సబర్మతి ఆశ్రమం: గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం
సబర్మతి ఆశ్రమంగా పేరొందిన గాంధీ ఆశ్రమం 101 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన తర్వాత తన మిత్రుడు, బారిస్టర్ అయిన జీవన్‌లాల్ దేశాయ్‌కి చెందిన కొచరబ్ బంగ్లాలో 1915 మే 25వ తేదీన గాంధీ తన ఆశ్రమాన్ని ప్రారంభించారు. అయితే, అక్కడ వ్యవసాయం చేయటానికి, పశువులను పెంచటానికి, ఇతరత్రా కార్యక్రమాలకు సరిపడా స్థలం లేకపోవటంతో ఈ ఆశ్రమాన్ని సబర్మతి నది కరకట్ట పక్కన ఉన్న 36 ఎకరాల స్థలంలోకి 1917 జూన్ 17వ తేదీన మార్చారు. అదే సబర్మతి ఆశ్రమంగా పేరొందింది.
వందేళ్ల చరిత్ర కలిగిన ఈ సబర్మతి ఆశ్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించింది బీబీసీ.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతి వద్ద ఉన్న ఈ ఆశ్రమం గాంధీజీకి స్వాతంత్ర సంగ్రామాన్ని ధైర్యంగా నడిపించడానికి కావలసిన స్ఫూర్తినందించింది.
‘ప్రతి మనిషి అవసరాన్ని తీర్చే శక్తి ఈ ప్రపంచానికి ఉంది.. కానీ, మనిషి దురాశకు మాత్రం ఈ ప్రపంచం సరిపోదు’ అన్నది గాంధీ చెప్పిన విలువైన మాటల్లో ఒకటి.
న్యాయశాస్త్రం చదివిన గాంధీకి చదువు గొప్పదనం తెలుసు. ఆశ్రమంలో ఆయన పిల్లలకు చదువు చెప్పేవారు.
గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అబ్దుల్ ఖాదిర్ బావజీర్ పరిచయమయ్యారు. బావజీర్‌ను గాంధీ చాలా దగ్గర చేశారు.
దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన బావజీర్ తర్వాతి కాలంలో గాంధీ ఆశ్రమం బాధ్యతలు చేపట్టారు. చాలాకాలం పాటు బావజీర్ కుటుంబ సభ్యులే ఈ ఆశ్రమ నిర్వాహకులుగా ఉన్నారు.
ఈ ఆశ్రమం 101 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఓసారి మననం చేసుకుందాం. మహాత్మా గాంధీకి సంబంధించిన కథనాలు చదవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)









