపడొద్దు'' అని సూచించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)