ఉబర్: 30 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.2,414...ఇది కొత్త తరహా మోసమా లేక సాంకేతిక సమస్యా

ఫొటో సోర్స్, NURPHOTO
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓలా, ఉబర్‌ల కస్టమర్ కేర్ నెంబర్లు తెలుసా?
వాటి యాప్‌ల్లో కస్టమర్ కేర్ నెంబర్లు ఎందుకు ఉండవు?
పోనీ ఓలా, ఉబర్‌ను అడిగితే చెబుతారా అంటే అదీ లేదు. ఎన్నిసార్లు, ఎంత మంది ఫేస్‌బుక్, ట్విటర్‌లలో పోస్టులు పెట్టినా ఫలితం శూన్యం.
కస్టమర్లకే కాదు మీడియా వాళ్లకు కూడా తెలియదు.
ఏంటి గురు! మన బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఎట్లా చెప్పుకోవాలి.
ఇలా, ఓలా ఉబర్‌లతో వచ్చే చిక్కులు ఒకటా రెండా...
ఒకసారి బిల్ పే చేసినా మళ్లీ డబ్బులు కట్టమంటారు. పేమెంట్ పూర్తి కాలేదంటూ వరస మెసేజ్‌లు, మెయిళ్లు పంపుతూ చికాకు పెడుతుంటారు.
యాప్ ద్వారా బిల్ పే చేసినా, పేమెంట్ పూర్తి కాలేదంటూ డ్రైవర్ డబ్బులు వసూలు చేస్తాడు.
కొందరు డబ్బులు ఇస్తేనే వస్తామని అంటారు...మరికొందరు అదనంగా చెల్లించమంటూ తిరకాసులు పెడుతుంటారు.
క్యాబ్ బుక్ చేస్తాం...ఫోన్ చేసి ఎక్కడికి పోవాలి సర్, అంటూ డ్రైవర్లు మర్యాదగా అడుగుతారు. వస్తున్నా అంటూ ఒట్టేసి మరి చెబుతారు. తీరా చూస్తే మనల్ని నడి బజారులో నిలబెట్టించి నిలువునా క్యాన్సిల్ చేస్తారు.
ఒక్కరా ఇద్దరా...ఉబర్, ఓలాలలో దయామయుడైన డ్రైవర్ ఎవరో ఒకరు కరుణించే వరకు ఇదే తంతు.

ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే కానీ ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది.
ఆయన పేరు మోహన్.
దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి మయూర్ విహార్ పేజ్-1 ఎక్స్‌టెన్సన్ వెళ్లడానికి జులై 31న ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు.
ఆ రెండు ప్రాంతాల మధ్య దూరం సుమారు 30 కిలోమీటర్లు. ఈ దూరానికి సాధారణంగా రూ.600 ఆ పైన ఉంటుంది. ఉబర్, ఓలాలో కాస్త అటుఇటుగా ఇంతే ఉంటుంది.
కానీ మోహన్‌కు ఎంత చార్జ్ చేశారో తెలుసా... రూ.2,414. అంటే కిలోమీటరుకు సుమారు 80 రూపాయలు.
బిల్లు చూసి మోహన్ షాక్ అయ్యారు.

బిల్లు డీటైల్స్ పూర్తిగా చూశాక ఆశ్చర్యపోయే సంగతులు తెలిశాయి.
పికప్ లొకేషన్:
దిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-2లో ఉండి మోహన్ క్యాబ్ బుక్ చేశారు. అంటే అదే పికప్ లొకేషన్ కావాలి. కానీ ఓఖ్లాలోని జామియా నగర్‌ను పికప్ లొకేషన్‌గా బిల్లు చూపిస్తోంది.
ఇది ఎలా సాధ్యం?

ప్రయాణించిన మార్గం:
వాస్తవానికి ఉబర్ క్యాబ్ డ్రైవర్ మోహన్‌ను దిల్లీ ఎయిర్‌పోర్టులో పిక్ చేసుకుని మయూర్ విహార్ ఎక్స్‌టెన్సన్‌లో దించారు.
కానీ, బిల్లులో మాత్రం జామియా నగర్‌లో పిక్ చేసుకుని దిల్లీ ఎయిర్‌పోర్టు మీదుగా మయూర్ విహార్ ఎక్స్‌టెన్సన్‌కు తీసుకొచ్చినట్లుగా చూపిస్తోంది.
ఉబర్ ట్రిప్‌లోని మ్యాప్ చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
జామియా నగర్ నుంచి దిల్లీ ఎయిర్‌పోర్ట్ ఒక దిశలో ఉంటే మయూర్ విహార్ మరొక దిశలో ఉంటుంది.
జామియా నగర్‌కు దగ్గర్లోనే ఉండే మయూర్ విహార్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్ మీదుగా తిరిగి రావాల్సిన అవసరం ఏంటి?

ఫొటో సోర్స్, Google Maps
ప్రయాణించిన దూరం:
బిల్లు ప్రకారం క్యాబ్ ప్రయాణించిన దూరం 129.16 కిలోమీటర్లు.
కానీ వాస్తవానికి దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి మయూర్ విహార్ ఎక్స్‌టెన్సన్‌కు ఉన్న దూరం సుమారు 30 కిలోమీటర్లు.
అసలు దిల్లీ ఈ చివర నుంచి ఆ చివరకు గరిష్టంగా ఉండే దూరమే 52 కిలోమీటర్లు.

ఫొటో సోర్స్, Google Maps
ప్రయాణానికి పట్టిన సమయం
దిల్లీ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలిసిందే. 20-30 కిలోమీటర్లకే గంటకు పైగా పడుతుంది. ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ సమయమే తీసుకుంటుంది.
కానీ ఇక్కడ 129 కిలోమీటర్లను ఉబర్ డ్రైవర్ కేవలం 1 గంట 11 నిమిషాల్లో పూర్తి చేశారు.
అసలు ఇది సాధ్యమా?
మోహన్‌ది కేస్-1 అనుకుంటే ఇలాంటి కేసులు చాలా కనిపిస్తున్నాయి.

కేస్-2
ధనంజయ్ శర్మ అనే వ్యక్తి జులై 29న దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి హరియాణాలోని ఫరీదాబాద్‌కు ఉబర్ బుక్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ రెండింటి మధ్య దూరం సుమారు 36 కిలోమీటర్లు. కానీ వేసిన బిల్లు రూ.2,678.
ఆయనకు వచ్చిన బిల్లు ప్రకారం క్యాబ్ ప్రయాణించిన దూరం 131.2 కిలోమీటర్లు. ఇందుకు పట్టిన సమయం గంట 10 నిమిషాలు.
అలాగే ఆయన చెబుతున్న ప్రకారం బుక్ చేసింది దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే పికప్ లొకేషన్ ఓఖ్లా విహార్ చూపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కేస్-3
జతిన్ చౌహాన్ అనే వ్యక్తి దిల్లీ ఏరో సిటీ నుంచి మాలవీయ నగర్‌కు అగస్ట్ 1న ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నానని చెబుతున్నారు.
దిల్లీ ఏరోసిటీ నుంచి మాలవీయ నగర్‌కు ఉండే దూరం సుమారు 15 కిలోమీటర్లు. కానీ తనకు రూ.1,283 చార్జ్ చేశారని జతిన్ తెలిపారు.
అలాగే తన పికప్ లొకేషన్ ఓఖ్లా విహార్ చూపిస్తోందని ట్విటర్ ద్వారా ఉబర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ మూడు కేసుల్లో కామన్‌గా రెండు అంశాలు కనిపిస్తున్నాయి.
ఒకటి అందరూ దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచే ఉబర్ క్యాబ్ బుక్ చేశారు.
రెండు అందరికీ 'ఓఖ్లా'నే పికప్ లొకేషన్‌గా చూపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఓలాలోనూ...
ఓలా లోనూ ఇలాంటి కేసే కనిపించింది.
జులై 30న పశ్చిమ బెంగాల్‌కు చెందిన పంకజ్ పాల్ అనే వ్యక్తి హౌరా రైల్వేస్టేషన్, చర్చి రోడ్ నుంచి చందన్ నగర్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు.
చర్చి రోడ్ నుంచి చందన్ నగర్‌కు మధ్య ఉన్న దూరం సుమారు 39 కిలోమీటర్లు.
కానీ ఈ రైడ్‌కు సంబంధించి ప్రయాణించిన దూరం 107 కిలోమీటర్లుగా ఓలా యాప్ చూపిస్తోంది. ఇందుకు గంట 22 నిమిషాలు పట్టినట్లు చెబుతోంది.
మొత్తం మీద రూ.2,658 బిల్లు వచ్చింది.
కానీ ఈ కేసులో పికప్ లొకేషన్‌లో ఎటువంటి ఇబ్బంది లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ కేసులన్నీ చూస్తుంటే ఏదో తేడా అయితే కనిపిస్తోంది. ఇది సాంకేతిక సమస్యా లేక మరేదైనా కొత్త తరహా మోసమా? అనేది తెలియడం లేదు.
కాస్త వీటి గురించి వివరంగా ఆ సంస్థలకు చెబుదామంటే కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు.
సోషల్ మీడియాలో ఉబర్, ఓలా కస్టమర్లు తరచూ అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే.

ఫొటో సోర్స్, OLA
దేశంలో ఓలా సేవలు మొదలై 10 ఏళ్లు దాటింది. మరొక ఏడాది అయితే ఉబర్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. కానీ ఇంత వరకు కస్టమర్ కేర్ కోసం ప్రత్యేక ఒక నెంబర్‌ను అవి కేటాయించలేదు.
ఉబర్, ఓలా యాప్‌లో చూడండి...లేదంటే వాటి వెబ్‌సైట్‌లోకి వెళ్లండి... కస్టమర్ల కోసం కాంటాక్ట్ నెంబర్ ఎక్కడా కనిపించదు.
ఇదే విషయం మీద గతంలో ఓలా, ఉబర్‌కు బీబీసీ మెయిల్ చేసింది. కానీ వారి నుంచి ఇంత వరకు సమాధానం రాలేదు.
హరికృష్ణ గంగిడి అనే వ్యక్తి ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా ఉబర్‌ను అడిగారు. ప్రస్తుతం తాము ఫోన్ సపోర్ట్ ఇవ్వడం లేదని, యాప్ ద్వారానే సాయం చేస్తున్నట్లు ఉబర్ ఆయనకు సమాధానం ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ప్రయాణించిన దూరాన్ని ఎక్కువగా చూపడం, పికప్ లొకేషన్‌ను తప్పుగా చూపించడం, డబ్బులు ఎక్కువగా వసూలు చేయడం వంటి వాటి వల్ల కస్టమర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు.
ఆ సమస్యలు చెప్పుకోవడానికి కస్టమర్ కేర్ నెంబర్ లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- ఏపీ, తెలంగాణల్లో డబ్బును బ్యాంకుల్లో వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది... ఆ సొమ్మును ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యం మీదకు గ్రెనేడ్ విసిరా"
- ఇండియా హిందూ దేశంగా మారుతోందా
- ఒక అనాథ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారు?
- ఏ మేఘాల వల్ల వాన కురుస్తుంది... ఏవి ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













