స్పైస్‌జెట్‌పై ర్యాన్‌సమ్‌వేర్ అటాక్.. నిలిచిపోయిన విమాన సేవలు

స్పైస్‌జెట్

ఫొటో సోర్స్, Getty Images

తమ సిస్టమ్స్‌పై ర్యాన్‌సమ్‌వేర్ అటాక్ జరిగిందని భారత్‌కు చెందిన స్పైస్‌జెట్ వెల్లడించింది. ఈ సైబర్‌దాడి వల్ల చాలా విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఎక్కువసేపు ఎదురుచూడాల్సి వచ్చింది.

తమ విమానాలు ఆలస్యమయ్యాయంటూ బుధవారం చాలా మంది స్పైస్‌జెట్ టికెట్లు బుక్‌చేసుకున్న ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ట్వీట్లు చేశారు.

బోర్డింగ్ కోసం గంటల నుంచీ ఎదురుచూస్తున్నామని చాలా మంది ఫోటోలు ట్వీట్ చేశారు. అయితే, వీటిపై మొదట స్పైస్‌జెట్ స్పందించలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయని స్పైస్‌జెట్ ఆ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘మా ఐటీ బృందం ఆ ర్యాన్‌సమ్‌వేర్ దాడిని పసిగట్టింది. పరిస్థితులు ఇప్పుడు సాధారణానికి వచ్చేశాయి. విమాన రాకపోకలను కూడా పునరుద్ధరించాం’’అని సంస్థ ఒక ట్వీట్ చేసింది.

వీడియో క్యాప్షన్, దిల్లీ- వైజాగ్: విమాన ప్రయాణం ఇలా సాగింది

ఆ తర్వాత కూడా..

స్పైస్‌జెట్ ట్వీట్ తర్వాత కూడా చాలా మంది ప్రయాణికులు తాము వేర్వేరు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయామని సోషల్ మీడియాలో వెల్లడించారు.

తమకు కనీసం ఆహారం లేదా నీరు కూడా ఇవ్వలేదని, అసలు ఏం జరిగిందో తమకు చెప్పలేదని వారు చెప్పారు.

ధర్మశాలకు వెళ్లాల్సిన తన విమానం మూడు గంటలకుపైగా ఆలస్యం అయ్యిందని ప్రయాణికుడు ముదిత్ షేజ్వార్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘మేం విమానం ఎక్కి ఇప్పటికే 80 నిమిషాలు గడిచింది. కానీ, అసలు విమానం బయల్దేరలేదు. సర్వర్ డౌన్ అయ్యిందని మాకు చెప్పారు. అసలు ఇది నిజమేనా?’’అని ఆయన ట్వీట్ చేశారు.

అసలు విమానం ఎక్కడుందో చెప్పాలని అడిగినప్పుడు, గేట్ దగ్గర నుంచి సిబ్బంది వెళ్లిపోయారని మరికొందరు ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, భవిష్యత్తులో ప్రయాణాలు ఇలా ఉంటాయి

ఇంకా ఆపరేషన్లు మొదలుకాలేదని, అసలు ఏం జరిగిందో స్పైస్‌జెట్ సిబ్బందికి కూడా తెలియదని మరికొందరు ఫిర్యాదు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘‘మాతోపాటు పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారికి కనీసం ఆహారం లేదా నీరు కూడా ఇవ్వలేదు. గేట్ల దగ్గర ఎవరూ లేరు’’అని ఒక ప్రయాణికుడు ట్వీట్ చేశారు. కస్టమర్ సర్వీస్ నంబర్లు కూడా నాట్‌రీచబుల్ అని వస్తున్నాయని మరికొందరు చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో ఒక వ్యక్తి తన భార్య ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో ఆమె కాలికి గాయమైనట్లు కనిపిస్తోంది. విమానం కోసం గంటల నుంచి ఎదురుచూస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు రుసుము చెల్లించకపోవడంతో కొన్ని స్పైస్‌జెట్ విమానాలకు గత వారం అనుమతులు ఇవ్వలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. తమ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య వల్ల తాము చెల్లింపులు చేయలేకపోయాని ఎయిర్‌లైన్ కూడా పేర్కొంది.

భారత్‌లోని విమానాశ్రయాలు ఏఏఐ ఆధీనంలో ఉంటాయి. చెల్లింపుల అనంతరం స్పైస్‌జెట్‌ విమానాల రాకపోకలకు ఏఏఐ అనుమతి ఇస్తోంది. ఇదివరకు సంస్థకు క్రెడిట్ సదుపాయం ఉండేది. కానీ, చెల్లింపులు సరిగా చేయకపోవడంతో ఆ సదుపాయాన్ని ఏఏఐ ఉపసంహరించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)