ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.
1. ఆంధ్రప్రదేశ్‌లో ఖర్జూరం సాగు - ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందంటున్న రైతులు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఖర్జూరం పంట దిగుబడికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఎడారి ప్రాంత దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే ఖర్జూరంను నేరుగా వ్యాపార అవసరాల కోసం ఇక్కడ సాగు చేస్తుండటం ఆసక్తిగా మారింది.
సాధారణంగా మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో ఖర్జూరం సాగు ఎక్కువ. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఖర్జూరం పండిస్తారు.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, ABID BHAT
2.సంప్రదాయ జీవనశైలిని కాపాడుకునేందుకు గిరిజన తెగ బకర్వాల్ ప్రజల అవస్థలు
మారుతున్న వాతావరణ పరిస్థితులు, అటవీ భూభాగం వల్ల భారత పాలిత కశ్మీర్‌లో సంచార జాతికి చెందిన గిరిజన తెగలు తమ సంప్రదాయ జీవనశైలిని కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
"మా జీవితం గురించి అందంగా వర్ణించాలని చూస్తారు. కానీ, మా జీవితం కష్టాలను తట్టుకుంటూ సాగించే ప్రయాణం" అని బకర్వాల్ తెగకు చెందిన పశువుల కాపరి లియాఖత్ ఖాన్ అన్నారు.
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఉన్న 34లక్షల మంది శక్తివంతమైన సంచార జాతుల్లో బకర్వాల్ తెగకు చెందిన వారు ఒకరు. వీరు ప్రధానంగా గొర్రెల కాపర్లు.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
3. బీమా పాలసీ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తరహా పాలసీ మంచిదో నిర్ణయించుకోవడం ఎలా?
జీవిత బీమా అనేది ఒక అవసరం. ఆర్థిక స్వావలంబన సాధించడంలో జీవిత బీమా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఫైనాన్షియల్ ప్లానింగ్ సూత్రం ప్రకారం మన ఆదాయంలో గరిష్ఠంగా 6% మాత్రమే జీవిత బీమా వార్షిక ప్రీమియం రూపంలో చెల్లించాలి.
అంతకంటే ఎక్కువ అయితే ఆ బీమా మార్గం మనకు సరిపోదని అర్థం చేసుకోవాలి. అలాగే బీమా కాలపరిమితి కూడా మన జీవిత కాలమంతా ఉండేలా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
4. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయొద్దని భారత టెక్ సంస్థలు ఎందుకు చెబుతున్నాయి?
దిల్లీకి చెందిన సాహిల్ (పేరు మార్చాం) 2019లో రెండో ఉద్యోగం మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు ఇదేమీ పెద్ద సమస్య కాదని ఆయన అనుకున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థల్లోని ఒక సంస్థలో గత మూడేళ్లుగా ఆయన ఉద్యోగం చేస్తూనే, ఇతర ఐటీ సంస్థల కోసం కూడా ఆయన పనిచేస్తున్నారు. ముఖ్యంగా నిమాయకాల కోసం ఆయన కోడింగ్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఒక్కో ప్రాజెక్టుకు ఆయనకు దాదాపు పది వేల డాలర్లు (రూ.8.17 లక్షలు) వరకు సంపాదిస్తుంటారు.
ఈ రెండో ఉద్యోగం గురించి ఆయన మాతృ సంస్థకు తెలియదు. ఎందుకంటే ఈ రెండో పనితో తను చేసే మొదటి ఉద్యోగంపై ఎలాంటి ప్రభావం పడదని ఆయన అంటున్నారు.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, QUEEN'S UNIVERSITY, BELFAST
5. మనుషులు ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి శ్వాస ఆధారంగా కుక్కలు ఆ విషయం పసిగట్టేస్తాయి
మనుషుల భావోద్వేగాలను కుక్కలు ఎంత బాగా అర్థం చేసుకుంటాయనేది మరోసారి రుజువైంది. ఈసారి శాస్త్రీయంగా నిర్వహించిన ఒక వాసన పరీక్షలో ఓ కొత్త విషయం వెల్లడైంది.
మనం ఒత్తిడికి గురవుతున్నట్లయితే.. మన శ్వాసలో, మన చెమటలో ఆ ఒత్తిడి వాసనను పెంపుడు కుక్కలు పసిగడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
- Gas flaring: చమురు వెలికితీసే సంస్థలు గ్యాస్‌కు మంట పెడుతున్నాయి ఎందుకు
- క్యాన్సర్ సహా పలు వ్యాధులకు కారణమయ్యే కర్బన ఉద్గారాల వివరాలను దాస్తున్న చమురు కంపెనీలు- బీబీసీ పరిశోధన
- ఇరాన్: యాభైఏళ్ల కిందటే అత్యాధునిక జీవితాన్ని చూసిన మహిళల జీవితాలు తర్వాత ఎలా మారిపోయాయి?
- తెలంగాణలో నిత్యపూజలు జరిగే గాంధీ గుడి ఇది
- సబర్మతి ఆశ్రమం: గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








