అరబ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులపై ముస్లిం విద్వేష రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుంది

అరబ్ దేశాల్లో అనేక మంది భారతీయులు పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరబ్ దేశాల్లో అనేక మంది భారతీయులు పని చేస్తున్నారు.
    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ హిందీ

తేజస్వి సూర్య 31 ఏళ్ల యువ పార్లమెంట్ సభ్యుడు. 2015లో ఆయన చేసిన ఒక ట్వీట్ రెండేళ్ల క్రితం వివాదాస్పదంగా మారింది. తేజస్వి సూర్య తన ట్వీట్‌లో "95 శాతం మంది అరబ్ మహిళలు గత కొన్ని వందల సంవత్సరాలుగా భావప్రాప్తి పొందలేదు" అని రాశారు.

తేజస్వి సూర్య ఎంపీ కాగానే ఆయన ట్వీట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో అరబ్ దేశాల నుంచి కూడా తీవ్ర ప్రతిస్పందన ఎదురైంది.

అప్పుడు పార్టీ ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఐదేళ్ల తర్వాత సూర్య ఆ ట్వీట్‌ను తొలగించారు. ఇటీవల 37 ఏళ్ల బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు పార్టీ మరోసారి అంతర్జాతీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది.

ఒక న్యూస్ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నూపుర్ శర్మతో పాటు మరో బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ కూడా ప్రవక్త పై అభ్యంతరకర ట్వీట్ చేశారు.

వీరిద్దరి వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల నుంచి తీవ్ర నిరసన రావడంతో.. భారత్ క్షమాపణలు చెప్పాలని ఖతర్ కోరింది.

దీంతో, ఇది పార్టీ అభిప్రాయం కాదని చెబుతూ బీజేపీ నూపుర్ శర్మను సస్పెండ్ చేసి, నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.

అరబ్ దేశాలతో భారత్ సంబంధాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. గల్ఫ్ లో పని చేస్తున్న ఉద్యోగుల్లో హిందూ జనాభా కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 35 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు.

ఇది యూఏఈ మొత్తం జనాభాలో 30 శాతం. సౌదీ అరేబియాలో కూడా లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు.

2019 అక్టోబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్టోబర్ 29న అరబ్ న్యూస్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వైరుధ్య రాజకీయాలు

ఈ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "సుమారు 26 లక్షల మంది భారతీయులు సౌదీ అరేబియాను తమ రెండవ ఇంటిగా మార్చుకున్నారు. ఈ దేశ ప్రగతికి వారు కూడా సహకరిస్తున్నారు. హజ్ యాత్ర, వ్యాపారం కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భారతీయులు ఇక్కడికి వస్తుంటారు. సౌదీలో మీ కోసం మీరు కల్పించుకున్న స్థానాన్ని చూసి భారతదేశం గర్వపడుతోంది. వారి కృషి, నిబద్ధత వల్ల సౌదీలో భారత్ పట్ల గౌరవం పెరిగింది. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు దోహదపడింది. సౌదీతో మీ సంబంధం ఇలాగే కొనసాగుతుందని మేము భావిస్తున్నాం" అని అన్నారు.

ఈ ప్రాంతంలో భారతదేశంలోని 80 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ఇక్కడున్న లక్షలాది మంది భారతీయులు ఇక్కడ నుంచి కోట్ల డాలర్లు సంపాదించి భారతదేశానికి పంపుతున్నారు. 2018లో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు భారతదేశానికి 87బిలియన్ డాలర్లు పంపారు. ఇందులో గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయుల సహకారం 45 శాతానికి పైగా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు చెప్పారు.

ఇంధన భద్రత విషయంలో భారత్ కూడా గల్ఫ్ దేశాల పై ఆధారపడి ఉంది.

భారతదేశం తన ముడి చమురులో 18 శాతం సౌదీ అరేబియా నుంచి 30 శాతం ఎల్‌పీజీ అవసరాలను సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంటుందని 2019లో సౌదీ అరేబియాను సందర్శించినప్పుడు ప్రధాని మోదీ చెప్పారు.

ఇరాక్, ఇరాన్‌ల నుంచి కూడా భారతదేశం చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతి చేసుకుంటోంది. యూఏఈ భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా సౌదీ అరేబియా నాల్గవ స్థానంలో ఉంది.

సౌదీ యువరాజుతో భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ యువరాజుతో భారత ప్రధాని మోదీ

ఒకవైపు ప్రధాని మోదీ, సౌదీ అరేబియాలో భారతీయులు సాధించిన ఘనత భారతదేశానికి గర్వకారణమని చెబుతుంటే, మరోవైపు ఆయన పార్టీ నేతలు మొహమ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారా? విదేశాంగ విధానాన్ని అనుసరించడంలో బీజేపీ రాజకీయాలు బలహీనంగా ఉన్నాయా?

జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో పశ్చిమ ఆసియా దేశాల నిపుణురాలు ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య మాట్లాడుతూ, "బీజేపీ దేశ రాజకీయాలు విదేశాంగ విధానానికి పెద్ద దెబ్బగా ఉన్నాయి. దేశ రాజకీయాలు కూడా విదేశాంగ విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ రాజకీయాలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల జీవనోపాధిపై ప్రభావం చూపుతాయి. చాలా సంస్థలు భారతీయులకు ఉద్యోగాలను ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. అరబ్ దేశాల ఆగ్రహంతో భారత్‌కు జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది.

ఆయిల్ ఇవ్వడం మానేస్తారని కాదు. 1973లో ఇజ్రాయెల్ వల్ల గల్ఫ్ దేశాలు పశ్చిమ దేశాలకు ఆయిల్ ఇవ్వడం మానేశాయి. కానీ, ఇజ్రాయెల్‌ పై భారత్‌ అవలంబించిన వైఖరి వల్ల సౌదీ అరేబియా భారతదేశానికి చమురు ఇవ్వడాన్ని ఆపలేదు" అని అన్నారు.

''డబ్బులతో చమురు కొనుక్కోవడం మాత్రమే భారత్ కు అరబ్ దేశాలతో ఉన్న సంబంధం కాదు. ఇరు దేశాల మధ్య సంబంధం సాంస్కృతం, చారిత్రకం కూడా. భారతీయులు ఎంతో కష్టపడి ఆ దేశాల్లో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. బీజేపీ రాజకీయాలు వారి శ్రమ పై నీళ్లను చల్లుతాయి. అబుదాబీలో మందిరానికి శంకుస్థాపన చేసి స్వదేశంలో చవకబారు రాజకీయాలు చేస్తున్నారు" అని ఆమె అన్నారు.

"భారతీయ విదేశాంగ విధానానికి ఒక స్థాయి ఉండటం వల్లే విదేశాల్లో దేశానికొక ప్రతిష్ట ఉంది. ఈ ప్రతిష్టను నాశనం చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయి. భారతీయ వస్తువులను బహిష్కరించాలని ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ప్రచారం మొదలైంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, టర్కీ ఇకపై 'తుర్కియా'.. ఈ దేశం తన పేరు ఎందుకు మార్చుకుంది?
యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

అరబ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు ఏం చెబుతున్నారు?

అలహాబాద్‌కు చెందిన డాక్టర్ తారిక్ అఫాక్ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సర్జన్. భారతదేశంలో జరుగుతున్న ఈ సంఘటనలు సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయుల పై ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన బీబీసీకి చెప్పారు.

డాక్టర్ అఫాక్ మాట్లాడుతూ, "ఈ దేశంలో నిరసనలు చేయడాన్ని నిషేధించారు. మీడియాకు కూడా పరిమితులు ఉన్నాయి. స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారోనని పెద్దగా ఆలోచించడం లేదు. కానీ, ఇలాంటి ప్రభావం వ్యక్తిగతంగా ఉంటుంది. ఒక ముస్లింకు, ముహమ్మద్ ప్రవక్త సర్వస్వం. ఆయనను అవమానించడాన్ని ఎవరూ సహించరు" అని అన్నారు.

"ఇలాంటి పరిస్థితులు తలెత్తడం వల్ల ఇక్కడ పనిచేసే హిందువులకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ఇక్కడ నివసించే హిందువులకు సౌదీ అరేబియా, మహమ్మద్ ప్రవక్త కు ఉన్న సంబంధం గురించి కూడా బాగా తెలుసు. ఇక్కడ భారతీయుల ప్రతిష్ట కూడా బాగానే ఉంది. కానీ దేశంలో ఇలాంటి రాజకీయాలు కొనసాగితే, భవిష్యత్తులో దాని ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగాలు ఇవ్వడానికి నిరాకరిస్తారు. అరబ్ దేశాలు ప్రతిస్పందించక ముందే బీజేపీ తన అధికార ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటే బాగుండి ఉండేది. అలా చేసి ఉంటే మేం కూడా గర్వంగా ఫీల్ అయి ఉండేవాళ్ళం. భారతదేశ లౌకిక ప్రతిష్టను బలపరిచి ఉండేది.

సౌదీ యువరాజుతో భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ యువరాజుతో భారత ప్రధాని మోదీ

బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన శ్యామ్ కుమార్ దుబాయ్‌లోని ఓ భారతీయ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. ఆయన బీజేపీ మద్దతుదారు.

నూపుర్ శర్మ వ్యాఖ్యలు, అరబ్ దేశాల స్పందన గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. హిందువుగా దుబాయ్‌లో ఎప్పుడైనా వివక్షను ఎదుర్కోవడం లేదా హిందూ విగ్రహాల గురించి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా అభ్యంతరకర వ్యాఖ్య వచ్చిందా? అని అడిగాను.

ఈ ప్రశ్నకు శ్యామ్ స్పందిస్తూ.. ''అలా ఎప్పుడూ జరగలేదు. హిందువుగా నేను ఎలాంటి వివక్షను ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. నా భార్య కూడా ఇక్కడ ఛత్ పూజ నిర్వహిస్తుంది. సముద్రంలో అర్ఘ్యాన్ని సమర్పిస్తుంది. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు" అని చెప్పారు.

భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్న వివక్ష గురించి నివేదికలను శ్యామ్ ఎలా చూస్తున్నారు?

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ ఆర్ ఐ లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదని శ్యామ్ చెప్పారు.

"చాలా విషయాలు సానుకూలంగా మారాయని నేను భావిస్తున్నాను. యూఏఈ అధికారిక కార్యాలయాల్లో కూడా ముఖ్యమైన సమాచారం హిందీలో రాస్తారు. సిఏఏ, ఎన్ ఆర్ సి వివాదం ఉన్నప్పుడు నేను కూడా సోషల్ మీడియాలో రాశాను. కాని చాలా మంది ముస్లిం స్నేహితులు కోపంతో ఫేస్ బుక్ ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. నూపూర్ శర్మ వ్యాఖ్య విషయానికొస్తే, ఆమె కొంచెం ఎక్కువగానే మాట్లాడారు. ఒకరి మత ఆరాధకుల గురించి మనం మాట్లాడకూడదు" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులపై కూడా ఇలాంటి వ్యాఖ్యల ప్రభావం ఉంటుందా?

శ్యామ్ మాట్లాడుతూ '' డబ్బు, ఉపాధి, వ్యాపారం భాగం ఇక్కడి దైనందిన జీవితంలో భాగం. మత వివాదాల గురించి ఎటువంటి చర్చ లేదు. వ్యక్తిగతంగా ఎవరు ఏమనుకుంటున్నారో చెప్పడం కష్టం. యూఏఈ మతానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణం చేసుకుని వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ఉండేది కాదు. సౌదీ, ఖతర్, కువైట్‌ల తో పోలిస్తే యూఏఈ స్వభావం భిన్నంగా ఉంటుంది.

"భారతదేశం,ఇస్లామిక్ దేశాల మధ్య సంబంధం ఏకపక్షం కాదు. ఆ దేశాల్లో చమురు ఉంది, కానీ ఆ చమురు 50ఏళ్లకు పైన ఉండదు. వారు ఆహార పదార్ధాలు, పానీయాల కోసం ఇతర దేశాల పై ఆధారపడతారు. ఇక్కడ పని చేస్తున్న భారతీయులకు వారేమీ అదనంగా ఉపకారం చేయడం లేదు. ఇక్కడ పని చేస్తున్న భారతీయుల్లో కార్మికుల నుంచి సంస్థల సిఈఓల వరకు ఉంటారు" అని ఆయన అన్నారు.

బీహార్‌కు చెందిన రామేశ్వర్ సా సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లోని ఓ నిర్మాణ కంపెనీలో కార్మికునిగా పని చేస్తున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై, అరబ్ దేశాల స్పందన గురించి ప్రశ్నించగా.. ''ఫేస్‌బుక్ ద్వారా నాకీ విషయం తెలిసింది. కానీ సౌదీ అరేబియాలో ప్రజలు కేవలం పనిపూర్తి చేసుకుని ఇంటికి వెళతారు. మతమే అన్నీ ఇస్తుందని అనుకుంటే నాకు భారతదేశంలోనే ఉద్యోగం లభించి ఉండేది నేను నా భార్య, పిల్లలకు దూరంగా వేరే దారి లేక ఉంటున్నాను. ఇక్కడ భారత్ ప్రతిష్ట బాగానే ఉంది కానీ భారత రాజకీయాలు ఇలాగే కొనసాగితే ప్రతిష్ట దెబ్బ తింటుంది. భారత్ కున్న ప్రతిష్ట వల్ల ఇక్కడ పాకిస్తానీయులు కూడా తాము భారత్ కు చెందినవారిమని చెప్పుకుంటూ ఉంటారు. భారతీయులు అలా చెప్పుకునే పరిస్థితి రానివ్వకండి" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

భారత్లోని అంతర్గత రాజకీయాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా?

"ఈ అంశం పై చాలా జాగ్రత్త వహించాలి. అధికారంలోకి వచ్చేందుకు ఇలాంటి రాజకీయాలను అవలంబించే అలవాటును మానుకోవాలి. ఇది ఆర్ధిక వ్యవస్థను, విదేశాంగ విధానాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుంది" అని యుపిఎ-2లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు.

యూఏఈ, భారత్ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం జరగనుంది.

సౌదీ అరేబియా 2019లో భారతదేశంలో పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, రిఫైనరీలలో $100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెడతామని హామీ ఇచ్చింది.

చాబహార్ ఓడరేవు ప్రాజెక్టులో భారత్ ఇరాన్‌తో కలిసి పనిచేస్తోంది. తాలిబాన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశ ప్రయోజనాలకు ఇప్పటికే ముప్పు వాటిల్లింది. హిందూ-ముస్లిం విద్వేష రాజకీయాల ద్వారా భారతదేశం తన ప్రయోజనాలను నెరవేర్చుకోలేదు.

సౌదీ అరేబియాలో భారత రాయబారిగా పనిచేసిన తల్మీజ్ అహ్మద్ మాట్లాడుతూ.. అరబ్ దేశాల్లో భారత్ పట్ల చాలా గౌరవం ఉందని ఇటువంటి రాజకీయాలు ఆ గౌరవాన్ని నాశనం చేస్తాయని అన్నారు.

"అరబ్ దేశాల్లో నిరసనలను నిషేధించారు. దీంతో, ప్రజలు వీధుల్లోకొచ్చి నిరసనలు చేయరు. కానీ, సామాన్య ప్రజల మనస్సులో కూడా ఈ అంశం పై ఆగ్రహం ఉంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో ఎందుకు నిర్మించారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)